
విస్తరణ బాటలో కల్యాణ్ జువెల్లర్స్!
- ఈనెల 9న విజయవాడ, గుంటూరుల్లో ప్రారంభం
- ఈ ఏడాది ముగింపు నాటికి 22 షోరూంలను తెరుస్తాం
- కల్యాణ్ జువెల్లర్స్ ఎండీ టీఎస్ కల్యాణరామన్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఆభరణాల రంగంలో ఉన్న కల్యాణ్ జువెల్లర్స్ విస్తరణ బాట పట్టింది. ఈ ఏడాది ముగింపు నాటికి కొత్తగా 22 షోరూమ్‌లను ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు కల్యాణ్ జువెల్లర్స్ ఎండీ టీఎస్ కల్యాణరామన్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. కల్యాణ్ జువెల్లర్స్ నెట్‌వర్క్ వృద్ధి కోసం రూ.800 కోట్లను కేటాయించామని.. ఇప్పటికే కొత్తగా 6 షోరూమ్‌లను ప్రారంభించామన్నారు.
ఇందులో భాగంగా ఈనెల 9న విజయవాడ, గుంటూర్లులో కొత్తగా షోరూమ్‌లను తెరవనున్నట్లు పేర్కొన్నారు. విజయవాడ ఎంజీరోడ్‌లో 12 వేల చ.అ.ల్లో, గుంటూరులోని అరుండల్‌పేట్‌లో 10 వేల చ.అ.ల్లో రానున్న ఈ కొత్త షోరూములను కల్యాణ్ జువెల్లర్స్ బ్రాండ్ అంబాసిడర్, సినీనటుడు నాగార్జున ప్రారంభిస్తారన్నారు. ఈ కొత్త షోరూమ్‌లో ‘7 స్టార్ సెలబ్రేషన్’ పేరుతో ఆకర్షణీయమైన ప్యాకేజీలు, సరికొత్త డిజైన్లు, ప్రత్యేక ఆఫర్లను అందుబాటులో ఉంటాయని రామన్ పేర్కొన్నారు. దక్షిణాది రాష్ట్రాల్లో ఆభరణాల విక్రయాల్లో ఏపీది బలమైన మార్కెట్ అని.. కల్యాణ్ జువెల్లర్స్ విక్రయాలు, మార్కెట్ షేర్ విస్తరణలో ఆంధ్రప్రదేశ్ ముందువరుసలో ఉంటుందని వివరించారు.