అయోధ్య రామ మందిర పరిసర ప్రాంతాల్లో దొంగలు చేతి వాటం చూపించినట్లు తెలుస్తోంది. భక్తులు అయోధ్యలోని రామమందిరానికి చేరుకునే మార్గాలైన భక్తిపథ్, రామ్‌పథ్ మార్గాల్లో అమర్చిన రూ.50లక్షల విలువైన దాదాపు 3,800 బాంబో లైట్లు, 36 గోబో ప్రొజెక్టర్లు కనిపించకుండా పోయినట్లు పీటీఐ నివేదించింది.
పీటీఐ కథనం ప్రకారం.. భక్తిపథ్ మార్గం రామాలయానికి వెళ్లే ప్రధాన రహదారి. ఇది శృంగార్ ఘాట్ నుండి హనుమాన్ గర్హికి చివరకు ఆలయానికి కలుపుతుంది. అయోధ్యలోని మరో కీలక మార్గం రామ్ పథ్, సదత్‌గంజ్‌ను నయా ఘాట్‌ను కలుపుతూ 13 కిలోమీటర్ల పొడవైన హైవే.
అయితే ఈ రామ్ పథ్ మార్గంలో లైట్లను అమర్చే కాంట్రాక్ట్‌ను అయోధ్య డెవలప్‌మెంట్ అథారిటీ యష్ ఎంటర్‌ప్రైజెస్, కృష్ణ ఆటోమొబైల్స్ సంస్థలకు అప్పగించింది. రామ్‌పథ్‌లో మొత్తం 6,400 బాంబో లైట్లను, భక్తి పథ్‌లో96 గోబో ప్రొజెక్టర్ లైట్లను ఏర్పాటు చేశాయి. కానీ మే 9 తర్వాత 6,400 బాంబో లైట్లలో 3,800 బాంబో లైట్లు చోరీకి గురైనట్లు ఆ సంస్థ ప్రతినిధులు గుర్తించారు.
తాము అమర్చిన లైట్లు, ప్రొజెక్టర్లు చోరీకి గురైనట్లు సంస్థ ప్రతినిధి శేఖర్ శర్మ ఆగస్టు 9న రామ జన్మభూమి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
Comments
Please login to add a commentAdd a comment