
విండీస్ పర్యటనకు కుంబ్లేనే కోచ్
న్యూఢిల్లీ: భారత జట్టు కోచ్‌గా అనిల్ కుంబ్లేను కొనసాగిస్తున్నట్లు బీసీసీఐ పరిపాలకుల కమిటీ ( సీఓఏ) సోమవారం స్పష్టం చేసింది. ఈ నెల చివర్లో భారత జట్టు పర్యటించే వెస్టిండీస్ సిరీస్ వరకు కుంబ్లేనే కోచ్‌గా ఉంటాడని సీఓఏ చీఫ్ వినోద్ రాయ్ తెలిపారు. ఈ నెల 20 తో కుంబ్లే కోచ్‌పదవి కాలం ముగియనుండటంతో బీసీసీఐ దరఖాస్తులు ఆహ్వానించిన విషయం తెలిసిందే.
కుంబ్లేకు భారత కెప్టెన్ కోహ్లీకి విభేదాలు తలెత్తడంతో మార్పు అనివార్యమని అందరూ భావించినా బీసీసీఐ కుంబ్లే పదవి కాలన్ని పొడిగించింది. అంతకు ముందు సచిన్, గంగూలీ, లక్ష్మణ్‌తో కూడిన క్రికెట్ సలహాదారుల కమిటీ కోచ్‌గా అనిల్ కుంబ్లేనే కొనసాగించాలని బీసీసీఐకి సూచించినట్లు వార్తలు వచ్చాయి.