
న్యూఢిల్లీ: వచ్చే ఏడాది నుంచే మహిళల ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ప్రారంభమయ్యే అవకాశం ఉన్నట్లు (నిర్వహకుల కమిటీ) సీఓఏ చైర్మెన్ వినోద్‌రాయ్ సంకేతాలు ఇచ్చారు. దేశంలో మహిళల క్రికెట్‌కు ఆదరణ కల్పించేందుకు సీఓఏ చర్యలు తీసుకుంటందన్నారు. సీఓఏ మెంబర్ డయానా ఎడుల్జీ, భారత మహిళల క్రికెట్ కెప్టెన్ మిథాలీ రాజ్, సీనియర్ బౌలర్ జులాన్ గోస్వామిలతో కలిసి భవిష్యత్ షెడ్యూల్ డ్రా తీసినట్లు, త్వరలోనే మహిళల ఐపీఎల్‌ను కూడా చూస్తారని టైమ్స్‌లిట్ కార్యక్రమంలో రాయ్ వ్యాఖ్యానించారు.
మహిళా క్రికెటర్ల మ్యాచ్ ఫీజును డబుల్ చేశామని, మెన్ క్రికెటర్ల కన్నా వీరికిచ్చే రివార్డులు తక్కువేనన్నారు. మెన్, ఉమెన్ క్రికెటర్లకు సమాన స్థాయిలో మ్యాచ్ ఫీజు అందించలేమన్న ఆయన మెన్ క్రికెట్ రెవెన్యూ ఆదాయం ఎక్కువా అని భవిష్యత్తులో మహిళా క్రికెటర్లు కూడా ఆస్థానం అందుకుంటారని భావిస్తున్నట్లు తెలిపారు. వచ్చే ఏడాది నుంచి భారత మహిళా క్రికెట్‌లో మార్పు మెదలు కావచ్చన్నారు.
ప్రపంచకప్ ఫైనల్ చేరి అందరి మన్ననలు పొందిన మిథాలీసేన.. అనంతరం మ్యాచ్ షెడ్యూల్స్ లేక ఇబ్బంది పడుతున్న విషయం తెలిసిందే. ఒకవేళ మ్యాచ్‌లున్నా అవి ప్రత్యక్ష ప్రసారం లేకపోవడంతో మహిళా క్రికెట్ ఆదరణకు నోచుకోవడం లేదు.
Comments
Please login to add a commentAdd a comment