street light
-
అయోధ్య రామ మందిర మార్గంలో దొంగల చేతివాటం
అయోధ్య రామ మందిర పరిసర ప్రాంతాల్లో దొంగలు చేతి వాటం చూపించినట్లు తెలుస్తోంది. భక్తులు అయోధ్యలోని రామమందిరానికి చేరుకునే మార్గాలైన భక్తిపథ్, రామ్‌పథ్ మార్గాల్లో అమర్చిన రూ.50లక్షల విలువైన దాదాపు 3,800 బాంబో లైట్లు, 36 గోబో ప్రొజెక్టర్లు కనిపించకుండా పోయినట్లు పీటీఐ నివేదించింది.పీటీఐ కథనం ప్రకారం.. భక్తిపథ్ మార్గం రామాలయానికి వెళ్లే ప్రధాన రహదారి. ఇది శృంగార్ ఘాట్ నుండి హనుమాన్ గర్హికి చివరకు ఆలయానికి కలుపుతుంది. అయోధ్యలోని మరో కీలక మార్గం రామ్ పథ్, సదత్గంజ్ను నయా ఘాట్‌ను కలుపుతూ 13 కిలోమీటర్ల పొడవైన హైవే.అయితే ఈ రామ్ పథ్ మార్గంలో లైట్లను అమర్చే కాంట్రాక్ట్‌ను అయోధ్య డెవలప్మెంట్ అథారిటీ యష్ ఎంటర్ప్రైజెస్, కృష్ణ ఆటోమొబైల్స్ సంస్థలకు అప్పగించింది. రామ్‌పథ్‌లో మొత్తం 6,400 బాంబో లైట్లను, భక్తి పథ్‌లో96 గోబో ప్రొజెక్టర్ లైట్లను ఏర్పాటు చేశాయి. కానీ మే 9 తర్వాత 6,400 బాంబో లైట్లలో 3,800 బాంబో లైట్లు చోరీకి గురైనట్లు ఆ సంస్థ ప్రతినిధులు గుర్తించారు.తాము అమర్చిన లైట్లు, ప్రొజెక్టర్లు చోరీకి గురైనట్లు సంస్థ ప్రతినిధి శేఖర్ శర్మ ఆగస్టు 9న రామ జన్మభూమి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. -
పగలంతా పెద్ద మనుషులు, రాత్రి అయితే..?
పగలంతా ఎంతో పెద్దమనుషులుగా చలామణి అయ్యే చాలా మంది రాత్రి అయ్యేసరికి ఎలా మారిపోతారు, వారి క్రిమినల్ ఆలోచనలు ఎలా ఉంటాయి? తమ క్రైమ్ లైఫ్‌ని ఎంజాయ్ చేస్తూ.. అమాయకుల జీవితాలతో ఎలా ఆడుకుంటారు? చీకట్లో, ముఖ్యంగా స్ట్రీట్ లైట్ కింద జరిగే సంఘటనలు ఏంటనేవి ‘స్ట్రీట్ లైట్’సినిమా ద్వారా చూపించబోతున్నాం’అని అన్నారు ప్రముఖ నిర్మాత మామిడాల శ్రీనివాస్. మూవీ మాక్స్ బ్యానర్ పై తాన్య దేశాయ్, అంకిత్ రాజ్, కావ్య రెడ్డి, సీనియర్ హీరో వినోద్ కుమార్ నటీనటులుగా విశ్వ దర్శకత్వంలో ప్రముఖ నిర్మాత , డిస్ట్రిబ్యూటర్ మామిడాల శ్రీనివాస్ నిర్మించిన చిత్రం "స్ట్రీట్ లైట్". అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం సెప్టెంబర్ రెండవ వారంలో గ్రాండ్ గా ప్రి రిలీజ్ చేసుకొని మూడవ వారంలో చిత్రాన్ని విడుదల చేయడానికి చిత్ర నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా నిర్మాత మామిడాల శ్రీనివాస్ మాట్లాడుతూ... క్రైమ్, లవ్, రొమాన్స్, ఫ్యామిలీ ఎమోషన్స్ ఇలా అన్ని ఎమోషన్స్ తో తెరకేక్కించిన మెసెజ్ ఓరియెంటెడ్ సినిమా ఇది. తెలుగు, హిందీ రెండు భాషల్లో ఈ సినిమాను తీశాం. .ముందుగా మా సినిమాను ఓటిటి లో విడుదల చేద్దాం అనుకున్నాం. కానీ ఓటీటీల వలన కొద్దిమందికి మాత్రమే జీవనోపాధి కలుగుతుంది. అదే ఒక థియేటర్ వలన ఎంతో మందికి జీవనోపాధి కలుగుతుందనే ఆలోచనతో ప్రస్తుత పరిస్థితుల దృష్టి లో ఉంచుకొని అందరూ కూడా తమ సినిమాలను థియేటర్స్ లలోనే విడుదల చేయాలని అందరికీ సవినయంగా తెలియ జేస్తున్నాను. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న మా సినిమా హిందీ సెన్సార్ పూర్తి చేసుకొని తెలుగు సెన్సార్ కు వెళ్లబోతుంది.మా చిత్రాన్ని సెప్టెంబర్ రెండవ వారంలో గ్రాండ్ గా ప్రి రిలీజ్ చేసుకొని మూడవ వారంలో మా సినిమాను థియేటర్స్ లొనే విడుదల చేస్తున్నాం’అన్నారు. ఈ చిత్రానికి సంగీతం విరించి; సినిమాటోగ్రఫీ : రవి కుమార్. -
వీధిదీపాలుగా ఎల్ఈడీ బల్బులు!
సాక్షి, ముంబై: సీసీటీవీ కెమెరాల పనితీరుపై వీధిదీపాలు ప్రభావం చూపుతున్నాయి. దీంతో వాటిని మార్చివేయాలని బీఎంసీ నిర్ణయించింది. నగర రహదారులపై ప్రయోగాత్మకంగా ఏర్పాటుచేసిన సీసీటీవీ కెమెరాల్లో ముఖాలు స్పష్టంగా కనిపించకపోవడంతో ఏకంగా వీధి దీపాలను (స్ట్రీట్ లైట్స్) మార్చాలని నగర పాలక సంస్థ (బీఎంసీ) నిర్ణయం తీసుకుంది. అందుకు సంబంధించిన ప్రతిపాదనపై బీఎంసీ మహాసభలో చర్చలు జరిగాయి. అన్ని పార్టీల కార్పొరేటర్ల నుంచి ఆమోదం లభించడంతో వీధి దీపాల తొలగింపునకు మార్గం సుగమమైంది. ప్రస్తుతం రహదారులపై పసుపు రంగులో వె లిగే వీధి దీపాలు ఉన్నాయి. ఈ వెలుగులో సీసీ కెమెరాల ద్వారా రికార్డయిన వీడియో ఫుటేజ్‌లో ముఖాలు స్పష్టంగా కనిపించడం లేదు. దీంతో వీటి స్థానంలో తెల్లగా వెలుగునిచ్చే ఎల్ఈడీ బల్బులు బిగించాలని బీఎంసీ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. 2008 నవంబర్ 26న ఉగ్రవాదుల దాడుల సంఘటన అనంతరం నగర రహదారులపై, జంక్షన్ల వద్ద ఆరు వేల సీసీ కెమెరాలు ఏర్పాటుచేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కాని ఐదేళ్లు పూర్తికావస్తున్నప్పటికీ ఇంతవరకు అది కార్యరూపం దాల్చలేదు. ఆ తర్వాత ఆర్థిక ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ఆరు వేలకు బదులుగా కేవలం రెండున్నర వేల కె మెరాలు కీలకమైన జంక్షన్లు, రహదారులపై ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ప్రస్తుతం కొన్నిచోట్ల ప్రయోగాత్మకంగా సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేసింది. కాని అందులో రికార్డయిన వీడియో ఫుటేజ్‌లో పసుపు రంగు వెలుగునిచ్చే స్ట్రీట్ లైట్ల కారణంగా ముఖాలు స్పష్టంగా కనిపించడం లేదని తేలింది. రాత్రి వేళల్లో దోపిడీలు, రోడ్డు ప్రమాదాలు, మహిళలతో అసభ్యకరంగా ప్రవర్తించడం లాంటి సంఘటనల్లో నేరస్తులను గుర్తించడంలో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఫలితంగా పోలీసులు కేసు దర్యాప్తు చేయడంలో విఫలమవుతున్నారు. దీంతో ఎల్ఈడీ దీపాలు అమర్చాలని నిర్ణయించారు. అందుకయ్యే వ్యయాన్ని అంచనా వేస్తున్నారు. త్వరలో టెండర్లను ఆహ్వానించి ఈ ప్రక్రియ ప్రారంభించనున్నట్లు శివసేన నాయకురాలు శీతల్ మాత్రే చెప్పారు.