బంగారు నగల వ్యాపార శ్రేణిలో ప్రపంచ ప్రఖ్యాతి సాధించిన కల్యాణ్ జ్యుయెలర్స్ చెన్నై శాఖను...
చెన్నై, సాక్షి ప్రతినిధి: బంగారు నగల వ్యాపార శ్రేణిలో ప్రపంచ ప్రఖ్యాతి సాధించిన కల్యాణ్ జ్యుయెలర్స్ చెన్నై శాఖను శుక్రవారం అంగరంగ వైభవంగా ప్రారంభించారు. కల్యాణ్ జ్యుయెలర్స్ బ్రాండ్ అంబాసిడర్స్‌గా వ్యవహరిస్తున్న బాలివుడ్ సూపర్‌స్టార్ అమితాబ్ బచ్చన్, నటి ఐశ్వర్యారాయ్, తెలుగు హీరో యువసామ్రాట్ నాగార్జున, తమిళ నటులు ప్రభు, విక్రమ్‌ప్రభు, కన్నడ హీరో శివరాజ్‌కుమార్, మలయాళి నటి మంజూ వారియర్ ఈ ప్రారంభోత్సవానికి తరలివచ్చారు.
కల్యాణ్ జ్యుయెలర్స్ అధినేతలు కల్యాణసుందరం, రాజేష్, రమేష్ ఆహూతులకు ఘనంగా స్వాగతం పలికారు. భారత చలన చిత్ర రంగంలోని అన్ని భాషల నుంచి నటీనటులు తరలిరావడంతో ఆ ప్రాంతం అంతా జనసంద్రంగా మారింది. అమితాబ్ సహా అందరూ తమిళ సంప్రదాయ పంచకట్టులో వచ్చి అందరినీ ఆకట్టుకున్నారు. నటీనటులు అందరూ ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. అమితాబ్ తమిళంలో మాట్లాడి ప్రజల నుంచి హర్షధ్వానాలు అందుకున్నారు.
పశ్చిమాసియా దేశాల స్థాయిలో ప్రథమస్థానంలో నిలిచేలా చెన్నై కల్యాణ్ జ్యుయెలర్స్ షోరూంను తీర్చిదిద్దినట్లు అధినేతలు చెప్పారు. దేశంలో 78వ శాఖగా, దక్షిణాదిలో 50వ షోరూంగా చెన్నై శాఖను ప్రారంభించారు. చెన్నైలోనే అన్నానగర్, అడయార్, క్రోంపేటల్లో దశల వారీగా త్వరలో మరో మూడు షోరూంలను ప్రారంభిస్తున్నట్లు అధినేతలు చెప్పారు.