
చెన్నై: పెళ్లిళ్ల సీజన్‌కు మరింత శోభను చేకూర్చేందుకు జోస్ ఆలుక్కాస్ ‘‘శుభ మాంగళ్యం బ్రైడల్ కలెక్షన్ – 2023 ఫెస్టివ్ ఎడిషన్’’ ను ఆవిష్కరించింది. చెన్నైలో జరిగిన ఒక ప్రత్యేక కార్యక్రమంలో ఆభరణాల కలెక్షన్‌ను సినీ నటులు కీర్తి సురేశ్, అనార్కలి మారికర్‌లు ప్రారంభించారు. ఇందులోని ప్రతి ఆభరణాన్ని భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడేలా రూపొందించామని సంస్థ చైర్మన్ జోస్ ఆలుక్కాస్ తెలిపారు.
స్వచ్ఛమైన బంగారు ఆభరణాలపై 4.99% తరుగు చార్జీలు ఆఫర్ చేస్తుంది. వజ్రాభరణాలపై 20%, ప్లాటినం వస్తువులపై 7% డిస్కౌంట్ అందిస్తుంది. ఎస్‌బీఐ కార్డు, పెళ్లి కోసం బంగారం కొనుగోలుపై 5% ప్రత్యేక క్యాష్‌బ్యాక్ ఆఫర్ లభిస్తుంది. ఇప్పటికే ఆభరణాల బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. కలెక్షన్ ఆవిష్కరణ కార్యక్రమంలో సంస్థ మేనేజింగ్ డైరెక్టర్లు వర్గీస్ ఆలుక్కా, పాల్ జె ఆలుక్కా, జాన్ ఆలుక్కాలు పాల్గొన్నారు
Comments
Please login to add a commentAdd a comment