
కాగ్ (కంప్ట్రోలర్ ఆడిట్ జనరల్ ఆఫ్ ఇండియా) మాజీ అధికారి వినోద్‌రాయ్‌కి కీలక బాధ్యలు అప్పగించింది కళ్యాణ్ జ్యూయల్లర్స్ యాజమాన్యం. కంపెనీ బోర్డులో చైర్మన్, ఇండిపెండెంట్ నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా నియమిస్తున్నట్టు ప్రకటించింది. అయితే ఈ నిర్ణయానికి సంబంధించి షేర్ హోల్డర్లు, రెగ్యులేటరీ అథారిటీ నుంచి అనుమతి రావాల్సి ఉంది.
కాగ్ ఆడిటర్ జనరల్ పని చేయడంతో పాటు యూనెటైడ్ నేషనల్ ప్యానెల్ ఆఫ్ ఆడిటర్స్‌కి, బ్యాంక్ బోర్డ్స్ బ్యూరో తదితర సంస్థలకు కూడా గతంలో చైర్మన్‌గా వినోద్‌రాయ్ వ్యవహరించారు. కేంద్ర, పలు రాష్ట్రాల ప్రభుత్వాలు తీసుకొచ్చిన అనేక సంస్కరణల్లో వినోద్ రాయ్ కీలకంగా వ్యవహరించారు. కాగా మార్కెట్‌లో దూకుడుగా వెళ్తున్న కళ్యాణ్ జ్యూయల్లర్స్.. తాజాగా వినోద్‌రాయ్ వంటి సమర్థుడికి అనుభవజ్ఞుడికి బోర్డులో చోటు కల్పించింది.
Comments
Please login to add a commentAdd a comment