
న్యూఢిల్లీ: ఆభరణాల విక్రయ సంస్థ కళ్యాణ్ జువెల్లర్స్‌లో వార్‌బర్గ్ పింకస్‌కు చెందిన హైడెల్ ఇన్వెస్ట్‌మెంట్ 2.26 శాతం వాటాను ఓపెన్ మార్కెట్లో రూ.256.6 కోట్లకు విక్రయించింది. ఎన్‌ఎస్‌ఈలో బల్క్ డీల్ సమాచారం ప్రకారం ఒక్కొక్కటి రూ.110.04 చొప్పున 2,33,25,686 షేర్లను హైడెల్ విక్రయించింది.
ఇదీ చదవండి: Charges on UPI: యూపీఐ చెల్లింపులపై అదనపు చార్జీలు.. యూజర్లకు వర్తిస్తాయా?
డిసెంబర్ త్రైమాసికంలో కళ్యాణ్ జువెల్లర్స్‌లో హైడెల్‌కు 26.36 శాతం వాటా ఉంది. క్రితం ముగింపుతో పోలిస్తే ఎన్‌ఎస్‌ఈలో కళ్యాణ్ జువెల్లర్స్ షేరు ధర మంగళవారం 9.06 శాతం పడిపోయి రూ.107.90 వద్ద స్థిరపడింది.
ఇదీ చదవండి: పేటీఎం యూజర్లకు గుడ్‌న్యూస్.. పేటీఎం వ్యాలెట్ నుంచి ఏ మర్చంట్‌కైనా చెల్లింపులు
Comments
Please login to add a commentAdd a comment