Bridal Collection
-
Tarun Tahiliani: బంగారం లాంటి బ్రైడల్ కలెక్షన్ (ఫొటోలు)
-
కాలికి ధరిస్తే కళ్లు పట్టేస్తున్నాయి..
అందమైన పాదాలను అంటిపెట్టుకునే అందియలు అమ్మాయిలకు అత్యంత ఇష్టం అందుకే, పట్టీలు వారి అలంకరణలో ఎప్పుడూ ప్రత్యేకతను నింపుకుంటాయి. ఈ ఆధునిక యుగంలో అమ్మాయిలు పట్టీలు పెట్టుకోవడం లేదు అనే నిన్నటి తరం నిరాశను దూరం చేస్తూ... ఆంకిల్స్ పేరుతో వచ్చి కొత్తగా చేరిపోయాయి. వాటితో పాటు బంగారు, వెండి, డైమండ్ ఆభరణాలలోనూ, ఇమిటేషన్ జ్యువెలరీలోనూ సగం పాదాన్ని కప్పేస్తున్నట్టుగా ఉండే పట్టీల డిజైన్లు ఎన్నో వచ్చాయి. సందర్భానికి తగినట్టు అలంకరించుకోవడానికి వేటికవి ప్రత్యేకతను కలిగి ఉంటున్నాయి. కాలికి ధరించేవే అయినా కళ్లనూ పట్టేస్తున్నాయి. మొఘలాయ్ రాణివాసపు హంగు కాలి అందియలలోనూ కనిపిస్తుంది. పెళ్లి పల్లకీ, రాజు రాణీ, నెమళ్లు, పువ్వుల డిజైన్లతో ఆకట్టుకుంటున్న పట్టీలు నేటితరం అమ్మాయిలను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. పూసలు, రత్నాలు వరసలుగా అల్లుకుపోయిన పూసలు కాలి పట్టీలుగా అమరి ఆధునికతనూ, సంప్రదాయతకు మేళవింపుగా ఉన్నాయి. పెద్ద పెద్ద రత్నాలు వీటిలో విశేషంగా అమరిపోయాయి. ఆధునికత... స్నేక్, రౌండ్ స్టైల్లో ఉండే బంగారు, వెండి ఆంక్లెట్ మోడ్రన్ స్టైల్‌కి అదనపు హంగుగా అమరుతున్నాయి. ఇవి చదవండి: ఇదేందయ్యా ఇది..! డెస్టినేషన్ వెడ్డింగ్.. వేరే లెవల్! -
జోస్ ఆలుక్కాస్ శుభ మాంగళ్యం బ్రైడల్ కలెక్షన్స్–2023
చెన్నై: పెళ్లిళ్ల సీజన్‌కు మరింత శోభను చేకూర్చేందుకు జోస్ ఆలుక్కాస్ ‘‘శుభ మాంగళ్యం బ్రైడల్ కలెక్షన్ – 2023 ఫెస్టివ్ ఎడిషన్’’ ను ఆవిష్కరించింది. చెన్నైలో జరిగిన ఒక ప్రత్యేక కార్యక్రమంలో ఆభరణాల కలెక్షన్‌ను సినీ నటులు కీర్తి సురేశ్, అనార్కలి మారికర్లు ప్రారంభించారు. ఇందులోని ప్రతి ఆభరణాన్ని భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడేలా రూపొందించామని సంస్థ చైర్మన్ జోస్ ఆలుక్కాస్ తెలిపారు. స్వచ్ఛమైన బంగారు ఆభరణాలపై 4.99% తరుగు చార్జీలు ఆఫర్ చేస్తుంది. వజ్రాభరణాలపై 20%, ప్లాటినం వస్తువులపై 7% డిస్కౌంట్ అందిస్తుంది. ఎస్బీఐ కార్డు, పెళ్లి కోసం బంగారం కొనుగోలుపై 5% ప్రత్యేక క్యాష్‌బ్యాక్ ఆఫర్ లభిస్తుంది. ఇప్పటికే ఆభరణాల బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. కలెక్షన్ ఆవిష్కరణ కార్యక్రమంలో సంస్థ మేనేజింగ్ డైరెక్టర్లు వర్గీస్ ఆలుక్కా, పాల్ జె ఆలుక్కా, జాన్ ఆలుక్కాలు పాల్గొన్నారు -
తారల మెరుపులతో మనీష్ మల్హోత్రా ఈవెంట్ (ఫొటోలు)
-
డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌తో చేతులు కలిపిన తనిష్క్
హైదరాబాద్: ప్రీమియం స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌తో రిటైల్ జ్యువెలరీ బ్రాండ్ తనిష్క్ చేతులు కలిపింది. వివాహ వేడుకల వేళ ఓటీటీ వేదికగా ‘ద గ్రేట్ ఇండియన్ బ్రైడ్’ పేరుతో సరికొత్త షోను విడుదల చేయనుంది. దేశంలో భిన్న సంస్కృతి, విభిన్న ప్రాంతాలకు చెందిన ఐదుగురు వధువులు తనిష్క్ కో-బ్రాండ్ రివా రూపొందించిన వివాహ ఆభరణాలను ధరించి తమ పెళ్లి నాటి అనుభూతులను నటి శ్రియా పిల్గాంకర్తో పంచుకోనున్నారు. (దోమలను తోలేసినంత తేలిగ్గా ఉద్యోగ కోతలు, ఎన్నాళ్లీ వేట?) ప్రతి సంప్రదాయానికి ఆభరణం రివా అనే ట్యాగ్‌లైన్‌తో కంటెంట్‌ను అత్యంత సృజనాత్మకంగా డిజైన్ చేశామని టైటాన్ మార్కెటింగ్ జీఎం రంజనీ కృష్ణస్వామి తెలిపారు. ‘‘టైటాన్ వంటి సుప్రసిద్ధ బ్రాండ్‌తో కలిసి పనిచేయడంతో పాటు వినూత్న కథనం ద్వారా సబ్స్క్రైబర్లతో మా బంధం మరింత బలపడుతుంది’’ అని డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ అధికార ప్రతినిధి పేర్కొన్నారు. (మరో టెక్ దిగ్గజం సంచలన నిర్ణయం: ఉద్యోగులకు ఇక గడ్డుకాలమేనా?) -
క్లాసిక్ బ్రైడల్ జ్యువెలరీ డిజైన్లను ప్రారంభించిన రిలయన్స్ జ్యువెల్స్..!
భారత్‌లో అత్యంత విశ్వసనీయమైన జ్యువెలరీ బ్రాండ్‌గా పేరొందిన రిలయన్స్ జ్యువెల్స్ సరికొత్త క్లాసిక్ బ్రైడల్ జ్యువెలరీ డిజైన్లను విడుదల చేసింది.వీటిలో హ్యాండ్‌క్రాఫ్టెడ్, హెరిటేజ్ గోల్డ్, డైమండ్ ఆభరణాలు కొనుగోలుదారులకు అందుబాటులో ఉండనున్నాయి. ఈ కలెక్షన్ వివాహ వేడుకలకు మాత్రమే కాకుండా నిశ్చితార్ధం, సంగీత్, మెహెందీ, రిసెప్షన్ లాంటి అనేక ఇతర వేడుకలకు సరిపోతాయని రిలయన్స్ జ్యువెల్స్ పేర్కొంది. #SampannVivah థీమ్‌తో వెడ్డింగ్ సీజన్స్‌కు రిలయన్స్ జ్యువెల్స్ సన్నాహమైంది. ఈ నూతన ఆభరణాల శ్రేణితో కాబోయే నవవధువుల జీవితాల్లో సౌభాగ్యం, సంతోషాలు లభించాలని రిలయన్స్ జ్యువెల్స్ కోరుకుంటుంది. భారతీయత ఉట్టిపడేలా వివాహ కలెక్షన్లను రిలయన్స్ జ్యువెల్స్ కొనుగోలుదారులకు అందుబాటులో ఉంచింది. అంతేకాకుండా కొనుగోలుదారులకు రిలయన్స్ జ్యువెల్స్ ప్రత్యేక వివాహ ఆఫర్‌ను డిసెంబర్ 23 వరకు అందించనుంది. ఈ ఆఫర్లో భాగంగా బంగారు ఆభరణాల తయారీ ఛార్జీలు, వజ్రాభరణాల విలువపై 20 శాతం వరకు తగ్గింపు సౌకర్యాన్ని అందించనుంది. ఈ సందర్భంగా రిలయన్స్ జ్యువెల్స్ సీఈవో సునీల్ నాయక్ మాట్లాడుతూ...క్లాసిక్ బ్రైడల్ జ్యువెలరీ కలెక్షన్‌తో ప్రతి ఒక్క వధువు వైవాహిక జీవితం సంతోషంగా, వైభవంగా సాగాలని కోరుకుంటున్నామని పేర్కొన్నారు. భారత వారసత్వ, కళారూపాలు ఉట్టిపడేలా సమకాలీన హ్యండ్క్రాఫ్డ్ డిజైన్స్ ఆకట్టుకుంటాయని అభిప్రాయపడ్డారు. ఈ అద్భుతమైన కలెక్షన్లను దేశవ్యాప్తంగా విస్తరించిన అన్ని రిలయన్స్ జ్యువెల్స్ షోరూమ్స్‌తో పాటుగా, కంపెనీ అధికారిక వెబ్సైట్ నుంచి కొనుగోలు చేయవచ్చునని రిలయన్స్ జ్యువెల్స్ ఒక ప్రకటనలో పేర్కొంది. చదవండి: బంగారం ప్రియులకు భారీ శుభవార్త! -
Geethika Kanumilli: అదిరిపోయే బ్రైడల్ కలెక్షన్.. చూపు తిప్పుకోలేరు!
నుదుటన ధరించే సిందూరం ఎరుపు.. చేతిన పూసిన గోరింటాకు ఎరుపు.. నవ వధువు చెక్కిళ్లు ఎరుపు .. ‘పెళ్లి సంప్రదాయంలో ఎరుపు రంగుకి ఓ ప్రత్యేకత ఉంటుంది. ఆత్మవిశ్వాసానికి ప్రతీకగా ఈ ఎరుపు మెరుపులను బ్రైడల్ కలెక్షన్ ద్వారా తీసుకువచ్చాను’ అంటున్నారు హైదరాబాద్ డిజైనర్ గీతికా కానుమిల్లి. ‘‘మన ఇతిహాసాలు, పురాణాల నుంచి కొన్ని ఆకట్టుకునే థీమ్స్ తీసుకొని, వాటిని బేస్ చేసుకుంటూ డిజైన్ చేయడం ప్రత్యేకాంశంగా ఎంచుకున్నాను’ అని వివరించారు డిజైనర్ గీతికా కానుమిల్లి. హైదరాబాద్ నిఫ్ట్‌లో ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సు చేసిన గీతిక కరోనా తర్వాత చేసిన వెడ్డింగ్ డిజైన్స్‌ని పరిచయం చేస్తూ ‘ఇటీవల కవి పుష్యమిత్ర ఉపాధ్యాయ రాసిన ‘ద్రౌపదీ అందుకో ఆయుధాలను, ఇప్పుడు రక్షించడానికి గోవిందుడు రాడు’ అనే వాక్యం నన్ను అమితంగా ఆకట్టుకుంది. నేటి అమ్మాయిలు ఆత్మస్థైర్యంతో అన్నింటా ముందడుగు వేస్తున్నారు. అలాగే వారు ధరించే దుస్తుల ద్వారా కూడా తమ ఆత్మవిశ్వాసాన్ని ప్రతిఫలింపజేస్తున్నారు. వారి ఆత్మస్థైర్యాన్ని మరింత పెంచేలా ఈ బ్రైడల్ కలెక్షన్లో శారీస్, లెహంగాలకి బెల్ట్స్, పాకెట్స్ డిజైన్ చేశాను. హ్యాండ్ ఎంబ్రాయిడరీలోనూ, అలాగే మన సంప్రదాయానికి కొంత వెస్ట్రన్ స్టైల్‌ని జత చేశాను. కాన్సెప్ట్ డిజైన్ రాబోయే కలెక్షన్లో గరళకంఠుడి థీమ్‌తో నీలం రంగును ఎంచుకొని డిజైన్ చేయబోతున్నాను. ఆ తర్వాత ఐవరీ అంటే దంతం రంగుతో భారతంలోని శకుంతల దుస్తులను స్ఫూర్తిగా తీసుకొని డిజైన్ చేస్తున్నాను. పాశ్చాత్య దేశాల్లో డిజైనర్లు ఏదైనా ఒక కాన్సెప్ట్ ద్వారా తమ ప్రత్యేకతను తమ డిజైన్స్‌లో చూపుతారు. మన దగ్గర ఇంకా అంతగా ఈ కాన్సెప్ట్ డిజైన్ థీమ్ రాలేదు. ముఖ్యంగా మన చారిత్రక కథనాలతోనే ఎన్నో స్ఫూర్తిమంతమైన డిజైన్లు తీసుకురావచ్చు. చేనేత యువత మన చేనేతల ప్రత్యేకత అంతర్జాతీయంగా వెళ్లాలంటే ముఖ్యంగా యువతను ఆకట్టుకునే విధంగా డిజైన్ చేయాలి. అందుకు తగిన ప్లాన్లు చేస్తున్నాను. చేనేతలతో డిజైన్లు ఖరీదైనవి చేయచ్చు. తక్కువ ధరలో వచ్చేలా ఫ్యాన్సీ డ్రెస్సులనూ రూపొందించవచ్చు. ఆ విధంగా కలంకారీ చేనేతతో చేసిన డిజైన్స్ ఉన్నాయి. లవ్ స్టోరీస్... కేవలం సంప్రదాయ డిజైన్స్ మాత్రమే కాకుండా ‘లవ్ స్టోరీస్’ పేరుతో జీరో టు ప్లస్ సైజ్ వరకు అన్ని రకాల వెస్ట్రన్ వేర్, ఇతర అలంకరణ వస్తువుల తయారీ కూడా చేపట్టాను’’ అంటారు తన డిజైన్స్ గురించి పరిచయం చేసిన గీతికా కానుమిల్లి. – గీతికా కానుమిల్లి, ఫ్యాషన్ డిజైనర్ -
జోయాలుక్కాస్ ‘బ్రైడల్ ఫెస్ట్’
హైదారాబాద్: ప్రముఖ ఆభరణాల తయారీ సంస్థ జోయాలుక్కాస్ ‘బ్రైడల్ ఫెస్ట్’ పేరుతో ప్రత్యేక విక్రయాల కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా ఆభరణాల కొనుగోళ్లపై ఆకర్షణీయమైన ఆఫర్లను ప్రకటించింది. వివాహాల కోసం ప్రత్యేకమైన ఆభరణాల శ్రేణిని బ్రైడల్ ఫెస్ట్‌లో భాగంగా అందిస్తున్నట్టు తెలిపింది. ఈ కార్యక్రమంలో భాగంగా వివాహ ప్యాకేజీని ప్రత్యేకంగా తీసుకొచ్చినట్టు ప్రకటించింది. ఆభరణాల తయారీ చార్జీల్లో 30% తగ్గింపు సహా ఇతర ఆఫర్లు అందుబాటులో ఉన్నట్టు తెలిపింది. -
పారాచూట్... ఫొటోషూట్
వెస్ట్రన్ వెడ్డింగ్‌లో బ్రైడల్ వేర్ ఇండియన్ ఫ్యాషన్‌లో బ్రైట్ వేర్ హద్దులు చెరిపేసి ఫొటోషూట్స్‌లో గ్రేట్‌గా వెలిగిపోతోంది పారాచూట్ డ్రెస్. పారాచూట్ మోడల్లో గౌన్లు మాత్రమే కాదు స్కర్ట్స్ కూడా రూపొందించారు డిజైనర్లు. గౌన్లు మాత్రం ఇప్పటికీ పాశ్చాత్యుల వివాహ సమయంలో పెళ్లికూతురు ధరించే డ్రెస్సులుగా పేరుపడిపోయాయి. ఇటీవల మన దగ్గర ప్రీ వెడ్డింగ్ షూట్స్, ప్రొఫైల్ పిక్స్.. కి ఈ పారాచూట్ డ్రెస్ తెగ సందడిచేస్తోంది. ప్లెయిన్ షిఫాన్, సిల్క్ ఫ్యాబ్రిక్‌తో రూపొందించే ఈ డ్రెస్సు ధరిస్తే లీల్లీ, లావెండర్ పూలు గుర్తుకురాకుండా ఉండవు. రెక్కలు విప్పార్చుకుంటూ ఎగిరే సీతాకోకచిలుక కళ్లముందు మెదలకుండా ఉండదు. రక్షణ గౌను రెండవ ప్రపంచ యుద్ధంలో మేజర్ క్లాడ్ హెన్సింగర్కు జరిగిన ప్రమాదంలో పారాచూట్‌ను దుప్పటిగా ఉపయోగించాడు. తనను రక్షించిన నైలాన్ పారాచూట్ క్లాత్‌ను గౌనుగా రూపొందించమని తన ఫ్రెండ్ రూత్‌కు చెప్పాడు. రూత్ ఆ పారాచూట్‌తో వెడ్డింగ్ గౌను డిజైన్ చేసి, 1947లో జరిగిన వారి పెళ్లికి ధరించింది. ఆ తర్వాత ఆమె కూతురు, కోడలు కూడా వారి వివాహ సమయంలో ఈ గౌనును ధరించారు. ఈ పారాచూట్ మోడల్ నుంచి పుట్టుకొచ్చిందే ఈ విహంగ డ్రెస్. ఫెమినా మిస్ ఇండియా మానస వారణాసి డ్రెస్సింగ్ -
ఒక్కో డ్రెస్ ధర లక్షల్లో: నువ్వు కూడా మాట్లాడుతున్నావా?
ఆడపిల్ల పుట్టగానే మహాలక్ష్మి పుట్టిందని ఆనందపడే అమ్మానాన్నలు.. అంతలోనే ఆమె ఆలనాపాలనా కంటే కూడా తన భద్రత గురించిన భయాలతోనే ఎక్కువగా ఆందోళన చెందుతారు. పురుషాధిక్య సమాజంలో ఆమెను కంటికి రెప్పలా కాపాడుకున్నా ఎటువైపు నుంచి ఏ ప్రమాదం ముంచుకు వస్తుందో తెలియదు. అందుకే పెళ్లీడు వచ్చిందంటే చాలు... అప్పు చేసైనా సరే ఆమెను ఓ ‘అయ్య’ చేతిలో పెట్టి అత్తవారింటికి సాగనంపాలని ఆరాటపడతారు. ఈ క్రమంలో, బిడ్డను బాగా చదివిస్తే అంతకంటే ఎక్కువ విద్యావంతుడిని అల్లుడిగా తీసుకురావాల్సి వస్తుందనే భావనతో మధ్యలోనే చదువు మాన్పించే సగటు మధ్యతరగతి తల్లిదండ్రులు నేటికీ అనేక మంది ఉన్నారు. అలాంటి వారు కూతురి చదువు కోసం చేయాల్సిన ఖర్చును ఆమె వివాహం కోసం, ముఖ్యంగా వరకట్నం కోసమే పొదుపు చేస్తారు. అంతచేసినా, ఎంత పెద్దమొత్తంలో కట్నకానుకలు ముట్టజెప్పినా నవ వధువులు అత్తారింట్లో సంతోషంగా ఉంటారనే గ్యారెంటీ లేదు. అదనపు కట్నం కోసం వేధిస్తూ కొత్తకోడళ్ల ఉసురు తీసిన అత్తమామలు, భర్తల గురించి ప్రతిరోజూ ఏదోఒక వార్త మన కంటపడుతూనే ఉంటుంది. కాబట్టి, ఆడబిడ్డలను చదివించుకుంటే అత్తారింట్లో సమస్యలు ఎదురైనా ఏదో ఒక ఉద్యోగం చేస్తూ తమ కాళ్లమీద తాము నిలబడగలిగే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో వరకట్నం అనే దురాచారానికి స్వస్తి పలకాలంటూ, ఐక్యరాజ్యసమితి పాకిస్తాన్ మహిళా విభాగంతో కలిసి ఫ్యాషన్ డిజైనర్ అలీ జీషన్ చేపట్టిన సోషల్ మీడియాలో చేపట్టిన ‘స్టాప్ డౌరీ’ ప్రచారం నెటిజన్లను ఆలోచింపజేస్తోంది. నుమాయిష్- బ్రైడల్ కోచర్ వీక్ 2021లో భాగంగా అలీ వివాహ దుస్తులను డిజైన్ చేశారు. ఇందుకు సంబంధించి.. ‘‘అమ్మాయిల చదువు కంటే కూడా వారి పెళ్లి సమయంలో వరుడికి ఇవ్వాల్సిన కట్నాన్నే ప్రథమ ప్రాధాన్యంగా భావిస్తారు. ఆ అదనపు భారాన్ని తగ్గించే సమయం ఆసన్నం అయ్యింది’’ అని ఆయన షేర్ చేసిన వీడియో నెటిజన్ల ప్రశంసలు అందుకుంటోంది. అయితే, కొంతమంది మాత్రం అలీ రూపొందించే దుస్తుల ధర విషయాన్ని ప్రస్తావిస్తూ నెగటివ్ కామెంట్లు చేస్తున్నారు. ‘‘తల్లిదండ్రులపై పడే భారం గురించి ఇంతలా ఆలోచిస్తున్న అలీ డిజైన్ చేసే ఒక్కో డ్రెస్ ధర వేలల్లో, కొన్నిసార్లు లక్షల్లో కూడా ఉంటుంది. కనీసం 5 లక్షలు పెడితేనే వధూవరులకు ఇష్టమైన దుస్తులు కొనగలుగుతారు. చాలా కుటుంబాల్లో అమ్మాయికి ఇంతకంటే తక్కువే కట్నం ఇస్తారు. అలాంటది, అలీ వరకట్నం గురించి మాట్లాడితే నవ్వొస్తోంది. ఎంతటి నయవంచకుడు తను. ఒక దురాచారం గురించి చెబుతూనే తన బిజినెస్‌ను బాగా ప్రమోట్ చేసుకుంటున్నాడు. ఖరీదైన దుస్తులు వేసి వేయించిన ఈ నాటకం అంతగా పండలేదు’’ అని విమర్శిస్తున్నారు. వీడియోలో ఏముందంటే.. ఆడపిల్ల తల్లిదండ్రులు తొలుత టైర్లతో కూడిన బల్లపరుపు బండిని తీసుకువస్తారు. అనంతం కొత్త కాపురానికి కావాల్సిన వస్తువులన్నీ దానిపై వరుసగా పేరుస్తారు. ఇద్దరూ చెరోవైపు నిల్చుని, బండిని పైకెత్తి, పెళ్లి దుస్తుల్లో ఉన్న కుమార్తెను పిలిచి ఆమెకు దానిని అప్పగిస్తారు. పుట్టింటి వారు ఇచ్చిన కానుకలతో పాటు వరుడు కూడా ఆ బండిపై కూర్చోగా వధువు కన్నీళ్లు పెడుతూనే దానిని లాగే ప్రయత్నం చేస్తుంది. చదవండి: గుర్రంపై ఊరేగుతూ మండపానికి చేరుకున్న వధువు -
ఐష్‌లా కనిపించాలని ఆశ
కాస్త అందం.. దానికి తగ్గట్టుగా ఆత్మవిశ్వాసం ఉంటే బ్యూటీ ఫీల్డ్‌ను కెరీర్‌గా ఎంచుకోవచ్చంటోంది.. మిస్ సుప్ర నేషనల్ ఆశాభట్. కూకట్‌పల్లిలోని సుజనామాల్ మేబాజ్ ఎక్స్‌క్లూజివ్ బ్రైడల్ కలెక్షన్‌ను శుక్రవారం లాంచ్ చేశారు. ఈ ఈవెంట్లో తళుక్కుమన్న ఆశాభట్తో సిటీప్లస్ చిట్‌చాట్.. ..:: శిరీష చల్లపల్లి 2014 ఎప్పటికీ మరచిపోలేను. ఈ నెల 5న నేను ‘మిస్ సుప్ర నేషనల్’గా ఎంపికయ్యాను. ఏషియా నుంచి ఈ కిరీటం దక్కించుకున్న తొలి వనితను నేనే కావడం గర్వంగా ఉంది. మా సొంతూరు కర్ణాటకలోని భద్రావతి. నా స్కూలింగ్ అంతా అక్కడే సాగింది. పూణెలో ఇంటర్ చేశాను. ప్రస్తుతం బెంగళూరులో ఇంజినీరింగ్ చేస్తున్నా. చిన్నప్పటి నుంచీ ఐశ్వర్యరాయ్ అంటే చాలా ఇష్టం. ఆమెలా అందాలరాణిని కావాలని ఆశ పడేదాన్ని. ఇంటర్‌కొచ్చాక నా కలలు నిజం చేసుకునే ప్రయత్నాలు చేశాను. నా పేరెంట్స్ సపోర్ట్‌తో.. ఈ అందాల కిరీటం దక్కించుకున్నాను. అమ్మాయిలకే స్కోప్.. అన్నింటా అబ్బాయిలే పై చేయి అనుకుంటారు. ఆడవాళ్లూ ఎందులోనూ తక్కువకాదు. ఏదైనా సాధించడంలో అమ్మాయిలకే ఎక్కువ స్కోప్ ఉంటుంది. నేను ఈ విషయాన్ని గట్టిగా నమ్మాను, కృషి చేశాను.. గెలిచాను. చిన్నప్పుడు నేను సరదాగా అనుకున్న లక్ష్యాన్ని అందుకున్నాను. ఒక ఐఏఎస్ కావాలన్నా, లాయర్ కావాలన్నా.. ఎంత కష్టపడాలో, ఈ బ్యూటీ ఫీల్డ్‌లో రాణించాలంటే అంతకు మించి కృషి చేయాలి. ఫిజికల్‌గానే కాదు మెంటల్‌గా కూడా అందుకు ప్రిపేర్ అయి ఉండాలి. కాన్ఫిడెంట్ ఉంటే రావొచ్చు.. ప్రతి రోజు ఉదయం 4.30 గంటలకు లేచి గంట పాటు యోగా, తర్వాత రెండు గంటలు జిమ్, ఎరోబిక్స్, ఈవెనింగ్ ఒక గంట బ్రిస్క్ వాకింగ్ చేసేదాన్ని. నాకు ట్రైనర్ ఉన్నా, ఎంకరేజ్మెంట్ కోసం అమ్మ కూడా నాతో పాటు పోటీపడి మరీ వాకింగ్ చేసేది. నా బాడీ ఇంత ఫిట్‌గా ఉండటానికి యోగాసనాలు ఎంతగానో ఉపయోగపడ్డాయి. డైట్ అంటే ఉపవాసం చేయడం కాదు. మూడు గంటలకొకసారి సలాడ్స్, గ్రిల్డ్ శాండ్విచ్, మాల్ట్, సింపుల్ ఫుడ్ ఇలా అన్ని రకాలూ తిన్నాను. కానీ ఆయిల్, ఫ్యాట్ ఉండే ఫుడ్‌కు మాత్రం దూరంగా ఉండేదాన్ని. ఇంతగా కృషి చేస్తేనే ఈ కిరీటంతో మీ ముందు నిలవగలిగాను. టీనేజర్స్‌కు నేను సజెస్ట్ చేసేది ఒక్కటే.. బ్యూటీఫీల్డ్లో అగ్రస్థాయిలో నిలబడగలమన్న కాన్ఫిడెన్స్ మీలో ఉంటే ఈ ఫీల్డ్‌ను మీ కెరీర్‌గా ఎంచుకోవచ్చు. నేను హైదరాబాద్‌కు రావడం ఇదే మొదటిసారి. చాలా కంఫర్ట్‌గా ఉంది. లాస్ట్ ఇయర్ బిజీ షెడ్యూల్‌తో ఇంటికి దూరంగా ఉండాల్సి వచ్చింది. న్యూ ఇయర్లో ఫ్యామిలీతో ఎక్కువ సమయం గడపాలనుకుంటున్నా. ఫొటో: ఎస్.ఎస్.ఠాకూర్