Vinod Rai
-
'తెలియని దారుణాలు చాలానే.. బీసీసీఐ బయటపడనివ్వలేదు'
బీసీసీఐ(బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా).. పేరుకు భారత క్రికెట్ బోర్డు అయినప్పటికి.. ఐసీసీనీ కూడా శాసించే స్థాయికి ఎదిగింది. క్రికెట్లో అత్యంత ధనికవంతమైన బోర్డుగా బీసీసీఐకి పేరుంది. పురుషుల క్రికెట్.. మహిళల క్రికెట్‌ను సమానంగా చూస్తూ ఆటగాళ్లకు తగిన హోదా కల్పిస్తున్నాయి. అయితే ఇవన్నీ బయటకు మాత్రమే. అంతర్లీనంగా బీసీసీఐలో కొన్నేళ్ల క్రితం జరిగిన దారుణాలు తెలుసుకుంటే ఆశ్చర్యపోవడం ఖాయం. బీసీసీఐలో మనకు తెలియని దారుణాలు ఏం చోటుచేసుకున్నయనేది మాజీ కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్(కాగ్) వినోద్ రాయ్ వెల్లడించారు. వినోద్ రాయ్‌ను సూప్రీంకోర్టు.. 2017-19 మధ్య బీసీసీఐ స్పెషల్ కమిటి అడ్మినిస్ట్రేటర్‌గా నియమించింది. బీసీసీఐలో ఎన్నికలు జరిగే వరకు వినోద్ రాయ్ సహా రామచంద్ర గుహ, విక్రమ్ లిమాయే, భారత మాజీ కెప్టెన్ డయానా ఎడుల్జీలతో నలుగురు సభ్యుల బృంధాన్ని ఏర్పాటు చేసి బోర్డు అడ్మినిస్ట్రేషన్ నడిపించారు. కాగా ఈ 33 ఏళ్ల కాలంలో వినోద్ రాయ్ బీసీసీఐలో జరిగిన లోటుపాట్ల గురించి స్పష్టంగా తెలుసుకున్నారు. అయితే ఆయన ఏనాడు వాటిని బయటపెట్టలేదు. తాజాగా వినోద్ రాయ్ ..''నాట్ జస్ట్ ఏ నైట్ వాచ్‌మన్'' అనే బుక్ రాశారు. ఈ బుక్‌లో ముఖ్యంగా బీసీసీఐకి తాను అడ్మినిస్ట్రేటర్‌గా పనిచేసిన కాలంలో జరిగిన అనుభవాలను, జ్ఞాపకాలను రాసుకొచ్చారు. అందులోనే అంతర్లీనంగా మహిళా క్రికెటర్లు ఎదుర్కొన్న వివక్ష గురించి కూడా ప్రస్తావించారు. ఈ విషయాన్ని వినోద్ రాయ్ స్వయంగా ద వీక్ మ్యాగజైన్‌కు ఇచ్చిన ఇంటర్వ్వూలో వెల్లడించారు. ''బీసీసీఐ మహిళా క్రికెట్‌కు అంతగా ప్రాధాన్యం ఇవ్వలేదని నాకు అనిపిస్తుంది. 2006 వరకు మహిళా క్రికెటర్లపై వివక్ష దారుణంగా ఉండేది. వాళ్లు మ్యాచ్‌లు ఆడేది తక్కువ సంఖ్య కాబట్టి.. కొత్త జెర్సీలు ఎందకన్న కారణంతో... పురుషుల వాడిన జెర్సీలనే కట్ చేసి మళ్లీ కుట్టి వాటిని మహిళా క్రికెటర్లకు అందించేవారు. ఒక రకంగా వాడేసిన జెర్సీలను మహిళా క్రికెటర్లకు ఇచ్చారు. అయితే శరద్ పవార్ బీసీసీఐ అధ్యక్షుడిగా వచ్చాకా.. పరిస్థితి కొంత నయమైంది. ఆయన మెన్స్, వుమెన్స్ క్రికెట్‌ను ఒకే దగ్గరకు చేర్చాలనే కొత్త ఆలోచనతో వచ్చారు. దానివల్ల మహిళా క్రికెటర్ల బతుకులు చాలావరకు బాగుపడ్డాయి. సెంట్రల్ కాంట్రాక్ట్(క్రికెటర్లకు జీతాలిచ్చే బోర్డు) అనేది రావడం వల్ల వివక్ష కాస్త తగ్గింది. కానీ ఇప్పటికి ఎక్కడో ఒక చోట అది కొనసాగుతూనే ఉంది. 2017లో నేనే బీసీసీఐ అడ్మినిస్ట్రేటర్‌గా ఉన్నప్పుడు.. భారత మహిళల జట్టు 2017 వన్డే వరల్డ్‌కప్‌లో ఫైనల్ చేరింది. ఆ ప్రపంచకప్‌లో హర్మన్‌ప్రీత్ కౌర్ 171 పరుగుల నాకౌట్ ఇన్నింగ్స్ టీమిండియాను ఫైనల్లో అడుగుపెట్టేలా చేసింది. అయితే ఇంత మంచి ఇన్నింగ్స్ ఆడిన హర్మన్ ప్రీత్‌కౌర్‌కు మ్యాచ్‌కు ముందు సరైన ఫుడ్ ఇవ్వలేదంటే నమ్ముతారా. ఆ విషయం హర్మన్ స్వయంగా చెప్పింది. 171 పరుగుల నాకౌట్ ఇన్నింగ్స్ తర్వాత హర్మన్‌తో ఫోన్లో మాట్లాడా.''సార్.. పరిగత్తడానికి శక్తి లేక బలాన్ని కుంచించుకొని సిక్స్‌లతోనే ఇన్నింగ్స్ ఆడాను. దానికి కారణం మాకు సరైన ఫుడ్ లేకపోవడమే. మ్యాచ్ ప్రారంభానికి ముందు మేమున్న హోటల్ సిబ్బంది.. ఈరోజు మీకు బ్రేక్‌ఫాస్ట్ ఏం లేదని.. సమోసాలతోనే సరిపెడుతున్నామని చెప్పారు. ఆ ఒక్క సమోసాతోనే నా శక్తినంతా కుంగదీసుకొని ఇన్నింగ్స్ ఆడాను.'' అంటూ చెప్పుకొచ్చింది. దీన్నిబట్టే అర్థం చేసుకోవచ్చు.. బీసీసీఐ మహిళా క్రికెటర్లను సరైన దిశలో పట్టించుకోలేదని.. ఈ మధ్యకాలంలో నాకు తెలిసి పురుషులతో సమానంగా మహిళలు క్రికెట్ ఆడుతున్నారు. వాళ్లకు సరైన ట్రైనింగ్, కోచింగ్ అవసరాలు, ట్రావెల్ ఖర్చులు, క్రికెట్ కిట్, గేర్, చివరకు మ్యాచ్ ఫీజులు సక్రమంగా చెల్లిస్తే మరింత ముందుకెళ్లడం సాధ్యం. బీసీసీఐని కించపరచాలన్న ఉద్దేశం నాకు లేదు. అందులో ఉన్న లోపాలు మాత్రమే ఎత్తిచూపాను. ఇలాంటివి తొందరగా పరిష్కరించుకుంటే మేలు'' అంటూ ఆయన పేర్కొన్నారు. చదవండి: ఐపీఎల్ వ్యవస్థాపకుడి బయోపిక్‌ను తెరకెక్కించనున్న బాలయ్య నిర్మాత -
కల్యాణ్ జువెల్లర్స్ చైర్మన్‌గా మాజీ ‘కాగ్’ వినోద్ రాయ్
న్యూఢిల్లీ: మాజీ కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్(కాగ్) వినోద్ రాయ్ తమ సంస్థ చైర్మన్, స్వతంత్ర నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టరుగా నియమితులైనట్లు ఆభరణాల విక్రయ సంస్థ కల్యాణ్ జువెల్లర్స్ ఇండియా వెల్లడించింది. నియంత్రణ సంస్థ, షేర్‌హోల్డర్ల ఆమోదానికి లోబడి ఈ నియామకం ఉంటుందని పేర్కొంది. టీఎస్ కల్యాణరామన్ ఇకపైనా కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్‌గా కొనసాగుతారని వివరించింది. పారదర్శకమైన వ్యాపార విధానాలు, కార్పొరేట్ గవర్నెన్స్‌తో వినియోగదారుల విశ్వాసాన్ని చూరగొన్న కల్యాణ్ జువెల్లర్స్‌తో కలిసి పనిచేయనుండటం సంతోషంగా ఉందని ఈ సందర్భంగా వినోద్ రాయ్ తెలిపారు. వివిధ అంశాల్లో రాయ్ అపార అనుభవం తమ సంస్థ పురోగతికి తోడ్పడగలదని కల్యాణరామన్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఐక్యరాజ్యసమితి ఎక్స్టర్నల్ ఆడిటర్ల కమిటీకి చైర్మన్‌గా కూడా రాయ్ గతంలో వ్యవహరించారు. అలాగే కేంద్రం, రాష్ట్రాల ప్రభుత్వాల్లోనూ వివిధ హోదాల్లో కీలక బాధ్యతలు నిర్వర్తించారు. దేశీయంగా ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ రంగంలో సంస్కరణల కోసం ఏర్పాటైన బ్యాంక్స్ బోర్డ్ బ్యూరో చైర్మన్‌గా కూడా వ్యవహరించారు. దేశానికి అందించిన సేవలకు గాను ప్రతిష్టాత్మక పద్మభూషణ్ పురస్కారాన్ని అందుకున్నారు. (చదవండి: అంతర్జాతీయ మార్కెట్లలో జోరు.. దేశీ స్టాక్ మార్కెట్లలో లాభాల హోరు) -
కాగ్ వినోద్‌రాయ్.. ఇప్పుడు కళ్యాణ్ జ్యూయల్లర్స్లో
కాగ్ (కంప్ట్రోలర్ ఆడిట్ జనరల్ ఆఫ్ ఇండియా) మాజీ అధికారి వినోద్రాయ్కి కీలక బాధ్యలు అప్పగించింది కళ్యాణ్ జ్యూయల్లర్స్ యాజమాన్యం. కంపెనీ బోర్డులో చైర్మన్, ఇండిపెండెంట్ నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా నియమిస్తున్నట్టు ప్రకటించింది. అయితే ఈ నిర్ణయానికి సంబంధించి షేర్ హోల్డర్లు, రెగ్యులేటరీ అథారిటీ నుంచి అనుమతి రావాల్సి ఉంది. కాగ్ ఆడిటర్ జనరల్ పని చేయడంతో పాటు యూనెటైడ్ నేషనల్ ప్యానెల్ ఆఫ్ ఆడిటర్స్‌కి, బ్యాంక్ బోర్డ్స్ బ్యూరో తదితర సంస్థలకు కూడా గతంలో చైర్మన్‌గా వినోద్‌రాయ్ వ్యవహరించారు. కేంద్ర, పలు రాష్ట్రాల ప్రభుత్వాలు తీసుకొచ్చిన అనేక సంస్కరణల్లో వినోద్ రాయ్ కీలకంగా వ్యవహరించారు. కాగా మార్కెట్లో దూకుడుగా వెళ్తున్న కళ్యాణ్ జ్యూయల్లర్స్.. తాజాగా వినోద్‌రాయ్ వంటి సమర్థుడికి అనుభవజ్ఞుడికి బోర్డులో చోటు కల్పించింది. -
అప్పుడు కుంబ్లేను కోహ్లి వద్దన్నాడు.. ఇప్పుడైతే?
న్యూఢిల్లీ: దాదాపు రెండేళ్ల క్రితం టీమిండియా ప్రధాన కోచ్ పదవి నుంచి అనిల్ కుంబ్లే తప్పుకోవడానికి కారణాలను బీసీసీఐ కమిటీ పరిపాలక కమిటీ(సీఓఏ) మాజీ చీఫ్ వినోద్ రాయ్ వెల్లడించారు. ఆరోజు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లితో విభేదాలు కారణంగానే కుంబ్లే తన పదవిని అర్థాంతరంగా వదులుకోవాల్సి వచ్చిందన్నారు. బీసీసీఐ కొత్త అధ్యక్షుడిగా సౌరవ్ గంగూలీ పగ్గాలు చేపట్టడంతో సీఓఏ పదవీ కాలం ముగిసింది. ఈ మేరకు సీఓఏకు 33 నెలలుగా చీఫ్‌గా ఉన్న వినోద్ రాయ్ తన అనుభవాలను పంచుకున్నాడు. దీనిలో భాగంగా కోహ్లి-కుంబ్లేల వివాదాన్ని మరోసారి మీడియా ముఖంగా చెప్పుకొచ్చాడు. ‘ కుంబ్లే ఒక అద్భుతమైన కోచ్. అందులో ఎటువంటి సందేహం లేదు. ఒకవేళ నా పరిధిలో కుంబ్లే పదవి కాలాన్ని పొడిగించే అవకాశం ఉంటే దాన్ని కచ్చితంగా అమలు చేసేవాడ్ని. కుంబ్లే చాలా మర్యాదగల వ్యక్తి. కానీ కోహ్లితో విభేదాలు తర్వాత కుంబ్లేను కొనసాగించే అవకాశం నా చేతుల్లో లేదు. అది క్రికెట్ సలహా కమిటీ(సీఏసీ) నిర్ణయం. కుంబ్లేతో డ్రెస్సింగ్ రూమ్‌లో కోహ్లికి అభిప్రాయ బేధాలు తలెత్తడంతో ఉన్నపళంగా కోచ్‌ను మార్చాల్సి వచ్చింది. సీఏసీలో సభ్యులైన సచిన్ టెండూల్కర్, సౌరవ్ గంగూలీలతో కోహ్లి సుదీర్ఘ చర్చల తర్వాత కోచ్‌ను మార్చాలని పట్టుబట్టడంతో కుంబ్లేకు ఉద్వాసన తప్పలేదు. ఇక్కడ విషయం చెప్పాలి. కోహ్లి వైఖరితో కుంబ్లేనే స్వచ్ఛందంగా తన పదవి నుంచి తప్పుకున్నాడు. వివాదాన్ని మరింత పెద్దది చేయకుండా కుంబ్లే చాలా గౌరవంగా తన పదవికి గుడ్ బై చెప్పాడు. ఆ సమయంలో కోహ్లి ముంబైలో ఉండగా, నేను హైదరాబాద్‌లో ఉన్నా. ఫోన్ ద్వారా కోహ్లి అంతరంగాన్ని తెలుసుకున్నా. ఇదే విషయాన్ని సచిన్‌కు చెప్పా. కుంబ్లేను కొనసాగించడానికి కోహ్లి ఆసక్తిగా లేడనే విషయాన్ని చెప్పా. అప్పుడు సచిన్, సౌరవ్లు కోహ్లితో మాట్లాడారు. ఆ క్రమంలోనే కుంబ్లే పదవి నుంచి తప్పుకున్నాడు. అటువంటి పరిస్థితుల్లో కుంబ్లేను కోచ్‌గా కొనసాగించే అవకాశం నా చేతుల్లో లేదు. ఒకవేళ ఉండి ఉంటే కచ్చితంగా కుంబ్లేను కోచ్‌గా కొనసాగించేవాడిని. అదే వివాదం ఈరోజు తలెత్తి ఉంటే పరిస్థితి మరొక రకంగా ఉండేది. కుంబ్లేను బలవంతంగానైనా ఆ పదవిలో గంగూలీ కొనసాగించే వాడు. ఈ తరహా వివాదమే టీమిండియా మహిళా క్రికెటర్ మిథాలీ రాజ్‌కు కోచ్‌గా పనిచేసిన రమేశ్ పవార్‌కు మధ్య జరిగింది. ఇవన్నీ ప్రజల్లో అపవాదను తెచ్చిపెట్టడమే కాకుండా మరింత వివాదాన్ని రాజేశాయి. బీసీసీఐ అధ్యక్షుడిగా గంగూలీ రావడంతో ఆనాటి పరిస్థితులు ఇక ఉండవనే అనుకుంటున్నా. గంగూలీ ఏ విషయాన్నైనా డీల్ చేయగల సమర్థుడు’ అని వినోద్ రాయ్ పేర్కొన్నారు. -
గంగూలీనే సరైనోడు...
న్యూఢిల్లీ: లోధా సంస్కరణల కోసమే తాత్కాలికంగా భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ)లోకి ప్రవేశించినా సుదీర్ఘ కాలం పాటు పరిపాలక కమిటీ (సీఓఏ) పనిచేసింది. మొత్తానికి బుధవారం జరిగిన సర్వసభ్య సమావేశంతో సీఓఏ కథ ముగిసింది. ఈ నేపథ్యంలో సీఓఏ చీఫ్‌గా వినోద్ రాయ్ ఆఖరి ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో సౌరవ్ గంగూలీ కంటే సమర్థుడైన అధ్యక్షుడు లేడని అభిప్రాయపడ్డారు. ఇంకా ఏమన్నారంటే... ఈ బాధ్యతలు తృప్తినిచ్చాయి... నాకు ఈ బాధ్యతలు సంతృప్తికర అనుభవాన్నిచ్చాయి. ఆటగాళ్ల సంఘాన్ని నియమించాం. అరకొర అయినా ఎట్టకేలకు మహిళల ఐపీఎల్ మ్యాచ్‌ల్నీ నిర్వహించాం. ప్రతీ అంశంలోనూ పారదర్శకంగా వ్యవహరించాం. వందకుపైగా జరిగిన సీఓఏ సమావేశాల తాలుకూ నివేదికల్ని బీసీసీఐ వెబ్సైట్లో పెట్టాం. లోధా సిఫార్సుల్ని ఎక్కడా నీరుగార్చలేదు. మొత్తమ్మీద నలుగురు మాజీల్ని బోర్డు ప్రధాన పదవుల్లో చూస్తుంటే ఆనందంగా ఉంది. అధ్యక్షుడిగా గంగూలీ, ఐపీఎల్ చైర్మన్‌గా బ్రిజేశ్ పటేల్, అపెక్స్ కౌన్సిల్లో అన్షుమన్ గైక్వాడ్, శాంతా రంగస్వామిలు బీసీసీఐ ముఖ్య పదవుల్లో ఉన్నారు. ‘దాదా’ అంటే గౌరవం... మాజీ కెప్టెన్ గంగూలీ అంటే నాకెంతో గౌరవం. అతను బెంగాల్ క్రికెట్ సంఘాన్ని నడిపించిన తీరు నన్ను బాగా ఆకట్టుకుంది. అలాగే బీసీసీఐని నడిపించే నాయకత్వ లక్షణాలు ఈ మాజీ కెప్టన్‌న్‌కు ఉన్నాయి. నా దృష్టిలో బోర్డు అధ్యక్షుడిగా అతనికన్నా సమర్థ నాయకుడు లేడు. వాటిని పట్టించుకోను.... సీఓఏలో పెద్దగా సవాళ్లేమీ లేవు. అనర్హతకు గురైన ఆ 70 మందితో నాకు అసలు పరిచయమే లేదు. వాళ్లు పోరాడింది కోర్టులోనే! ఇక విమర్శలంటారా... వాటిని నేను పట్టించుకోను. నిజం చెప్పాలంటే సంస్కరణలు ఇష్టం లేనివారే ఆరోపణలు చేశారు. నన్ను విమర్శించారు. -
‘మీరిచ్చే ఆ 40 లక్షలు నాకొద్దు’
ముంబై: భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) 39వ అధ్యక్షుడిగా టీమిండియా మాజీ సారథి సౌరవ్ గంగూలీ పూర్థి స్థాయిలో బాధ్యతలు చేపట్టాడు. కొత్తగా ఎన్నికైన పాలకవర్గం పూర్తిస్థాయిలో బాధ్యతలు చేప్పటడంతో సుప్రీంకోర్టు నియమిత పరిపాలకుల కమిటీ(సీఓఏ)కి నేటితో శుభం కార్డు పడింది. అయితే ఇన్నాళ్లు భారత క్రికెట్ వ్యవహారాలు చూసిన సీఓఏ చీఫ్ వినోద్ రాయ్, సభ్యురాలు డయానా ఎడుల్జీకి 33 నెలల కాలానికి ఒక్కొక్కరికి రూ. 3.5 కోట్లు చెల్లించాలిని బీసీసీఐ నిర్ణయిచింది. వీరితో పాటు కొన్ని నెలలు సీఓఏలో సభ్యులుగా ఉన్న విక్రమ్ లిమాయేకు రూ. 50.5 లక్షలు, రామచంద్ర గుహకు రూ. 40 లక్షల చొప్పున ఇవ్వాలని బీసీసీఐ భావించింది. అయితే బీసీసీఐ నిర్ణయంపై రామచంద్ర గుహ భిన్నంగా స్పందించాడు. తనకు బోర్డు నుంచి ఒక్క రూపాయి కూడా అవసరం లేదని స్పష్టం చేశాడు. ‘సీఓఏ సభ్యుడిగా పనిచేయడం గౌరవంగా భావిస్తున్నాను. ఆ పదవిని డబ్బు కోసం చేపట్టలేదు. అయితే ఇది నా వ్యక్తిగత నిర్ణయం. అదేవిధంగా 33 నెలలు పనిచేసి(వినోద్ రాయ్, ఎడుల్జీ) బీసీసీఐ ఇచ్చే భారీ వేతనాన్ని అంగీకరించడం కూడా సరైనదిగా భావించడం లేదు. ఇక నేను కమిటీ సభ్యుడిగా పనిచేసింది కొన్ని నెలలైనా క్రికెట్ అభివృద్దికి నా వంతు కృషి చేసా. నేను బాధ్యతలు చేపట్టే సరికి క్రికెట్ పరిపాలన గందరగోళంగా ఉంది. అయితే పరిస్థితులను చక్కదిద్దే ప్రయత్నం చేశాను’అంటూ బీసీసీఐకి రామచంద్ర గుహ లేఖ రాశాడు. ఇక 2017లో టీమిండియా కోచ్-కెప్టెన్ మధ్య జరిగిన వివాదంలో రామచంద్ర గుహ కుంబ్లేకే మద్దతుగా నిలిచాడు. అయితే కుంబ్లేను తొలగించడంపై ‘సూపర్ స్టార్ సంస్కృతి మొదలైంది’అంటూ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. బోర్డులో రోజువారి కార్యకలాపాల్లో అవినీతి, అక్రమాలు జరిగాయన్న ఆరోపణలతో సుప్రీంకోర్టు 2017లో అప్పటి అధ్యక్షుడు అనురాగ్ ఠాకూర్‌ను పదవి నుంచి తప్పించింది. జస్టిస్ లోథా సంస్కరణలు అమలు చేసేందుకు 2017 జనవరిలో వినోద్ రాయ్, విక్రమ్ లిమాయే, డయానా ఎడుల్జీ, రామచంద్ర గుహలతో కూడిన క్రికెట్ పరిపాల కమిటీ(సీఓఏ)ని నియమించింది. అయితే పలు వ్యక్తిగత కారణాలతో 2017 జులైలో రామచంద్ర గుహ, అనంతరం విక్రమ్ లిమాయే కూడా సీఓఏ నుంచి తప్పుకున్నారు. అయితే వీర్దిదరూ పక్కకు జరిగినప్పటికీ వినోద్ రాయ్, ఎడుల్జీలు భారత క్రికెట్ వ్యవహారాలను సమర్థంగా చూసుకున్నారు. -
ప్రభుత్వ నిర్ణయానికి కట్టుబడతాం
ముంబై: ఐసీసీ మహిళల వన్డే చాంపియన్‌షిప్‌లో భాగంగా భారత్– పాకిస్తాన్ జట్ల మధ్య జరగాల్సిన మ్యాచ్‌ల నిర్వహణ విషయంలో భారత ప్రభుత్వ నిర్ణయానికే కట్టుబడి ఉంటామని క్రికెట్ పరిపాలకుల కమిటీ (సీఓఏ) అధ్యక్షుడు వినోద్ రాయ్ స్పష్టం చేశారు. 2021 ప్రపంచకప్ క్వాలిఫయింగ్ ఈవెంట్ అయిన ఐసీసీ మహిళల వన్డే చాంపియన్‌షిప్ నేపథ్యంలో భారత్ వేదికగా పాకిస్తాన్‌తో మూడు మ్యాచ్‌లు జరగాల్సి ఉంది. జూలై నుంచి నవంబర్ మధ్య జరిగే ఈ మ్యాచ్‌లను నిర్వహించడానికి అనుమతి కోసం భారత క్రీడా మంత్రిత్వ శాఖకు బీసీసీఐ లేఖ రాసింది. దీనిపై రాయ్ స్పందిస్తూ ‘భారత్ వేదికగా పాకిస్తాన్‌తో మ్యాచ్‌లు నిర్వహించాల్సి వచ్చిన ప్రతిసారి మేం ప్రభుత్వ అనుమతిని కోరతాం. ఈ విషయంలో వారి వైఖరికే మేం ప్రాధాన్యత ఇస్తాం. ఇప్పటివరకు ప్రభుత్వం నుంచి ఈ అంశంపై ఎలాంటి వివరణ రాలేదు. ముందు దీనిపై ప్రభుత్వాన్ని స్పందించనివ్వండి. తర్వాత మా నిర్ణయాన్ని ప్రకటిస్తాం’ అని అన్నారు. ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో 2013 జనవరి నుంచి పాకిస్తాన్‌తో ద్వైపాక్షిక సిరీస్‌లకు భారత్ దూరంగా ఉంటోంది. కానీ ఐసీసీ ఈవెంట్ల సందర్భంగా తప్పనిసరి పరిస్థితుల్లో భారత్ తటస్థ వేదికలపై పాకిస్తాన్‌తో ఆడుతోంది. -
భారత్-పాక్ మ్యాచ్‌పై వీడని ఉత్కంఠ
ముంబై : ప్రపంచకప్‌లోని భారత్-పాకిస్తాన్ మ్యాచ్‌పై ఇంకా ఉత్కంఠ వీడలేదు. పుల్వామా ఉగ్ర దాడి నేపథ్యంలో ప్రపంచకప్‌లో భారత్-పాక్ మ్యాచ్‌పై నీలి నీడలు కమ్ముకున్న విషయం తెలిసిందే. ఈ ఉగ్రదాడికి నిరసనగా ప్రపంచ కప్‌లో పాక్ మ్యాచ్‌ను భారత్ రద్దు చేసుకోవాలనే డిమాండ్ వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో శుక్రవారం బీసీసీఐ పాలక వర్గం సమావేశమై ఈ విషయంపై చర్చించింది. అయితే ఇంకా ఈ మ్యాచ్‌పై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని సమావేశ అనంతరం పాలకుల కమిటీ ఛైర్మన్ వినోద్ రాయ్ స్పష్టం చేశారు. ఈ విషయంలో భారత ప్రభుత్వంతో చర్చించిన తర్వాతే తుది నిర్ణయం ప్రకటిస్తామన్నారు. రెండు విషయాలను మాత్రం ఐసీసీ దృష్టికి తీసుకెళ్లాలని నిర్ణయించామని తెలిపారు. ప్రపంచకప్‌లో తమ ఆటగాళ్లకు ఎక్కువ భద్రత కల్పించాలని, భవిష్యత్తులో క్రికెట్ ఆడే దేశాలతోసంబంధాలుంటాయని కానీ, ఉగ్రవాదాన్ని ప్రేరేపిస్తున్న దేశంతో మాత్రం సంబంధాలను విరమించుకుంటామని ఐసీసీకి తెలియజేస్తామన్నారు. ఇవే అంశాలను ప్రస్తావిస్తూ బీసీసీఐ సీఈవో రాహుల్ జోహ్రీ ఐసీసీకి లేఖ రాశారు. పుల్వామా ఉగ్రదాడిలో 44 మంది జవాన్లు వీర మరణం పొందారని, ఈ దాడిని పాక్ తప్పా క్రికెట్ ఆడే అన్ని దేశాలు ఖండించాయని పేర్కొన్నారు. ఈ ఘటన నేపథ్యంలో ప్రపంచకప్ టోర్నీలో తమ ఆటగాళ్ల, అభిమానుల, అధికారుల భద్రత విషయంలో ఆందోళన నెలకొందని, ఐసీసీ, ఈసీబీ పటిష్ట భద్రత కల్పిస్తారని బీసీసీఐ నమ్ముతున్నప్పటికి భద్రత విషయంలో ఆందోళన కలుగుతోందని జోహ్రీ లేఖలో ప్రస్తావించారు. ఉగ్రవాదాన్ని ప్రేరేపించే దేశంతో క్రికెట్ సంబంధాలు తెంచుకోవాలని బీసీసీఐ కోరుతుందన్నారు. -
ఈసారి ఐపీఎల్ వేడుకల్లేవ్!
ముంబై : భారత క్యాష్ రిచ్ లీగ్ ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) ప్రారంభోత్సవ వేడుకులను బీసీసీఐ రద్దు చేసింది. ప్రత్యేక ఆకర్షణగా నిలిచే ఈ కార్యక్రమానికయ్యే ఖర్చును పుల్వామా ఉగ్రదాడిలో వీరమరణం పొందిన జవాన్ల కుటుంబాలకు అందజేస్తామని బీసీసీఐ పాలకుల కమిటీ ఛైర్మన్ వినోద్ రాయ్ ప్రకటించారు. మార్చి 23 నుంచి ఐపీఎల్ 2019 సీజన్ ప్రారంభంకానున్న విషయం తెలిసిందే. తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడనున్నాయి. ఈ మేరకు ఇప్పటికే 14 రోజుల మ్యాచ్‌ల షెడ్యూల్‌ని బీసీసీఐ మూడు రోజుల క్రితం విడుదల చేసింది. అయితే ఈ ఏడాది ప్రారంభోత్సవానికి బదులుగా ఆ డబ్బుని పుల్వామా దాడిలో అసువులు బాసిన అమర జవాన్ల కుటుంబాలకి అందజేయాలని బీసీసీఐ పాలకుల కమిటీ నిర్ణయించింది. వాస్తవానికి అమర జవాన్ల కుటుంబాలకి రూ. 5 కోట్లు తగ్గకుండా బీసీసీఐ తరఫున ఆర్థిక సాయం అందించేందుకు అనుమతించాలని వినోద్ రాయ్‌కి బీసీసీఐ తాత్కాలిక అధ్యక్షుడు సీకే ఖన్నా లేఖ రాశాడు. దీనిపై ఈరోజు జరిగిన సర్వసభ్య సమావేశంలో చర్చించిన బోర్డు సభ్యులు.. అంతకంటే ఎక్కువ మొత్తాన్నే ఇచ్చేందుకు అంగీకరించారు. -
విచారణ వేగవంతం... అంత తొందరేలా!
న్యూఢిల్లీ: క్రికెటర్లు హార్దిక్ పాండ్యా, కె.ఎల్ రాహుల్‌లపై విచారణ విషయంలో బోర్డు పరిపాలక కమిటీ (సీఓఏ)లో భేదాభిప్రాయాలు బహిర్గతమయ్యాయి. సీఓఏ చీఫ్ వినోద్ రాయ్ టీమిండియా జట్టు కూర్పు పటిష్టత కోసం క్రికెటర్లపై చేపట్టిన విచారణను వేగవంతం చేయాలని సూచిస్తుంటే... కమిటీ సభ్యురాలు డయానా ఎడుల్జీ మాత్రం అంత తొందరెందుకని మండిపడుతున్నారు. తూతూమంత్రం విచారణతో ఏదో రకంగా ఈ వివాదాన్ని ముగించాలని చూస్తున్నారని ఆరోపించారు. ఇటీవల ఒక టీవీ షోలో క్రికెటర్లిద్దరు మహి ళలపై అనుచిత వ్యాఖ్యలు చేయడం పెను విమర్శలకు దారితీసింది. దీంతో భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) పాండ్యా, రాహుల్‌లపై వేటు వేసింది. ఆ వెంటనే ఇద్దరు క్రికెటర్లు ఆసీస్ నుంచి అర్ధంతరంగా స్వదేశం పయనమయ్యారు. జట్టు బలం ఇప్పుడు 15 సభ్యుల నుంచి 13కు పడిపోవడంతో వెంటనే విచారణ పూర్తిచేసి వారి స్థానాలను భర్తీచేయాలని సీఓఏ చీఫ్ రాయ్ భావిస్తున్నారు. దీన్ని ఎడుల్జీ విభేదించారు. లోగడ బోర్డు సీఈఓ రాహుల్ జోహ్రి ఎదుర్కొన్న లైంగిక వేధింపుల అరోపణలపై ఇలా తొందరపడే త్వరగా ముగించారని ఆమె అభ్యంతరం వ్యక్తం చేశారు. మరోవైపు హార్దిక్ పాండ్యా, రాహుల్ స్థానాల్లో మయాంక్ అగర్వాల్, విజయ్ శంకర్లను జట్టులోకి ఎంపిక చేసినట్లు సెలెక్టర్లు తెలిపారు. -
హార్దిక్, రాహుల్‌పై చర్యలకు బీసీసీఐ సిద్ధం
న్యూఢిల్లీ: ఓ టీవీ షోలో మహిళలను అగౌరవపరిచే విధంగా మాట్లాడిన టీమిండియా క్రికెటర్లు హార్దిక్ పాండ్యా, కేఎల్ రాహుల్‌పై చర్యలను తీసుకునేందుకు భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ) సిద్ధమైంది. ఆ ఇద్దరిపై రెండు వన్డే మ్యాచ్‌లు నిషేధం విధించాలని బీసీసీఐ పరిపాలక కమిటీ(సీఓఏ) చీఫ్ వినోద్ రాయ్ ప్రతిపాదించారు. ఈ మేరకు సీఓఏ సభ్యురాలు డయానా ఎడ్జుల్లీ న్యాయపరమైన సలహా కోరేందుకు సన్నద్ధమయ్యారు. ‘మహిళలను కించపరిచే విధంగా వ్యాఖ్యానించిన తర్వాత హార్దిక్ ఇచ్చిన వివరణతో నేను సంతృప్తి చెందలేదు. దాంతో వారిపై రెండు మ్యాచ్‌లు నిషేధం విధించాలని సూచించా. అయితే దీనిపై న్యాయపరమైన సలహా తీసుకున్న తర్వాత డయానా ముందుకు వెళతారు’ అని వినోద్ రాయ్ పేర్కొన్నారు. ప్రముఖ షో అయిన ‘కాఫీ విత్ కరణ్’ కార్యక్రమంలో వ్యాఖ్యాత కరణ్ జోహార్‌తో కలిసి హార్దిక్, రాహుల్‌లు పాల్గొన్నారు. అందులోపాండ్యా మాట్లా డుతూ ‘అమ్మాయిల విషయంలో నేనేమీ బుద్ధిమంతుడ్ని కాదు. వాళ్లను అదోటైపుగా చూస్తా. క్లబ్‌లలో వారి ఒంపుసొంపులపై కైపుగా కన్నేస్తా. ఎవరైనా అమ్మాయిని శారీరకంగా కలిస్తే ‘ఆజ్ మై కర్ కే ఆయా’ (నేను ఈ రోజు ...ఆ పని చేసొచ్చా) అని తల్లిదండ్రులతో చెప్పేస్తా’ అని వ్యాఖ్యానించాడు. 18 ఏళ్ల వయసప్పుడే తన ప్యాంట్ జేబులో కండోమ్ లభించడాన్ని వాళ్ల అమ్మ తండ్రి దృష్టికి తీసుకెళ్లిందని, మొదట మందలించినా... తర్వాత ‘పర్లేదు...రక్షణ కవచం వాడావు’ అని తండ్రి తనతో అన్నట్లు షోలో రాహుల్ చెప్పుకొచ్చాడు.కాంట్రాక్టు క్రికెటర్లయి ఉండి ఇలా అశ్లీల రీతిలో విచ్చలవిడితనంతో వ్యాఖ్యానించిన సదరు క్రికెటర్లకు వినోద్ రాయ్ నోటీసులు పంపారు. ఈ నోటీసులు రాగానే పాండ్యా ట్విట్టర్ వేదికగా మహిళలను క్షమాపణలు కోరాడు. ‘ఆ ఊపులో చెప్పేశాను. ఉద్దేశపూర్వకంగా చేసినవి కాదు. ఈ వ్యాఖ్యలు ఎవరినైనా బాధించివుంటే క్షమించాలి’ అని అన్నాడు. దీనిపై ఎంతమాత్రం సంతృప్తి చెందని వినోద్ రాయ్.. వారిని కనీసం రెండు మ్యాచ్‌ల నుంచి సస్పెండ్ చేయడమే సరైన శిక్షగా పేర్కొన్నాడు. -
‘అతనికి ఈ-మెయిల్స్ రాయడమే పని’
న్యూఢిల్లీ: భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు పరిపాలన కమిటీ (సీఓఏ) చీఫ్ వినోద్ రాయ్‌పై బోర్డు తాత్కాలిక అధ్యక్షుడు అమితాబ్ చౌదరి అసహనం వ్యక్తం చేశారు. జస్టిస్ లోధా సూచించిన సిఫారసులను అమలు చేయడంలో వినోద్ రాయ్ పూర్తిగా విఫలమయ్యాడని అమితాబ్ విమర్శించారు. చాలాకాలంగా అమితాబ్‌తో పాటు కోశాధికారి అనిరుధ్ చౌదురిని పక్కనబెట్టిన సీఓఏ కీలక అంశాలను వీళ్లతో చర్చించడం లేదు. అదే సమయంలో వీరిని తొలగించాలని సుప్రీంకోర్టుకు రాయ్ విజ్ఞప్తి చేయడం కూడా అమితాబ్ చౌదరికి ఆగ్రహం తెప్పించింది.. ఈ నేపథ్యంలో రాయ్ తీసుకున్న నిర్ణయాలపై అమితాబ్ చౌదరి బహిరంగంగా విమర్శలు చేసేందుకు పూనుకున్నాడు. ‘రాయ్ విషయంలో ఓ అభిప్రాయానికి వచ్చా. దురదృష్టమేమిటంటే ఏడాదిన్నరగా అతను ఈ మెయిల్స్ రాయడానికే పరిమితమయ్యాడు. అంతకుమించి అతను సాధించిందేమీ లేదు. సిఫారసులు అమలు చేయమని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసినా వాటిని ఇంతవరకు అమలు చేయలేకపోయాడు. లోధా సిఫారుసులు అమలు విషయంలో రాయ్ బృందం పూర్తిగా విఫలమైంది. ఆఫీస్ బేర్లర్లను తొలిగించడానికి రాయ్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఎందుకంటే అతని వైఫల్యాన్ని మేం ప్రశ్నిస్తామనే భయం మొదలైంది. నియామకాలు జరపడంలో రాయ్ బిజీగా ఉన్నారు. ఇక మిగతా విషయాలేమి పట్టించుకుంటారు’ అని అమితాబ్ చౌదరి విమర్శించారు. బీసీసీఐ రాజ్యాంగాన్ని సవరించేందుకు అవసరమైన తుది తీర్పును వెల్లడించడంలో సుప్రీంకోర్టు కాలాయపన చేస్తుందని ఇటీవల రాయ్ చేసిన విమర్శలపై కూడా అమితాబ్ తీవ్రంగా ధ్వజమెత్తారు. అత్యున్నత న్యాయస్థానం గురించి రాయ్ అలా ఎలా మాట్లాడతారని ప్రశ్నించారు. నాలుగు దశాబ్దాలుగా ప్రభుత్వంలో పని చేసిన వ్యక్తి మాట్లాడాల్సిన మాటలేనా అంటూ ధ్వజమెత్తారు. -
వయసు తక్కువగా చూపిస్తే..
ముంబై: తప్పుడు జనన ధ్రువీకరణ పత్రాలు సమర్పించి దేశవాళీ జట్లలో కొనసాగుతోన్న క్రికెటర్లను బీసీసీఐ క్రికెట్ పాలకుల కమిటీ (సీఓఏ) హెచ్చరించింది. వయసు తక్కువగా చూపిస్తే ఆటగాళ్లపై రెండేళ్ల సస్పెన్షన్‌తో పాటు క్రిమినల్ చర్యలు తీసుకుంటామని సీఓఏ చీఫ్ వినోద్‌రాయ్ తెలిపారు. మే నెలలో ఢిల్లీలో జరిగిన సమావేశంలో ఈ అంశంపై చర్చించిన సీఓఏ... దేశవాళీ క్రికెట్లో సర్వసాధారణంగా మారిన ఈ మోసాలను కట్టిపెట్టేందుకు కఠిన చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది. ఈ మేరకు ఇదివరకు ఒక సంవత్సరంగా ఉన్న సస్పెన్షన్ కాలాన్ని రెండేళ్లకు పెంచడంతో పాటు క్రిమినల్ చర్యలు తీసుకునేందుకు సిద్ధమైంది. మూడేళ్ల క్రితం మన్సూర్ అలీఖాన్ పటౌడీ స్మారకోపన్యాసంలో ప్రస్తుత భారత అండర్–19 కోచ్ రాహుల్ ద్రవిడ్ ఈ అంశంపై తీవ్రంగా స్పందించాడు. వయసును తక్కువగా చూపెట్టి జట్టులో చోటు దక్కించుకోవడం ఫిక్సింగ్‌తో సమానమని అన్నాడు. నకిలీ సర్టిఫికెట్లతో అండర్–19, అండర్–16 జట్లలో చేరుతున్న ఆటగాళ్ల కారణంగా... అర్హుడైన ప్రతిభ గల మరో యువ క్రీడాకారుడికి తీవ్ర అన్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశాడు. -
బీసీసీఐ ఎస్జీఎం చెల్లదన్న సీఓఏ
ఉప్పు–నిప్పుగా తయారైన భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ), పరిపాలక కమిటీ (సీఓఏ)ల మధ్య మరో లేఖాస్త్రం వార్తల్లోకెక్కింది. ఈ నెల 22న బీసీసీఐ నిర్వహించిన ప్రత్యేక సర్వసభ్య సమావేశం (ఎస్జీఎం) చెల్లదని సీఓఏ చీఫ్ వినోద్ రాయ్ క్రికెట్ బోర్డుకు లేఖ రాశారు. అందులో తీసుకున్న విధాన నిర్ణయాలకు విలువలేదని ఆ లేఖలో పేర్కొన్నారు. ఎస్‌జీఎంలో క్రికెటర్ల కొత్త కాంట్రాక్ట్‌లను ఆమోదించడంతో పాటు పలు కీలక నిర్ణయాలు బోర్డు ఆఫీస్ బేరర్లు తీసుకున్నారు. -
యో-యో టెస్టు అవసరమా?
న్యూఢిల్లీ: ఇటీవల కాలంలో భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) సెలెక్షన్ కమిటీ నిర్వహిస్తోన్న యో-యో టెస్టుపై పలు విమర్శలు వస్తున్నాయి. కేవలం అరగంటపాటు చేసే పరీక్ష ద్వారా ఆటగాళ్ల ఫిట్నెస్ను ఎలా నిర్ధరిస్తారని మాజీలు, ప్రస్తుత ఆటగాళ్లు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో యో యో పరీక్షనే ఎందుకు ప్రామాణికంగా తీసుకొంటున్నారని వినోద్ రాయ్ నేతృత్వంలోని పాలకుల కమిటీ(సీఓఏ) బీసీసీఐని ప్రశ్నించేందుకు సిద్ధమవుతోంది. ఐపీఎల్లో రాణించిన అంబటి రాయుడు, సంజూ శాంసన్ ఇద్దరూ యో-యో టెస్టులో విఫలమయ్యారు. ఈ నేపథ్యంలో యో యో టెస్టు నిర్వహణ అనేది చర్చకు తెరలేపింది. ‘వినోద్ రాయ్‌తోపాటు ఇతర పాలక సభ్యులకు రాయుడు, సంజూ శాంసన్‌కు జరిగిన విషయంపై పూర్తి అవగాహన ఉంది. యో-యో టెస్ట్‌పై వస్తున్న ఆరోపణలను రాయ్ బృందం పరిగణనలోకి తీసుకొంటుంది. దీనిపై జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ) శిక్షకుల నుంచి సమాచారం అడిగే అవకాశం ఉంది’ అని సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. ‘యో- యో టెస్టు అనేది సాంకేతికతకు సంబంధించిన అంశమని, అందువల్ల సీవోఏ చీఫ్ ఇప్పటివరకూ కలగజేసుకోలేదని, అయితే రాబోయే రోజుల్లో క్రికెట్ ఆపరేషన్స్ హెడ్ సబా కరీమ్ నుంచి సంపూర్ణ సమాచారం తెలుసుకొంటారని’ బీసీసీఐ అధికారి వివరించారు. కాగా, ఇప్పటికే యో యో టెస్ట్‌ను ఎప్పుడు, ఎలా అమల్లోకి తీసుకొచ్చిందీ వంటి వివరాలను తెలియజేస్తూ బీసీసీఐ ట్రెజరర్ అనిరుధ్ చౌదరి ఆరు పేజీల లేఖను సీవోఏకు పంపించారు. -
ద్రవిడ్‌కు రెండు ఆప్షన్స్ ఇస్తే..
న్యూఢిల్లీ: పరస్పర విరుద్ధ ప్రయోజనాల అంశం తెరపైకి వచ్చినప్పుడు రాహుల్ ద్రవిడ్కి రెండు అవకాశాలు ఇవ్వగా అతను అండర్-19 జట్టుకి కోచ్‌గా ఉండేందుకు మొగ్గుచూపినట్లు బీసీసీఐ పరిపాలక కమిటీ(సీఓఏ) అధ్యక్షుడు వినోద్ రాయ్ వెల్లడించారు. లోధా కమిటీ సంస్కరణ అమలు కోసం సుప్రీంకోర్టు నేతృత్వంలో సీఓఏ ఏర్పాటైంది. . దీనిలో భాగంగా ఐపీఎల్లో ఓ జట్టుకి కోచ్‌గా ఉంటూ.. భారత అండర్-19 జట్టుకి కూడా రాహుల్ ద్రవిడ్ కోచ్‌గా పనిచేయడం విరుద్ధ ప్రయోజనాల కిందకి వస్తుందని పెద్ద ఎత్తున చర్చని లేవనెత్తారు. ఈ నేపథ్యంలో అతను అండర్-19 జట్టుకి మాత్రమే కోచ్‌గా ఉండేందుకు ఒప్పుకున్నట్లు రాయ్ తాజాగా వెల్లడించారు. ‘రాహుల్ ద్రవిడ్కి అప్పట్లో రెండు ఆప్షన్స్ ఇచ్చాం. అందులో ఒకటి.. ఐపీఎల్లో కోచ్‌గా కొనసాగడం. రెండోది భారత అండర్-19 జట్టుకి కోచ్‌గా ఏడాదికాలం కాంట్రాక్ట్. ఆ సమయంలో ద్రవిడ్ మరో ఆలోచన లేకుండా అండర్-19 టీమ్‌తో కలిసి పనిచేసేందుకు ఒప్పుకున్నాడు. అలా పనిచేసేందుకు అమోదయోగ్యమైన ప్యాకేజీని కోరాడు’ అని వినోద్ రాయ్ వివరించారు. భారత్‌లో మాత్రమే విరుద్ధ ప్రయోజనాల అంశాన్ని బీసీసీఐ సీరియస్‌గా తీసుకుంటున్న సంగతి తెలిసిందే. -
ఎస్జీఎం ఆపండి!
ముంబై: భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ), పరిపాలకుల కమిటీ (సీఓఏ) మధ్య విభేదాలు మరింత ముదిరాయి. ఇప్పటి వరకు సీఓఏ ప్రతీ సూచనకు తలూపుతూ వచ్చిన బోర్డు ఆఫీస్ బేరర్లు ఇకపై దానిని కొనసాగించరాదని గట్టిగా నిర్ణయించుకున్నాయి. ఫలితంగా ఈ నెల 22న జరగాల్సిన ప్రత్యేక సర్వసభ్య సమావేశం (ఎస్జీఎం) నిర్వహణపై సందిగ్ధత నెలకొంది. ఐసీసీతో ఆదాయ పంపిణీ, ఎన్సీఏ నిర్వహణ, బోర్డులో కొందరు ఉద్యోగాల నియామకాలవంటి పలు కీలక అంశాలపై చర్చించేందుకు ఎస్జీఎం ఏర్పాటు చేయాల్సిందిగా 15 రాష్ట్ర సంఘాలు విజ్ఞప్తి చేయడంతో కార్యదర్శి అమితాబ్ చౌదరి సమావేశానికి నోటీసు ఇచ్చారు. అయితే సుప్రీం కోర్టు నిబంధనల ప్రకారం ఇలాంటి సమావేశం కోసం తమ నుంచి ముందస్తు అనుమతి తీసుకోలేదు కాబట్టి సమావేశం నిర్వహించడం అక్రమమంటూ సీఈఓ నోటీసు పంపించింది. పైగా ఈ సమావేశానికి వచ్చేవారికి సంబంధించి టీఏ/డీఏ బిల్లులు, విమాన ఛార్జీలువంటివి కూడా చెల్లించరాదంటూ ఘాటుగా లేఖ రాసింది. తమ తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు ఎస్జీఎం గురించి ఎవరూ చర్చించరాదని కూడా సీఓఏ స్పష్టం చేసింది. ఈ వ్యవహారం బోర్డు అధికారులకు తీవ్ర ఆగ్రహం తెప్పించింది. అసలు సమావేశాన్ని ఆపే అధికారం సీఓఏకు లేదని, విధానపరమైన నిర్ణయాలలో రాయ్, ఎడుల్జీ కావాలని అతిగా జోక్యం చేసుకుంటున్నారని బోర్డు అధికారులు వ్యాఖ్యానించారు. ఈ తాజా వివాదం ఎక్కడి వరకు వెళుతుందనేది ఆసక్తికరం. -
‘అప్పటి వరకు డే/నైట్ టెస్ట్ ఆడేదిలేదు’
ముంబై : ఆస్ట్రేలియాతో డే/నైట్ టెస్టు ప్రతిపాదనను నిరాకరించిన బీసీసీఐ నిర్ణయాన్ని బోర్డు పాలకుల కమిటీ (సీఓఏ) అధ్యక్షుడు వినోద్ రాయ్ వెనకేసుకొచ్చాడు. డే/నైట్ టెస్టు ఆడితే ఓడిపోతామన్న భయంతోనే బీసీసీఐ స్వార్థంగా ఈ మ్యాచ్‌కు అంగీకరించట్లేదని ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్లు విమర్శిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాయ్ మాట్లాడుతూ.. ‘‘అన్ని మ్యాచ్‌లూ గెలవాలనుకోవడంలో తప్పేం ఉంది? 30 ఏళ్ల క్రితం డ్రా చేసుకునేందుకు భారత్ మ్యాచ్‌లాడుతోంది అనేవారు. ఇప్పుడేమో ఇలా అంటున్నారు. టీమిండియా ఆటగాళ్లు ఎప్పుడైతే డే/నైట్ టెస్టు ఆడడానికి సిద్ధంగా ఉన్నామని చెబుతారో అప్పుడే దానికి అంగీకరిస్తాం’’ అని స్పష్టం చేశాడు. బీసీసీఐ సీఈవో రాహుల్ జోహ్రి సైతం బోర్డు నిర్ణయాన్ని వెనుకేసుకొచ్చాడు. ఎవరితో ఎక్కడ, ఎప్పుడు, ఎలా ఆడాలనేది తమ వ్యవహారమని, తాము భారత్ విజయాల కోసం కృషి చేస్తామని రాహుల్ జోహ్రి తెలిపాడు. డే/నైట్ టెస్టు ప్రతిపాదనను బీసీసీఐ తిరస్కరించాడాన్ని ఆస్ట్రేలియా దిగ్గజ క్రికెటర్ మార్క్ వా తప్పుబట్టాడు. టెస్ట్ క్రికెట్‌కు పునర్జీవం పోయాలని తాము భావిస్తే బీసీసీఐ స్వార్థపూరితంగా వ్యవహరిస్తుందని మండిపడ్డాడు. ఇక డే/నైట్ టెస్టు ఆడాలంటే ఆటగాళ్లకు కనీసం 18 నెలల సాధన అవసరమని టీమిండియా హెడ్ కోచ్ రవిశాస్త్రి సూచించడంతో బీసీసీఐ క్రికెట్ ఆస్ట్రేలియా డే/నైట్ ప్రతిపాదనను తిరస్కరించిన విషయం తెలిసిందే. అయితే ఈ వ్యవహారంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. భారత్ డే/నైట్ టెస్టు ఆడాలని హర్భజన్ సూచించాడు. ‘డేనైట్ టెస్టుల్ని భారత్ ఎందుకు ఆడనంటుందో నాకైతే అర్థం కావట్లేదు. ఇది ఆసక్తికరంగా ఉంటుంది. ఓసారి ఆడిచూస్తే బాగుంటుంది. పింక్ బాల్ ఐతే ఏంటి. ఆడితే తప్పకుండా అలవాటు అవుతుంది. అదేమీ కష్టం కాదు... ఆడితే వచ్చే నష్టమూ లేదు’ అని అన్నాడు. -
మళ్లీ బ్యాంకింగ్ రంగంలోకి భట్టాచార్య
మాజీ ఎస్బీఐ చీఫ్ అరుంధతీ భట్టాచార్య మళ్లీ బ్యాంకింగ్ రంగంలోకి అడుగుపెట్టబోతున్నారు. ఎస్బీఐ చీఫ్‌గా పదవీ విరమణ చేసిన ఈమెను, బ్యాంక్స్ బోర్డు బ్యూరో చైర్మన్‌గా నియమించాలని ప్రభుత్వం యోచిస్తోందని ఎకనామిక్ టైమ్స్ రిపోర్టు చేసింది. వినోద్ రాయ్‌కి తదుపరి భట్టాచార్యను నియమించబోతున్నారు. ఇప్పటికే బోర్డు తదుపరి చైర్మన్ ఎంపిక చేసే ప్రక్రియను ప్రభుత్వం ప్రారంభించింది. అపాయింట్మెంట్స్ కమిటీ ఆఫ్ ది కేబినెట్ దీనిపై త్వరలో నిర్ణయం తీసుకోనుందని రిపోర్టు తెలిపింది. ఆశ్చర్యకరంగా భట్టాచార్యను రఘురామ్ రాజన్ తర్వాత ఆర్బీఐ గవర్నర్‌గా నియమించే నలుగురు షార్ట్‌లిస్టెడ్ అభ్యర్థుల్లో ఒకరిగా ఉన్నారు. అయితే ప్రభుత్వం ఆర్బీఐ గవర్నర్‌గా ఉర్జిత్ పటేల్‌ను నియమించారు. 1977లో ఎస్బీఐ చేరిన భట్టాచార్య, 2013 ఎస్బీఐకి చైర్మన్‌గా ఎంపికయ్యారు. ఎస్బీఐ తొలి మహిళా చైర్మన్ కూడా ఈమెనే. గతేడాది అక్టోబర్‌లో భట్టాచార్య ఎస్బీఐ నుంచి రిటైర్ అయ్యారు. ప్రస్తుతం ఆమెను బ్యాంక్స్ బోర్డు బ్యూరో చైర్మన్‌గా నియమించాలని ప్రభుత్వం యోచిస్తోంది. ప్రభుత్వ రంగ బ్యాంకుల పాలనను మెరుగుపరచడానికి 2016లో ఈ బీబీబీ ఏర్పాటైంది. దీనిలో చైర్మన్‌తో పాటు ముగ్గురు ఎక్స్-అఫిషియో మెంబర్లు, ముగ్గురు ఎక్స్పర్ట్ మెంబర్లు ఉంటారు. అందరూ సభ్యులు, చైర్మన్ కూడా పార్ట్‌టైమే. -
2జీ తీర్పు: ఇక ఆయన భరతం పట్టాలి!
సాక్షి, న్యూఢిల్లీ: 2జీ స్పెక్ట్రమ్ తీర్పు నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ.. మాజీ కంప్ట్రోలర్, ఆడిటర్ జనరల్ (కాగ్) వినోద్ రాయ్‌ను టార్గెట్ చేసింది. 2జీ స్కాం విషయంలో మాజీ కాగ్ వినోద్ రాయ్ తీరు కాగ్ చరిత్రలోనే నల్లమచ్చగా మిగిలిపోతుందని వ్యాఖ్యానించింది. ఈ వ్యవహారంలో వినోద్ రాయ్‌ను ప్రాసిక్యూట్ చేయాలని డిమాండ్ చేసింది. 'గతంలో తాను చేసిన పనికి మాజీ కాగ్ ఏవిధంగా ప్రతిఫలం పొందుతున్నారో ఇప్పుడు ప్రతి ఒక్కరూ చూస్తున్నారు. ఆయన ప్రభుత్వానికి బలమైన సలహాదారుగా వ్యవహరిస్తున్నారు. పలు బోర్డుల్లో, సంస్థల్లో పదవులు పొందారు. ఇది కాగ్ చరిత్రలోనే నల్లమచ్చగా మిగిలిపోతుంది' అని కాంగ్రెస్ నేత వడక్కన్ మీడియాతో అన్నారు. వినోద్ రాయ్‌ను దర్యాప్తు ఏజెన్సీలు వెంటనే ప్రాసిక్యూట్ చేయాలని, ఆయనపై విచారణ చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. 2జీ కుంభకోణంతో దేశ ఖజానాకు రూ. 1.76 లక్షల కోట్ల నష్టం వాటిల్లిందని అప్పట్లో కాగ్‌గా ఉన్న వినోద్ రాయ్ నివేదించిన సంగతి తెలిసిందే. 2జీ కుంభకోణంలో ప్రధాన నిందితులుగా ఉన్న కేంద్ర టెలికం మాజీ మంత్రి ఏ రాజా, డీఎంకే నాయకురాలు కనిమొళి సహా నిందితులందరినీ నిర్దోషులుగా ప్రకటిస్తూ ఢిల్లీ సీబీఐ కోర్టు సంచలన తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వినోద్ రాయ్ దేశానికి క్షమాపణ చెప్పాలని, ఆయన ప్రస్తుతం కొనసాగుతున్న ప్రభుత్వ పదవులన్నింటి నుంచి తప్పుకోవాలని వీరప్పమొయిలీ డిమాండ్ చేశారు. -
రూ.5 కోట్లు చేయండి
నాగ్‌పూర్: భారత కెప్టెన్ విరాట్ కోహ్లి, మాజీ సారథి ధోని తమ వార్షిక కాంట్రాక్టు ఫీజులు పెంచాలని బోర్డు పరిపాలక కమిటీ (సీఓఏ) చీఫ్ వినోద్ రాయ్‌ని కోరనున్నారు. ప్రస్తుతం ‘ఎ’ గ్రేడ్ క్రికెటర్లకు ఏడాదికి రూ. 2 కోట్లు చెల్లిస్తున్నారు. గతంలో ఈ మొత్తం రూ. కోటి ఉండేది. అయితే పెంచిన మొత్తం కూడా చాలదని అప్పట్లోనే క్రికెటర్లు అసంతృప్తి వెలిబుచ్చారు. అప్పటి కోచ్ కుంబ్లే సీఓఏకు ఇచ్చిన నివేదికలో రూ. 5 కోట్లు చెల్లించాలని సూచించారు. ఐపీఎల్ కాంట్రాక్టులేని పుజారా లాంటి క్రికెటర్ల అంశాన్ని అందులో ప్రస్తావించారు. సీఓఏ కూడా ఆటగాళ్ల వార్షిక ఫీజులు పెంచేందుకు సుముఖంగానే ఉంది. కుంబ్లే నివేదిక అంశాలను పొందుపరుస్తూ వినోద్ రాయ్ సుప్రీం కోర్టుకు నివేదించారు కూడా. అయితే దీనిపై భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ)దే తుది నిర్ణయం. డిసెంబర్ 11న జరిగే బోర్డు ప్రత్యేక సర్వ సభ్య సమావేశం(ఎస్జీఎం)లో ఆమోదం లభిస్తేనే ఆటగాళ్ల జీతాలు పెరుగుతాయి. దీనిపై బీసీసీఐ ఉన్నతాధికారి ఒకరు మాట్లాడుతూ ‘ఐపీఎల్ బ్రాడ్కాస్ట్ ఆదాయంలో ఆటగాళ్లు వాటా కోరారని మీడియాలో వచ్చిన వార్తల్లో నిజం లేదు. ఏ ఆటగాడు అలాంటి ప్రతిపాదన చేయలేదు. అయితే ఆటగాళ్లకు కాంట్రాక్టు మొత్తాలు పెంచాలని సీఓఏ కూడా భావిస్తోంది’ అని అన్నారు. ప్రస్తుతం క్రికెటర్లు బోర్డు ఆదాయంలో 8 శాతంలోపే అందుకుంటున్నారు. దీన్ని మార్చాలని వినోద్ రాయ్ అనుకుంటున్నప్పటికీ బోర్డే తుది నిర్ణయం తీసుకోవాలి. అందుకే... టి20 జట్టును ప్రకటించలేదా! వన్డే సిరీస్ నుంచి విశ్రాంతి తీసుకున్న కోహ్లి టి20లపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడం వల్లే జాతీయ సెలక్టర్లు భారత టి20 జట్టును ప్రకటించలేకపోయారు. కీలకమైన దక్షిణాఫ్రికా టూర్‌కు ముందు విశ్రాంతి కావాలని చెప్పడంతో కోహ్లిని లంకతో మూడు వన్డేల సిరీస్‌కు ఎంపిక చేయలేదు. తదుపరి మూడు టి20లలో ఆడేది లేనిది స్పష్టంగా చెప్పకపోవడంతో టి20 జట్టు ఎంపికను ఎమ్మెస్కే ప్రసాద్ బృందం వాయిదా వేసింది. ‘డిసెంబర్ 12 వరకు కోహ్లికి వ్యక్తిగత పనులున్నాయి. ఆ తర్వాతే అతను ఆడటంపై స్పష్టత వస్తుంది’ అని బోర్డు అధికారి ఒకరు తెలిపారు. శ్రీలంకతో వచ్చే నెల 20, 22, 24 తేదీల్లో మూడు టి20 మ్యాచ్‌లు జరుగుతాయి. -
కోహ్లీ నేతృత్వంలో టీమిండియా సరికొత్త డిమాండ్
సాక్షి, న్యూఢిల్లీ : తమ జీతాలు పెంచాలన్న సరికొత్త డిమాండ్‌ను టీమిండియా ఆటగాళ్లు తెరపైకి తీసుకొచ్చారు. భారత జట్టుకు అన్ని ఫార్మాట్లలో కెప్టెన్ అయిన విరాట్ కోహ్లీ నేతృత్వంలోనే జట్టు ఆటగాళ్లు తమ కాంట్రాక్టు నగదును సవరించాలని కోరేందుకు సిద్ధంగా ఉన్నారట. కోహ్లీ, ధోనీ, రవిశాస్త్రిలు కలిసి బీసీసీఐ అధికారి వినోద్ రాయ్‌తో ఈ శుక్రవారం భేటీ అయ్యే అవకాశాలున్నాయి. ఈ విషయాన్ని బోర్డుకు చెందిన ఓ సీనియర్ ఉద్యోగి వెల్లడించాడు. గత కొంత కాలం నుంచి టీమిండియా తీరికలేని షెడ్యూళ్లతో సిరీస్‌లు ఆడుతోంది. ఈ నేపథ్యంలో విశ్రాంతి కావాలని, తాను రోబోను కాదంటూ కోహ్లీ బీసీసీఐపై ఆగ్రహం వ్యక్తం చేయగా, మాజీ కెప్టెన్లు ఎంఎస్ ధోనీ, సౌరవ గంగూలీ, ప్రధాన కోచ్ రవిశాస్త్రిలు మద్ధతు తెలిపారు. ఈ క్రమంలో లంకతో వన్డే సిరీస్ నుంచి కోహ్లీకి విశ్రాంతి నిచ్చారు. అయితే తాజాగా బోర్డు తమ వేతనాలను సవరించాలని టీమిండియా అన్ని ఫార్మాట్ల ఆటగాళ్లు ఆశించడం తెరపైకి వచ్చింది. గత సెప్టెంబర్ 30తో ఆటగాళ్ల కాంట్రాక్ట్ గడువు ముగిసింది. స్టార్ ఇండియా చానెల్ 2018 నుంచి 2022 వరకు ఇండియన్ ప్రీమియర్ లీగ్స్ (ఐపీఎల్) ప్రసార హక్కులను బీసీసీఐకి భారీగా చెల్లించి సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. తమ వేతన కాంట్రాక్టు ముగియడంతో కొత్త వేతన కాంట్రాక్ట్‌లో తమ జీతభత్యాలు మరింత పెంచాలని ఆటగాళ్లు కోరుతున్నారు. ఈ నేపథ్యంలో ధోనీ, రవిశాస్త్రిలతో చర్చించిన అనంతరం ముగ్గురు కలిసి కాంట్రాక్ట్ వేతనాల పెంపుకోసం వినోద్ రాయ్‌తో భేటీ అవనున్నట్లు సమాచారం. మరోవైపు ఈ ఏడాది క్రికెటర్ల వేతనాలను బీసీసీఐ భారీ పెంచగా.. ఏ గ్రేడ్ (టాప్ ప్లేయర్స్) క్రికెటర్లు రూ. 1.93 కోట్ల వార్షిక ఆదాయాన్ని అందుకుంటున్నారు. -
వచ్చే ఏడాదే మహిళా క్రికెటర్ల ఐపీఎల్..?
న్యూఢిల్లీ: వచ్చే ఏడాది నుంచే మహిళల ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ప్రారంభమయ్యే అవకాశం ఉన్నట్లు (నిర్వహకుల కమిటీ) సీఓఏ చైర్మెన్ వినోద్‌రాయ్ సంకేతాలు ఇచ్చారు. దేశంలో మహిళల క్రికెట్‌కు ఆదరణ కల్పించేందుకు సీఓఏ చర్యలు తీసుకుంటందన్నారు. సీఓఏ మెంబర్ డయానా ఎడుల్జీ, భారత మహిళల క్రికెట్ కెప్టెన్ మిథాలీ రాజ్, సీనియర్ బౌలర్ జులాన్ గోస్వామిలతో కలిసి భవిష్యత్ షెడ్యూల్ డ్రా తీసినట్లు, త్వరలోనే మహిళల ఐపీఎల్‌ను కూడా చూస్తారని టైమ్స్‌లిట్ కార్యక్రమంలో రాయ్ వ్యాఖ్యానించారు. మహిళా క్రికెటర్ల మ్యాచ్ ఫీజును డబుల్ చేశామని, మెన్ క్రికెటర్ల కన్నా వీరికిచ్చే రివార్డులు తక్కువేనన్నారు. మెన్, ఉమెన్ క్రికెటర్లకు సమాన స్థాయిలో మ్యాచ్ ఫీజు అందించలేమన్న ఆయన మెన్ క్రికెట్ రెవెన్యూ ఆదాయం ఎక్కువా అని భవిష్యత్తులో మహిళా క్రికెటర్లు కూడా ఆస్థానం అందుకుంటారని భావిస్తున్నట్లు తెలిపారు. వచ్చే ఏడాది నుంచి భారత మహిళా క్రికెట్లో మార్పు మెదలు కావచ్చన్నారు. ప్రపంచకప్ ఫైనల్ చేరి అందరి మన్ననలు పొందిన మిథాలీసేన.. అనంతరం మ్యాచ్ షెడ్యూల్స్ లేక ఇబ్బంది పడుతున్న విషయం తెలిసిందే. ఒకవేళ మ్యాచ్‌లున్నా అవి ప్రత్యక్ష ప్రసారం లేకపోవడంతో మహిళా క్రికెట్ ఆదరణకు నోచుకోవడం లేదు. -
ద్రవిడ్, జహీర్ లపై నిర్ణయం పెండింగ్!
ముంబై:భారత క్రికెట్ జట్టు ప్రధాన కోచ్‌గా రవిశాస్త్రి నియామకాన్ని మాత్రమే సమర్ధిస్తున్న బీసీసీఐ పాలకుల కమిటీ(సీవోఏ) మరోసారి ఆ విషయాన్ని స్ఫష్టం చేసింది. భారత క్రికెట్ బౌలింగ్ కోచ్ గా జహీర్ ఖాన్, విదేశాల్లో బ్యాటింగ్ కన్సల్టెంట్ గా రాహుల్ ద్రవిడ్ కు బాధ్యతలు అప్పచెబుతూ బీసీసీఐ అడ్వైజరీ కమిటీ(సీఏసీ) తీసుకున్న నిర్ణయం ఇంకా పెండింగ్ లోనే ఉందని సీవోఏ చీఫ్ వినోద్ రాయ్ తాజాగా స్పష్టం చేశారు. ఈ మేరకు జాతీయ న్యూస్ ఛానలె రిపబ్లిక్ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో జహీర్, ద్రవిడ్ ల నియామకంపై మాట్లాడారు. వారి ఎంపికకు సంబంధించి ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని పేర్కొన్నారు. జూలై 22వ తేదీన వారి పదవులకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందన్నారు. ప్రస్తుతం సీఏసీ ఎంపిక చేసిన ప్రధాన కోచ్ రవిశాస్త్రి నియమాకాన్ని మాత్రమే అధికారంగా ధృవీకరించినట్లు వినోద్ రాయ్ తెలిపారు.రాహుల్ ద్రవిడ్, జహీర్ ఖాన్ ల విషయంపై సమీక్ష జరుపుతున్నట్లు ఆయన వెల్లడించారు. కేవలం ప్రధాన కోచ్ ను మాత్రమే ఎంపిక చేయాల్సిన సీఏసీ.. మరో అడుగు ముందుకేసి బౌలింగ్ , బ్యాటింగ్ కన్సల్టెంట్ లను ఎంపిక చేయడం సీవోఏకు ఆగ్రహం తెప్పించింది. దీనిలో భాగంగానే ఆ ఇద్దరి ఎంపికను పెండింగ్ లో పెట్టింది. -
సుప్రీం తీర్పు అమల్లో వేగం పెంచుతాం: రాయ్
ముంబై: బీసీసీఐ ప్రక్షాళన కోసం సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును అమలు చేయడంలో జాప్యం జరుగుతుండటాన్ని పలువురు విమర్శిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ విషయంలో వేగం పెంచుతామని పరిపాలక కమిటీ చైర్మన్ వినోద్ రాయ్ తెలిపారు. ‘లోధా ప్యానెల్ ప్రతిపాదనల అమలు కోసం బీసీసీఐ ఏర్పాటు చేసిన కమిటీపై మాకు ఎలాంటి అసంతృప్తి లేదు. బోర్డు ఎస్జీఎం ఎలాంటి నిర్ణయం తీసుకున్నా మేం చేయాల్సింది చేస్తాం. అక్టోబర్ 31 వరకు మా పని పూర్తవుతుందని ఆశిస్తున్నాం. కొత్త నియమావళి ప్రకారం ఆఫీస్ బేరర్లు ఎంపికవుతారు’ అని రాయ్ అన్నారు.