వినోద్ ఆరోపణలపై స్పందించిన మన్మోహన్ సింగ్
న్యూఢిల్లీ: మాజీ కాగ్ వినోద్ రాయ్ చేసిన ఆరోపణలపై స్పందించడానికి మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ నిరాకరించారు. ప్రధానిగా నా భాధ్యతల్ని సక్రమంగానే నిర్వహించాను అని మన్మోహన్ సింగ్ వ్యాఖ్యలు చేశారు.
2జీ స్పెక్ట్రమ్, కోల్ గేట్ కుంభకోణాల అంశాలపై ప్రధానిపై మాజీ కాగ్ చైర్మన్ వినోద్ ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. వినోద్ చేసిన వ్యాఖ్యలపై తాను స్పందించబోనని మన్మోహన్ తెలిపారు. మన్మోహన్ సింగ్ కూతురు దామన్ సింగ్ రచించిన 'స్ట్రిక్ట్ లీ పరసనల్: మన్మోహన్ అండ్ గురుశరణ్' అనే పుస్తకావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు.