
కల్యాణ్ జ్యువెల్లర్స్ ‘7 స్టార్ సెలబ్రేషన్’ పథకం
హైదరాబాద్: ప్రముఖ బంగారు ఆభరణాల తయారీ సంస్థ కల్యాణ్ జ్యువెల్లర్స్ పలు వినూత్న పథకాలను ప్రకటించింది. వినియోగదారుల అవసరాలకు కచ్చితంగా సరిపోయే విధంగా ప్రత్యేక ఆఫర్లు, ఆకర్షణీయమైన ప్యాకేజీలు, కొత్త డిజైన్లతో ‘7 స్టార్ సెలబ్రేషన్’ పథకాన్ని రూపొందించినట్లు సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. కల్యాణ్ జ్యువెల్లర్స్ బ్రాండ్ అంబాసిడర్, సినీనటుడు నాగార్జున ఈ పథకాన్ని సెప్టెంబర్ 5న పంజాగుట్ట, కూకట్‌పల్లి షోరూమ్‌లలో ఆవిష్కరించనున్నారు. ఈ పథకం వినియోగదారులకు సరికొత్త షాపింగ్ అనుభూతిని కలిగిస్తుందని సంస్థ మేనేజింగ్ డెరైక్టర్ టి.ఎస్.కల్యాణ రామన్ తెలిపారు.