టీనగర్: ప్రముఖ జ్యువెలరీ సంస్థ కల్యాణ్ జ్యువెలర్స్ నగరంలోని అన్నానగర్, వేళచ్చేరిలలో కొత్తగా తమ నాలుగు, ఐదో షోరూంలను ఆదివారం ప్రారంభించింది. ప్రముఖ సినీతారలు నటుడు ప్రభు గణేశన్, నటి సోనమ్ కపూర్ వీటిని లాంఛనంగా ప్రారంభించారు. ఇందులో కల్యాణ్ జ్యువెలర్స్ చైర్మన్, మేనేజింగ్ డెరైక్టర్ టీఎస్.కల్యాణరామన్, ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్స్ రాజేష్ కల్యాణరామన్, రమేష్ కల్యాణరామన్, కల్యాణ్ డెవలపర్స్, మేనేజింగ్ డెరైక్టర్ ఆర్ కార్తిక్‌లు వేళచ్చేరిలో ఏర్పాటైన షోరూం వద్దకు ముందుగా చేరుకుని అక్కడ పెద్ద ఎత్తున హాజరైన ప్రజలతో ముచ్చటించారు. అక్కడ నుంచి సినీతారలు, కల్యాణ్ సీనియర్ మేనేజ్‌మెంట్ అన్నానగర్ షోరూం వద్దకు చేరుకున్నారు.
అక్కడ ప్రజల నుంచి వీరికి అనూహ్య స్పందన లభించింది. దీంతో ప్రజలకు కృతజ్ఞతగా తమ అభివాదాలను తెలిపారు. అన్నానగర్‌లో ప్రజల నుద్దేశించి నటుడు ప్రభు మాట్లాడుతూ ప్రస్తుతం కల్యాణ్ జ్యువెలర్స్ అన్నానగర్, వేలచ్చేరిలలో కొత్తగా షోరూంలను ఏర్పాటుచేయడం ద్వారా భారత్, మధ్య ఆసియాలో ఈ షోరూంల సంఖ్య 102కు చేరుకుందన్నారు. కల్యాణ్ జ్యువెలర్స్ తమ ఆరో షోరూం ప్రారంభించినప్పటి నుంచి ఆ సంస్థతో తనకు అనుబంధం ఉందన్నారు. నటి సోనం కపూర్‌ను చిన్న వయసులో చూశానని, ఆమె ప్రస్తుతం కల్యాణ్ జ్యువెలర్స్ ఫ్యామిలీలో చేరడం సంతోషంగా ఉందన్నారు. కల్యాణ్ జ్యువెలర్స్ మరింతగా అభివృద్ధి సాధించాలన్న ఆశాభావం వ్యక్తం చేశారు. నటి సోనం కపూర్ మాట్లాడుతూ కల్యాణ్ జ్యువెలర్స్ ప్రారంభోత్సవంలో పాల్గొనడం తనకో ప్రత్యేకతని తెలిపారు.
చెన్నైలో కల్యాణ్ జ్యువెలర్స్ నూతన షోరూంలు
Published Mon, Sep 26 2016 2:23 AM | Last Updated on Mon, Sep 4 2017 2:58 PM
Advertisement
Advertisement