కాస్త అందం.. దానికి తగ్గట్టుగా ఆత్మవిశ్వాసం ఉంటే బ్యూటీ ఫీల్డ్‌ను కెరీర్‌గా ఎంచుకోవచ్చంటోంది.. మిస్ సుప్ర నేషనల్
ఆశాభట్. కూకట్‌పల్లిలోని సుజనామాల్ మేబాజ్ ఎక్స్‌క్లూజివ్ బ్రైడల్ కలెక్షన్‌ను శుక్రవారం లాంచ్ చేశారు. ఈ ఈవెంట్‌లో
తళుక్కుమన్న ఆశాభట్‌తో సిటీప్లస్ చిట్‌చాట్..
..:: శిరీష చల్లపల్లి
2014 ఎప్పటికీ మరచిపోలేను. ఈ నెల 5న నేను ‘మిస్ సుప్ర నేషనల్’గా ఎంపికయ్యాను. ఏషియా నుంచి ఈ కిరీటం దక్కించుకున్న తొలి వనితను నేనే కావడం గర్వంగా ఉంది. మా సొంతూరు కర్ణాటకలోని భద్రావతి. నా స్కూలింగ్ అంతా అక్కడే సాగింది. పూణెలో ఇంటర్ చేశాను. ప్రస్తుతం బెంగళూరులో ఇంజినీరింగ్ చేస్తున్నా. చిన్నప్పటి నుంచీ ఐశ్వర్యరాయ్ అంటే చాలా ఇష్టం. ఆమెలా అందాలరాణిని కావాలని ఆశ పడేదాన్ని. ఇంటర్‌కొచ్చాక నా కలలు నిజం చేసుకునే ప్రయత్నాలు చేశాను. నా పేరెంట్స్ సపోర్ట్‌తో.. ఈ అందాల కిరీటం దక్కించుకున్నాను.
అమ్మాయిలకే స్కోప్..
అన్నింటా అబ్బాయిలే పై చేయి అనుకుంటారు. ఆడవాళ్లూ ఎందులోనూ తక్కువకాదు. ఏదైనా సాధించడంలో అమ్మాయిలకే ఎక్కువ స్కోప్ ఉంటుంది. నేను ఈ విషయాన్ని గట్టిగా నమ్మాను, కృషి చేశాను.. గెలిచాను. చిన్నప్పుడు నేను సరదాగా అనుకున్న లక్ష్యాన్ని అందుకున్నాను. ఒక ఐఏఎస్ కావాలన్నా, లాయర్ కావాలన్నా.. ఎంత కష్టపడాలో, ఈ బ్యూటీ ఫీల్డ్‌లో రాణించాలంటే అంతకు మించి కృషి చేయాలి. ఫిజికల్‌గానే కాదు మెంటల్‌గా కూడా అందుకు ప్రిపేర్ అయి ఉండాలి.
కాన్ఫిడెంట్ ఉంటే రావొచ్చు..
ప్రతి రోజు ఉదయం 4.30 గంటలకు లేచి గంట పాటు యోగా, తర్వాత రెండు గంటలు జిమ్, ఎరోబిక్స్, ఈవెనింగ్ ఒక గంట బ్రిస్క్ వాకింగ్ చేసేదాన్ని. నాకు ట్రైనర్ ఉన్నా, ఎంకరేజ్‌మెంట్ కోసం అమ్మ కూడా నాతో పాటు పోటీపడి మరీ వాకింగ్ చేసేది. నా బాడీ ఇంత ఫిట్‌గా ఉండటానికి యోగాసనాలు ఎంతగానో ఉపయోగపడ్డాయి. డైట్ అంటే ఉపవాసం చేయడం కాదు. మూడు గంటలకొకసారి సలాడ్స్, గ్రిల్డ్ శాండ్‌విచ్, మాల్ట్, సింపుల్ ఫుడ్ ఇలా అన్ని రకాలూ తిన్నాను.
కానీ ఆయిల్, ఫ్యాట్ ఉండే ఫుడ్‌కు మాత్రం దూరంగా ఉండేదాన్ని. ఇంతగా కృషి చేస్తేనే ఈ కిరీటంతో మీ ముందు నిలవగలిగాను. టీనేజర్స్‌కు నేను సజెస్ట్ చేసేది ఒక్కటే.. బ్యూటీఫీల్డ్‌లో అగ్రస్థాయిలో నిలబడగలమన్న కాన్ఫిడెన్స్ మీలో ఉంటే ఈ ఫీల్డ్‌ను మీ కెరీర్‌గా ఎంచుకోవచ్చు. నేను హైదరాబాద్‌కు రావడం ఇదే మొదటిసారి. చాలా కంఫర్ట్‌గా ఉంది. లాస్ట్ ఇయర్ బిజీ షెడ్యూల్‌తో ఇంటికి దూరంగా ఉండాల్సి వచ్చింది. న్యూ ఇయర్‌లో ఫ్యామిలీతో ఎక్కువ సమయం గడపాలనుకుంటున్నా.
ఫొటో: ఎస్.ఎస్.ఠాకూర్
ఐష్‌లా కనిపించాలని ఆశ
Published Sat, Dec 27 2014 1:00 AM | Last Updated on Sat, Sep 2 2017 6:47 PM
Advertisement
Advertisement