పద్మనాభుని సంపదపై ప్రత్యేక ఆడిట్
న్యూఢిల్లీ: కేరళలోని ప్రఖ్యాత పద్మనాభ స్వామి ఆలయం సందపపై ప్రత్యేక ఆడిట్‌కు సుప్రీంకోర్టు ఆదేశించింది. మాజీ కాగ్ వినోద్ రాయ్ పర్యవేక్షణలో ఆడిట్ నిర్వహించాలని అత్యున్నత న్యాయస్థానం సూచించింది. తిరువనంతపురం జిల్లా కోర్టు న్యాయమూర్తి ఆధ్వర్యంలో కొత్త కార్యనిర్వహక కమిటీని ఏర్పాటు చేస్తున్నట్టు సుప్రీంకోర్టు ప్రకటించింది. ఒకవేళ జిల్లా కోర్టు న్యాయమూర్తి హిందూ మతానికి చెందిన వ్యక్తికాకపోతే ఆయన తర్వాతి సీరియర్ జడ్జి కమిటీకి నేతృత్వం వహిస్తారని వెల్లడించింది.
తదుపరి ఆదేశాలిచ్చే వరకు ఆలయ సంపదను పరాధీనం చేయడం, అమ్మడం కానీ చేయరాదని స్పష్టం చేసింది. పద్మనాభ స్వామి ఆలయ యాజమాన్యం నిబంధనల ఉల్లంఘన, ఆలయ సంపద వంటి అంశాలపై సీనియర్ అడ్వొకేట్ గోపాల సుబ్రమణియం ఈ నెల 15న సమర్పించిన నివేదికపై విచారణ ప్రారంభించిన ధర్మాసనం పైవిధంగా ఆదేశించింది.