మోతీలాల్ ఓస్వాల్ అసెట్ మేనేజ్‌మెంట్ కంపెనీ (ఎంఓఏఎంసీ) కళ్యాణ్ జ్యువెల్లర్స్‌లో పెట్టుబడులకు సంబంధించి సోషల్ మీడియా వేదికగా లంచం ఆరోపణలు ఎదుర్కొంటుంది. వీటిపై కంపెనీ స్పందించింది. ఆ ఆరోపణలను తీవ్రంగా ఖండించింది. ఇవి నిరాధారమైనవని, దురుద్దేశపూరితమైనవని, పరువు నష్టం కలిగించేవిగా పేర్కొంది.
ఆరోపణల నేపథ్యం
కల్యాణ్ జ్యువెలర్స్‌లో గణనీయమైన పెట్టుబడులు పెట్టడానికి ఎంఓఏఎంసీ అధికారులు లంచం తీసుకున్నట్లు సోషల్ మీడియాలో ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ పుకార్లు కళ్యాణ్ జ్యువెల్లర్స్ షేరు గణనీయంగా పతనం కావడానికి కారణమైంది. ఇది గత రెండు వారాల్లో సుమారు 37% క్షీణించింది. ఈ తరుణంలో కంపెనీ స్పందించింది.
కంపెనీ స్పందన..
ఈ ఆరోపణలను ఖండిస్తూ మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఒక ప్రకటన విడుదల చేసింది. స్వార్థ ప్రయోజనాలున్న వ్యక్తులు ఉద్దేశపూర్వకంగా తమ ప్రతిష్టను దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తున్నారని చెప్పింది. ఇటీవల వచ్చిన లంచం ఆరోపణలు కూడా ఇందులో భాగమేనని స్పష్టం చేసింది. వీటిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపింది. సమగ్రతకు, అత్యున్నత ప్రమాణాలు నిర్వహించడానికి కంపెనీ నిబద్ధతతో ఉంటుందని పేర్కొంది. ఈ నిరాధార ఆరోపణల వల్ల దశాబ్దాలుగా సంస్థ, నాయకత్వం నిర్మించుకున్న మంచి పేరును చెడగొట్టడానికి స్వార్థ ప్రయోజనాలు ఉన్న వ్యక్తులు ప్రయత్నిస్తున్నారని తెలిపింది. విశ్వసనీయ, అధికారికంగా ధ్రువీకరించిన సమాచార వనరులపైనే ఆధారపడాలని మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ వాటాదారులందరినీ కోరింది. కంపెనీ తన పెట్టుబడిదారులు, పంపిణీదారులు, వాటాదారులపరంగా అత్యున్నత స్థాయి ప్రమాణాలను అనుసరిస్తుందని తెలిపింది.
ఇదీ చదవండి: టిక్‌టాక్ పునరుద్ధరణ.. ట్రంప్ పుణ్యమే..!
స్టాక్ ధరలపై ప్రభావం
మోతీలాల్ ఓస్వాల్ వివరణతో బాంబే స్టాక్ ఎక్సేంజ్ (బీఎస్ఈ)లో కల్యాణ్ జ్యువెల్లర్స్ షేర్లు రికవరీ అయ్యాయి. లంచం ఆరోపణలను కంపెనీ ఖండించడంతో షేరు ధర 9 శాతానికి పైగా పెరిగింది.
Comments
Please login to add a commentAdd a comment