కల్యాణ్ జ్యువెలర్స్ మిని వజ్రాల దుకాణాలు | kalyan jewellers mini diamond stores | Sakshi
Sakshi News home page

కల్యాణ్ జ్యువెలర్స్ మిని వజ్రాల దుకాణాలు

Published Thu, Jan 14 2016 3:04 AM | Last Updated on Sun, Sep 3 2017 3:37 PM

కల్యాణ్ జ్యువెలర్స్  మిని వజ్రాల దుకాణాలు

కల్యాణ్ జ్యువెలర్స్ మిని వజ్రాల దుకాణాలు

హైదరాబాద్: ప్రముఖ బంగారు ఆభరణాల తయారీ సంస్థ కల్యాణ్ జ్యువెలర్స్ తాజాగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న తన 14 ‘మై కల్యాణ్’ ఔట్‌లెట్స్‌ను మిని వజ్రాల దుకాణాలుగా మారుస్తున్నట్లు ప్రకటించింది. వినియోగదారులకు వజ్రాలను అందుబాటులోకి తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు కల్యాణ్ జ్యువెలర్స్ ఒక ప్రకటనలో తెలిపింది. మిని వజ్రాల దుకాణాల్లో రూ.8,000-రూ.25,000 ధరల శ్రేణిలో అత్యంత ఆదరణ పొందిన పలు రకాల వజ్రాభరణాలు వినియోగదారులకు అందుబాటులో ఉంటాయని పేర్కొంది. ప్రస్తుతం వజ్రాల విక్రయాలు వేగంగా పెరుగుతోందని తెలిపింది. వజ్రాలు ఖరీదైనవి, ప్రత్యేకమైనవి అనే అపోహలను తొలగిస్తూ సామాన్యులకు కూడా వాటిని అందుబాటులోకి తీసుకురావడానికి మిని వజ్రాల దుకాణాలు దోహదపడతాయని కల్యాణ్ జ్యువెలర్స్ చైర్మన్, మేనేజింగ్ డెరైక్టర్ టి.ఎస్.కల్యాణ రామన్ తెలిపారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement