భారత్‌లో అత్యంత విశ్వసనీయమైన జ్యువెలరీ బ్రాండ్‌గా పేరొందిన రిలయన్స్ జ్యువెల్స్ సరికొత్త క్లాసిక్ బ్రైడల్ జ్యువెలరీ డిజైన్లను విడుదల చేసింది.వీటిలో హ్యాండ్‌క్రాఫ్టెడ్, హెరిటేజ్ గోల్డ్, డైమండ్ ఆభరణాలు కొనుగోలుదారులకు అందుబాటులో ఉండనున్నాయి. ఈ కలెక్షన్ వివాహ వేడుకలకు మాత్రమే కాకుండా నిశ్చితార్ధం, సంగీత్, మెహెందీ, రిసెప్షన్ లాంటి అనేక ఇతర వేడుకలకు సరిపోతాయని రిలయన్స్ జ్యువెల్స్ పేర్కొంది.
#SampannVivah థీమ్‌తో వెడ్డింగ్ సీజన్స్‌కు రిలయన్స్ జ్యువెల్స్ సన్నాహమైంది. ఈ నూతన ఆభరణాల శ్రేణితో కాబోయే నవవధువుల జీవితాల్లో సౌభాగ్యం, సంతోషాలు లభించాలని రిలయన్స్ జ్యువెల్స్ కోరుకుంటుంది. భారతీయత ఉట్టిపడేలా వివాహ కలెక్షన్లను రిలయన్స్ జ్యువెల్స్ కొనుగోలుదారులకు అందుబాటులో ఉంచింది. అంతేకాకుండా కొనుగోలుదారులకు రిలయన్స్ జ్యువెల్స్ ప్రత్యేక వివాహ ఆఫర్‌ను డిసెంబర్ 23 వరకు అందించనుంది. ఈ ఆఫర్‌లో భాగంగా బంగారు ఆభరణాల తయారీ ఛార్జీలు, వజ్రాభరణాల విలువపై 20 శాతం వరకు తగ్గింపు సౌకర్యాన్ని అందించనుంది.
ఈ సందర్భంగా రిలయన్స్ జ్యువెల్స్ సీఈవో సునీల్ నాయక్ మాట్లాడుతూ...క్లాసిక్ బ్రైడల్ జ్యువెలరీ కలెక్షన్‌తో ప్రతి ఒక్క వధువు వైవాహిక జీవితం సంతోషంగా, వైభవంగా సాగాలని కోరుకుంటున్నామని పేర్కొన్నారు. భారత వారసత్వ, కళారూపాలు ఉట్టిపడేలా సమకాలీన హ్యండ్‌క్రాఫ్డ్ డిజైన్స్ ఆకట్టుకుంటాయని అభిప్రాయపడ్డారు. ఈ అద్భుతమైన కలెక్షన్లను దేశవ్యాప్తంగా విస్తరించిన అన్ని రిలయన్స్ జ్యువెల్స్ షోరూమ్స్‌తో పాటుగా, కంపెనీ అధికారిక వెబ్‌సైట్ నుంచి కొనుగోలు చేయవచ్చునని రిలయన్స్ జ్యువెల్స్ ఒక ప్రకటనలో పేర్కొంది.
చదవండి: బంగారం ప్రియులకు భారీ శుభవార్త!
క్లాసిక్ బ్రైడల్ జ్యువెలరీ డిజైన్లను ప్రారంభించిన రిలయన్స్ జ్యువెల్స్..!
Published Tue, Nov 23 2021 9:19 PM | Last Updated on Tue, Nov 23 2021 9:28 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment