బ్యాంకులకు 10 వేల కోట్లు సరిపోతాయ్‌: రాయ్‌ | Rs 10000 cr recapitalisation for PSBs in FY'18 enough: Vinod Rai | Sakshi
Sakshi News home page

బ్యాంకులకు 10 వేల కోట్లు సరిపోతాయ్‌: రాయ్‌

Published Fri, Feb 17 2017 12:33 AM | Last Updated on Tue, Sep 5 2017 3:53 AM

బ్యాంకులకు 10 వేల కోట్లు సరిపోతాయ్‌: రాయ్‌

బ్యాంకులకు 10 వేల కోట్లు సరిపోతాయ్‌: రాయ్‌

న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బ్యాంకులకు రానున్న ఆర్థిక సంవత్సరం తాజా మూలధనంగా రూ.10,000 కోట్లు సరిపోతుందని బ్యాంక్స్‌ బోర్డ్‌ బ్యూరో (బీబీబీ) చీఫ్‌ వినోద్‌ రాయ్‌ గురువారంనాడు పేర్కొన్నారు. ఇక్కడ బంధన్‌ బ్యాంక్‌ ప్రారంభ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, ఈ సందర్భంగా మాట్లాడుతూ, మార్కెట్‌ నుంచి మరిన్ని నిధుల సమీకరణకు రైట్స్‌ ఇష్యూకు కూడా అనుమతి ఉన్న నేపథ్యంలో 2017–18 సంవత్సరానికి రూ.10,000 కోట్ల మూలధనం సరిపోతుందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

బ్యాడ్‌ బ్యాంక్‌పై చెప్పలేం...!
మొండిబకాయిల పరిష్కారం దిశలో బ్యాడ్‌ బ్యాంక్‌ ఏర్పాటు ప్రతిపాదనపై విభిన్న వాదనలు ఉన్నాయని అన్నారు. దీని అమలు ఇప్పటికి ప్రశ్నార్థకమేనని వెల్లడించారు. కాగా ఖాళీగా ఉన్న ఇండియన్‌ ఓవర్‌సీస్‌ బ్యాంక్‌ (ఐఓబీ) సీఎండీ నియామకానికి ప్రభుత్వానికి బీబీబీ ఇప్పటికే తన ప్రతిపాదనలను పంపినట్లు ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement