
వినూత్నమైన పెట్టుబడి అవకాశాలతో కూడిన నూతన మ్యూచువల్ ఫండ్ ఆఫర్ (ఎన్‌ఎఫ్‌వో)ను మోతీలాల్ ఓస్వాల్ ప్రారంభించింది. మోతీలాల్ ఓస్వాల్ ఇన్నోవేషన్ అపార్చూనిటీస్ పేరుతో తీసుకొచి్చన ఈ ఎన్‌ఎఫ్‌వో ఈ నెల 12న ముగుస్తుంది. వినూత్నమైన వ్యాపార వ్యూహాలను (కొత్త ఉత్పత్తులు, సేవలు, టెక్నాలజీలపై దృష్టి పెట్టేవి) అమలు చేసే కంపెనీల్లో ఈ పథకం ఇన్వెస్ట్ చేస్తుంది. ఈక్విటీలకు 80 శాతం నుంచి 100 శాతం వరకు, డెట్‌కు 0–20 శాతం వరకు కేటాయింపులు చేస్తుంది. కనీస పెట్టుబడి రూ.500. రోజువారీ సిప్ అయితే రూ.100 నుంచి, వారం, నెలవారీ సిప్ అయితే రూ.500తో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment