మన్మోహన్ నిర్ణయాన్ని స్వాగతించిన రాయ్
ముంబై: తన అనుభవాలతో పుస్తకం రాస్తానని మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ప్రకటించడాన్ని మాజీ కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) వినోద్ రాయ్ స్వాగతించారు. మన్మోహన్ సింగ్ మంచి నిర్ణయం తీసుకున్నారని వ్యాఖ్యానించారు. ఆయన ప్రధానిగా పనిచేసిన కాలంలో ఏం జరిగిందో తెలుసుకోవాల్సిన అవసరముందన్నారు.
ఉన్నత పదవులను అలంకరించిన వారందరూ తమ అనుభవాలను పుస్తకాలుగా మలచాలని వినోద్ రాయ్ సూచించారు. రాయ్ రాసిన 'నాట్ జస్ట్ యాన్ అకౌంటెంట్' పుస్తకంలో గత యూపీఏ ప్రభుత్వం, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌పై విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే.