హైదారాబాద్: జోస్ అలుక్కాస్ ‘నిత్యారా’ పేరుతో కొత్త డైమండ్ కలెక్షన్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది. హైదరాబాద్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో ఈ వజ్రాభరణాల శ్రేణిని సినీ నటి కీర్తీ సురేష్ ఆవిష్కరించారు. ‘‘అత్యుత్తమ వజ్రాలు, రత్నాలతో నిపుణులైన డిజైనర్లు, ప్రావీణ్యం కలిగిన కళాకారుల ‘నిత్యారా’ ఆభరణాలు రూపొందించారు.
చీరలతో మాత్రమే కాకుండా ఆధునిక దుస్తులతో సైతం కలిసిపోయేలా అన్ని ఆధునిక హంగులతో ఆభరణాలు తీర్చిదిద్దారు’’ అని కంపెనీ తెలిపింది. ఈ కార్యక్రమంలో జోస్ ఆలుక్కాస్ ఎండీలు వర్ఘీస్ ఆలుక్కా, పాల్ ఆలుక్కా, జాన్ ఆలుక్కా పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment