ప్రమోటర్లకు మరో 2.36 % అమ్మకానికి ఒప్పందం
న్యూఢిల్లీ: అంతర్జాతీయ ఇన్వెస్ట్‌మెంట్ దిగ్గజం వార్‌బర్గ్ పింకస్ తాజాగా కల్యాణ్ జ్యుయలర్స్‌లో 6.45 శాతం వాటాను విక్రయించింది. స్టాక్ ఎక్సే్చంజీల్లో నిర్వహించిన ఈ ఓపెన్ మార్కెట్ లావాదేవీ విలువ సుమారు రూ. 3,584 కోట్లు. డేటా ప్రకారం వార్‌బర్గ్ పింకస్ అనుబంధ సంస్థ హైడెల్ ఇన్వెస్ట్‌మెంట్ 6.65 కోట్ల షేర్లను సగటున ఒక్కో షేరును రూ. 539.10 రేటు చొప్పున విక్రయించింది.
వీటిని ఫిడిలిటీ, నోమురా తదితర సంస్థలు కొనుగోలు చేశాయి. హైడెల్ ఇన్వెస్ట్‌మెంట్ షేరు ఒక్కింటికి రూ. 535 రేటు చొప్పున ఇంకో 2.36% వాటాను కంపెనీ ప్రమోటర్, ఎండీ టీఎస్ కల్యాణరామన్‌కి రూ. 1,300 కోట్లకు విక్రయించనుంది. ఇందుకోసం ప్రమోటరు, హైడెల్ ఇన్వెస్ట్‌మెంట్ ఒప్పందం కుదుర్చుకున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment