directorate of revenue intelligence
-
ఏపీ ఫైబర్ నెట్ స్కాంలో మరో కీలక పరిణామం.. డీఆర్ఐ కొరడా
సాక్షి, విజయవాడ: ఏపీ ఫైబర్ నెట్ స్కామ్‌లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. టెరాసాఫ్ట్ కేసులో డీఆర్ఐ కొరడా ఝుళిపించింది. ఫైబర్ నెట్ కుంభకోణంలో పన్ను ఎగ్గొట్టిన వారిపై ఏపీ డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటలిజెన్స్ చర్యలు తీసుకుంది. ఫైబర్ నెట్ స్కాంలో పన్ను ఎగ్గొట్టినందుకు ఫాస్ట్‌లేన్ టెక్నాలజీస్‌కు రూ.34 కోట్ల పెనాల్టీ విధించింది. కొన్నవారి నుంచి GSTని సేకరించి ప్రభుత్వానికి అమ్మకం దారు చెల్లించాల్సి ఉంది. GST నిబంధనలను ఫాస్ట్‌లైన్ టెక్నాలజీస్ తుంగలో తొక్కింది. ఆధారాలను పరిశీలిస్తే రూ.10.81 కోట్ల పన్ను ఎగ్గొట్టినట్టు గుర్తించారు. ఈ డబ్బును హవాలా మార్గంలో తరలించినట్టు ఆధారాలు ఉండగా, ఫాస్ట్‌లేన్ టెక్నాలజీస్ వెనక ఉన్నది టెరాసాఫ్ట్ కంపెనీగా గుర్తించారు. ఏపీ ఫైబర్‌నెట్ నిధులను పక్కదారి పట్టించింది కూడా ఈ కంపెనీలే కాగా, విచారణలో ఫాస్ట్‌లేన్ మాజీ ఎండీ విప్లవ్‌కుమార్ పన్ను ఎగ్గొట్టినట్టు ఒప్పుకున్నారు. నిధులన్నీ డొల్ల కంపెనీల ద్వారా రూటు మార్చినట్టు అంగీకరించారు. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా వేమూరి హరిప్రసాద్‌ని(చంద్రబాబు సన్నిహితుడు) గుర్తించారు. టెరాసాఫ్ట్ ఎండీ తుమ్మల గోపిచంద్ విజ్ఞప్తి మేరకే పాస్ట్‌లేన్‌ను ఏర్పాటు చేసినట్టు విప్లవ్ కుమార్ తెలిపారు. ఇప్పటికే ఈ కేసులో నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్‌ను ఇంగ్రామ్ ఆశ్రయించింది. ఫాస్ట్‌లేన్ దివాళా తీసినట్టు నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్‌కు ఇంగ్రామ్ తెలిపింది. సెప్టెంబర్ 2020 నుంచి ఫాస్ట్‌లేన్ కార్యకలపాలు నిలిపివేసింది. ఎలాంటి కార్యకలపాలు చూపించకపోవడంతో ఫాస్ట్‌లేన్ రిజిస్ట్రేషన్‌ను ప్రభుత్వం రద్దు చేసింది. ఈ కేసులో వేమూరి హరికృష్ణ, తుమ్మల గోపిచంద్‌కు ముందస్తు బెయిల్ రాగా, ఇదే కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్‌ను హైకోర్టు తిరిస్కరించింది. సుప్రీంకోర్టులో డిసెంబర్ 12న చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్ విచారణకు రానుంది. ఇదీ చదవండి: స్కిల్ కుంభకోణం కేసులో కీలక పరిణామం -
110 సంస్థలకు అనుమతులు
న్యూఢిల్లీ: ల్యాప్‌టాప్‌లు, కంప్యూటర్లు వంటి ఐటీ హార్డ్‌వేర్ ఉత్పత్తులను దిగుమతి చేసుకునేందుకు 110 సంస్థలకు కేంద్రం అనుమతినిచి్చంది. యాపిల్, డెల్, లెనొవొ, హెచ్‌పీ ఇండియా సేల్స్, అసూస్ ఇండియా, ఐబీఎం ఇండియా, షావోమీ టెక్నాలజీ ఇండియా, శాంసంగ్ ఇండియా ఎల్రక్టానిక్స్ మొదలైనవి వీటిలో ఉన్నట్లు సంబంధిత అధికారి తెలిపారు. అనుమతుల కోసం మొత్తం 111 దరఖాస్తులు వచి్చనట్లు వివరించారు. అయితే, ’నిరాకరణ జాబితా’లో ఉన్న ఒక హైదరాబాద్ సంస్థకు మాత్రం అనుమతి లభించలేదని పేర్కొన్నారు. దేశీయంగా తయారీని ప్రోత్సహించే దిశగా తీసుకుంటున్న చర్యల్లో భాగంగా నిర్దిష్ట ఐటీ హార్డ్‌వేర్ దిగుమతులపై కేంద్రం ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. అయితే, సరఫరా వ్యవస్థ దెబ్బతినకుండా అనుమతులకు లోబడి దిగుమతి చేసుకునే వెసులుబాటు కలి్పంచింది. నవంబర్ 1 నుంచి అమల్లోకి వచ్చిన ఈ ఆథరైజేషన్ విధానం 2024 సెపె్టంబర్ వరకు అమల్లో ఉంటుంది. అక్టోబర్ 31న పరిశ్రమ వర్గాలతో సమావేశమైన డీజీఎఫ్టీ (డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్) అనుమతుల ప్రక్రియ గురించి వివరించారు. ’నిరాకరణ జాబితా’లో ఉన్న సంస్థలకు అనుమతులు లభించవు. ప్రభుత్వ పథకాలను ఉపయోగించుకుంటూ ఎగుమతి నిబంధనలను పాటించని సంస్థలు, డీఆర్ఐ (డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్) కేసులు ఎదుర్కొంటున్న కంపెనీలు ఈ జాబితాలో ఉంటాయి. ఐటీ హార్డ్‌వేర్ సంబంధ దిగుమతులు గత ఆర్థిక సంవత్సరం 8.7 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. 5.33 బిలియన్ డాలర్ల విలువ చేసే ల్యాప్‌టాప్‌లు సహా పర్సనల్ కంప్యూటర్లు దిగుమతయ్యాయి. అత్యధికంగా చైనా (5.11 బిలియన్ డాలర్లు), సింగపూర్ (1.4 బిలియన్ డాలర్లు), హాంకాంగ్ (807 మిలియన్ డాలర్లు) నుంచి ఐటీ హార్డ్‌వేర్ ఉత్పత్తులు దిగుమతవుతున్నాయి. -
DRI SUMMIT: దేశాల మధ్య సమన్వయంతోనే స్మగ్లింగ్ నిరోధం సాధ్యం
న్యూఢిల్లీ: అక్రమ రవాణా, వ్యాపారం వెనుక ఉన్న సూత్రధారులను అణిచివేసేందుకు ప్రపంచ దేశాల ప్రభుత్వాల సమన్వయం అవసరమని ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ పిలుపునిచ్చారు. చట్టవిరుద్ధ వ్యాపారం వెనుక ఉన్న ‘‘మాస్టర్ మైండ్స్’’ ను పట్టుకోవడంపై ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీల దృష్టి సారించాలని ఆమె పేర్కొన్నారు. ఆర్థిక వ్యవస్థతో పాటు పౌరుల ప్రయోజనాలను దెబ్బతీసే చట్టవిరుద్ధ కార్యకలాపాలకు నిరోధానికి విచారణా సంస్థల సమన్వయ చొరవలు అవసరమని ఆమె అన్నారు. అక్రమంగా రవాణా, లేదా చట్టవిరుద్ధ వ్యాపార స్వభావం గత 50 నుంచి 60 సంవత్సరాలుగా మారలేదని ఆమె ఈ సందర్భంగా పేర్కొన్నారు. విలువైన లోహాలు, మాదక ద్రవ్యాలు, అటవీ లేదా సముద్ర జీవుల అక్రమ రవాణా కొనసాగడం విచారకరమని అన్నారు. అక్రమ వ్యాపారం, స్మగ్లింగ్ ముప్పును అరికట్టడంలో సాంకేతికత కీలక పాత్ర పోషిస్తుందని కూడా ఆమె ఈ సందర్బంగా అన్నారు. సమాచారాన్ని ఇచి్చపుచ్చుకోవడంలో సాంకేతికత వినియోగం చాలా ప్రాధాన్యత కలిగిన అంశమని పేర్కొన్నారు. ‘‘ఎన్ఫోర్స్మెంట్ మేటర్స్ 2023’’ అన్న అంశంపై డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) ఇక్కడ నిర్వహించిన ఒక గ్లోబల్ కాన్ఫరెన్స్‌ను ఉద్ధేశించి ఆర్థికమంత్రి చేసిన ప్రారంభోపన్యాసంలో కొన్ని ముఖ్యాంశాలు.. ► చాలా వరకు అక్రమంగా వ్యాపారం చేసే వస్తువులు అలాగే ఉంటాయి. కస్టమ్స్ అధికారులు కంగుతినేంత స్థాయిలో కొత్త వస్తువుల అక్రమ రవాణా ఏదీ లేదు. దశాబ్ద కాలంగా ఇదే ధోరణి కొనసాగుతుందంటే... దీని వెనుక ఉన్న శక్తులు ఎవరో సమాజానికి తెలియాలి. ∙అక్రమ రవాణా సూత్రధారుల అణచివేతకు డబ్ల్యూసీఓ (ప్రపంచ కస్టమ్స్ ఆర్గనైజేషన్)తో పాటు ప్రభుత్వాల మధ్య సహకారానికి చాలా ముఖ్యం. తద్వారా అక్రమ రవాణా వెనుక ఉన్న సూత్రధారులను పట్టుకో గలుగుతాము. ► జప్తు చేసిన వస్తువులన్నింటినీ ధ్వంసం చేసి, మార్కెట్లోకి తీసుకురాకుండా అడ్డుకోగలిగితే, అక్రమ వ్యాపారాన్ని అరికట్టడం తేలికవుతుంది. ► అక్రమ రవాణా కార్యకలాపాలకు పాల్పడినవారికి శిక్ష తప్పదని, ఆయా చర్యల నిరోధం సాధ్యమేనని ప్రజల్లో విశ్వాసాన్ని పునరుద్ధరించడం మన కర్తవ్యం. ► బంగారం, సిగరెట్లు, మాదక ద్రవ్యాలు, పురాతన వస్తువులు, వన్యప్రాణి సంపద అక్రమ రవాణాలపై ప్రత్యేక నిఘా అవసరం. ఎందుకంటే ఇది ఆర్థిక వ్యవస్థలన్నింటినీ దెబ్బతీస్తుంది. ► దొంగిలించిన, అక్రమంగా తరలించిన పురాతన వస్తువులన్నింటినీ వాటికి సంబంధించిన స్వదేశాలకు తిరిగి అప్పగించాల్సిన అవసరం ఉంది. దీనికీ అంతర్జాతీయ సమన్వయం, సహకారం అవసరం. ► ఈ కార్యక్రమంలో డీఆర్ఐ ’ఆపరేషన్ శేష’ నాల్గవ దశను మంత్రి ప్రారంభించారు. ఈ ఆపరేషన్‌కు ప్రపంచ కస్టమ్స్ ఆర్గనైజేషన్ రీజినల్ ఇంటెలిజెన్స్ లైజన్ ఆఫీస్ (ఆర్ఐఎల్ఓ) ఆసియా పసిఫిక్, మిడిల్ ఈస్ట్‌ల సహకారం అందిస్తోంది. కలప అక్రమ వ్యాపారాన్ని అరికట్టేందుకు 2015లో తొలిసారిగా ఈ ఆపరేషన్ ప్రారంభించారు. అక్రమ రవాణా పెరుగుతోంది: సంజయ్ కుమార్ అగర్వాల్ పరోక్ష పన్నులు– కస్టమ్స్ సెంట్రల్ బోర్డ్ (సీబీఐసీ) చీఫ్ సంజయ్ కుమార్ అగర్వాల్ కార్యక్రమంలో మాట్లాడుతూ, ప్రపంచ వాణిజ్యం పరస్పరం అనుసంధానం కావడం, ఆర్థిక వ్యవస్థలు అభివృద్ధి వంటి అంశాల నేపథ్యంలో పురాతన వస్తువులు, సిగరెట్లు, బంగారం, అంతరించిపోతున్న వన్యప్రాణులసహా నిషేధిత వస్తువుల అక్రమ తరలింపు పెరుగుతోందన్నారు. మాదక ద్రవ్యాల అక్రమ వ్యాపారం తీవ్రంగా ఉందని పేర్కొన్నారు. గ్లోబల్ డ్రగ్ ట్రాఫికింగ్ విలువ దాదాపు 650 బిలియన్ డాలర్లని ఆయన పేర్కొన్నారు. మొత్తం అక్రమ ఆర్థిక వ్యాపార కార్యకలాపాల్లో ఈ వాటా దాదాపు 30 శాతమని తెలిపారు. ఇది తీవ్ర ప్రభావాలకు దారితీస్తోందని పేర్కొన్న ఆయన, మనీలాండరింగ్ తీవ్రవాద కార్యకలాపాల ఫైనాన్షింగ్ ఫైనాన్సింగ్‌కు ఇది దారితీస్తోందని, ఆయా అంశాలు జాతీయ భద్రతపై ప్రభావం చూపుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. దీని నిరోధానికి విచారణా సంస్థల మధ్య సన్నిహిత సమన్వయ చర్యలు అవసరమని పేర్కొన్నారు. రెవెన్యూ కార్యదర్శి సంజయ్ మల్హోత్రా మాట్లాడుతూ, స్మగ్లింగ్ ముప్పును ఎదుర్కోవాల్సిన అవసరం చాలా ముఖ్యమైనదని పేర్కొన్నారు. వ్యాపార వ్యయాలను తగ్గించి, పోటీతత్వాన్ని పెంచే సులభతర వాణిజ్య చర్యలను కూడా ఈ దిశలో చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు. -
రూ.160 కోట్ల డ్రగ్స్ పట్టివేత
ముంబై: మహారాష్ట్రలోని ఛత్రపతి సంభాజీనగర్‌లోని ఓ ఫ్యాక్టరీలో డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు భారీగా డ్రగ్స్ పట్టుకున్నారు. ఆదివారం అపెక్స్ మెడికెమ్ ప్రైవేట్ లిమిటెడ్‌కు చెందిన రెండు ప్రాంతాల్లో దాడులు జరిపి రూ.160 కోట్ల విలువైన 107 లీటర్ల మెఫెడ్రిన్ను గుర్తించారు. ఈనెల 20న ఇదే జిల్లాలో జరిపిన దాడుల్లో రూ.250 కోట్ల విలువైన కెటమిన్, కొకైన్, మెఫెడ్రిన్లను స్వా«దీనం చేసుకున్నారు. -
రూ.31.67 కోట్ల అంబర్గ్రిస్ స్వాధీనం
న్యూఢిల్లీ: డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్(డీఆర్ఐ) అధికారులు తమిళనాడులోని ట్యుటికోరన్‌లో అత్యంత ఖరీదైన అంబర్గ్రిస్(తిమింగలం వాంతి)ని పట్టుకున్నారు. ట్యుటికోరన్‌లోని హార్బర్ బీచ్ ఏరియా నుంచి శ్రీలంకకు ఓ ముఠా అంబర్‌గ్రీస్‌ను తరలించేందుకు ప్రయత్నిస్తున్నట్లు అందిన సమాచారం మేరకు అధికారులు సోదాలు చేపట్టారు. ఈ తనిఖీల్లో ఓ వాహనంలో తరలిస్తున్న 18.1కిలోల బరువైన అంబర్ గ్రిస్ సంచీ దొరికింది. ఇందుకు సంబంధించి తమిళనాడు, కేరళలకు చెందిన నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. స్వాధీనమైన అంబర్గ్రిస్ విలువ రూ.31.67 కోట్లని అంచనా. సుగంధ ద్రవ్యాల తయారీలో వాడే అంబర్గ్రిస్కు అంతర్జాతీయ మార్కెట్లో ఎక్కువ గిరాకీ ఉంది. వన్యప్రాణి సంరక్షణ చట్టం ప్రకారం స్పెర్మ్ వేల్ ఉత్పత్తుల ఎగుమతి, రవాణాలపై నిషేధం ఉంది. గత రెండేళ్లలో ట్యుటికోరన్ తీరంలో స్మగ్లర్ల నుంచి రూ.54 కోట్ల విలువైన 40.52 కిలోల అంబర్‌గ్రిస్‌ను పట్టుకున్నట్లు డీఆర్ఐ తెలిపింది. -
‘కేంద్ర డీఆర్ఐ నివేదిక 2021–22’ వెల్లడి.. డ్రగ్స్ కట్టడిలో ఏపీ భేష్
సాక్షి, అమరావతి: మాదక ద్రవ్యాల (డ్రగ్స్)పై ఉక్కుపాదం మోపడంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దేశంలోనే మొదటి స్థానంలో నిలిచింది. నాలుగు రాష్ట్రాలతో కూడిన దండకారణ్యం ప్రాంతం నుంచి గంజాయి, ఇతర మాదక ద్రవ్యాల అక్రమ రవాణాను కట్టడి చేయడంలో సమర్థవంతమైన పాత్ర పోషించింది. పకడ్బందీ ప్రణాళికతో విస్తృతంగా దాడులు నిర్వహించి గంజాయి సాగును, రవాణాను అడ్డుకోవడంతోపాటు ఎక్కువగా కేసులు నమోదు చేసిన రాష్ట్రంగా గుర్తింపు పొందింది. కేంద్ర డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటలిజెన్స్ (డీఆర్ఐ) విడుదల చేసిన ‘భారతదేశంలో స్మగ్లింగ్ నివేదిక 2021–22’ ఈ విషయాన్ని వెల్లడించింది. 2021–22లో దేశవ్యాప్తంగా 28,334.32 కేజీల డ్రగ్స్‌ను జప్తు చేసినట్టు నివేదిక పేర్కొంది. దేశంలో 12 రాష్ట్రాల్లో గంజాయి సాగు, అక్రమ రవాణా సాగుతోంది. ఏపీలో గంజాయి సాగు, అక్రమ రవాణాను అరికట్టడంలో రాష్ట్ర ప్రభుత్వం అత్యంత సమర్ధవంతంగా వ్యవహరించిందని ఈ నివేదిక పేర్కొంది. ఏపీ ప్రభుత్వం ఏకంగా 90 మంది స్మగ్లర్లను అరెస్టు చేసింది. ఈ విషయంలో మిగతా రాష్ట్రాలు చాలా ఉదాసీనంగా ఉన్నాయని ఈ నివేదిక ద్వారా వెల్లడైంది. ఏపీలో గత ప్రభుత్వాలు గంజాయి, ఇతర డ్రగ్స్ దందాను పట్టించుకోలేదు. అయితే, వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గంజాయి, ఇతర మాదక ద్రవ్యాల దందాపై ఉక్కుపాదం మోపారు. ఇందుకు ప్రత్యేకంగా స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో (ఎస్ఈబీ)ని ఏర్పాటు చేసి, అత్యంత సమర్థులైన అధికారులు, సిబ్బందిని ఇందులో నియమించారు. దీంతోపాటు 2021లో ఆపరేషన్ పరివర్తన్ పేరిట ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా ప్రత్యేక బృందాలు, డ్రోన్ కెమెరాలతో సర్వే చేసి కేవలం రెండు నెలల్లో 11,550 ఎకరాల్లో గంజాయి సాగును ప్రభుత్వం కూకటివేళ్లతో పెకలించివేసింది. 2.49 లక్షల కిలోల గంజాయిని జప్తు చేసింది. ఏపీ ప్రభుత్వ చర్యలను కేంద్ర నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ)తో సహా యావత్ దేశం అభినందించింది. ఇప్పుడు డీఆర్ఐ నివేదిక కూడా రాష్ట్ర ప్రభుత్వ చర్యలను ప్రశంసించింది. విజయవాడలోని బోగస్ చిరునామాతో కస్టమ్స్ అధికారుల కళ్లుగప్పి పంజాబ్‌కు తరలించేందుకు అఫ్ఘానిస్థాన్ నుంచి గుజరాత్‌లోని కాండ్లా పోర్టుకు అక్రమంగా తరలించిన 2,988.21 కిలోల డ్రగ్స్ ఉదంతాన్ని కూడా ఈ నివేదికలో ప్రస్తావించారు. ఆ డ్రగ్స్ వ్యవహారంతో విజయవాడకు ఏమాత్రం సంబంధంలేదని, కేవలం కస్టమ్స్ అధికారులను బురిడీ కొట్టించేందుకే స్మగ్లర్లు వేసిన ఎత్తుగడలో భాగంగా ఇక్కడి చిరునామా ఇచ్చారని డీఆర్ఐ దర్యాప్తులో వెల్లడైంది కూడా. చదవండి: ('నా రాజకీయ జీవితంలో సీఎం జగన్‌లా ఆలోచించిన నాయకుడిని చూడలేదు') పచ్చ మీడియా దుష్ప్రచారం ప్రభుత్వం డ్రగ్స్ కట్టడిలో సమర్ధంగా పని చేస్తున్నా.. వక్ర భాష్యాల పచ్చ మీడియా ప్రజల్ని తప్పుదారి పట్టిస్తోంది. డీఆర్ఐ నివేదిక ప్రశంసిస్తే.. దానిని కూడా రాష్ట్రంలో టీడీపీకి వత్తాసు పలికే పచ్చ మీడియా వక్రీకరిస్తోంది. ఎక్కువ కేసులు నమోదు చేయడం, ఎక్కువ మందిని అరెస్టు చేయడం అంటే స్మగ్లింగ్ ఎక్కువగా జరుగుతోందంటూ ఆ మీడియా కథనాలు ఇవ్వడం విడ్డూరంగా ఉందని పరిశీలకులు విమర్శిస్తున్నారు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో గంజాయి అక్రమ రవాణాను ఏమాత్రం పట్టించుకోలేదు కాబట్టే ఎక్కువ గంజాయిని జప్తు చేయలేదని, ఎక్కువ మంది స్మగ్లర్లను అరెస్టు చేయలేదన్నది సుస్పష్టం. అందుకు భిన్నంగా ప్రస్తుత వైఎస్సార్సీపీ ప్రభుత్వం సమర్థంగా గంజాయి , ఇతర డ్రగ్స్ దందాకు అడ్డుకట్ట వేస్తోందన్న విషయం కేంద్ర ప్రభుత్వ నివేదికే వెల్లడించిందని నిపుణులు చెబుతున్నారు. చదవండి: (రాజ్యసభ వైస్ చైర్మన్‌గా విజయసాయిరెడ్డి) -
రూ.1,476 కోట్ల విలువైన డ్రగ్స్ స్వాధీనం
న్యూఢిల్లీ: విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న నారింజ పండ్ల ముసుగులో అక్రమంగా తరలిస్తున్న మాదక ద్రవ్యాలను డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్(డీఆర్ఐ) అధికారులు శనివారం ముంబైలో స్వాధీనం చేసుకున్నారు. 198 కిలోల స్పటిక మెథాంఫెటామైన్, 9 కిలోల కొకైన్‌ను స్వాధీనం చేసుకున్నామని, ఈ డ్రగ్స్ విలువ రూ.1,476 కోట్లు ఉంటుందని తెలిపారు. ముంబైలోని వసీ ప్రాంతంలో అనుమానంతో వాహనాన్ని తనిఖీ చేయగా, అందులో నారింజ పండ్ల బాక్సుల్లో భద్రపర్చిన మాదక ద్రవ్యాలు లభ్యమయ్యాయని ప్రకటించారు. అక్రమార్కులు దక్షిణాఫ్రికా నుంచి నారింజ పండ్లను దిగుమతి చేసుకున్నట్లు కస్టమ్స్ అనుమతులు పొందారని అధికారులు గుర్తించారు. డ్రగ్స్‌ను ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? ఎక్కడికి తరలిస్తున్నారు? అనే దానిపై డీఆర్ఐ అధికారులు దర్యాప్తు వేగవంతం చేశారు. -
రూ.125 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత.. బుకింగ్స్ ఫ్రమ్ టాంజానియా!
సాక్షి, హైదరాబాద్: శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇటీవల వరుసగా పట్టుబడిన రూ.125 కోట్ల విలువైన మాదకద్రవ్యాల కేసుల దర్యాప్తును డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) అధికారులు ముమ్మరం చేశారు. డ్రగ్స్ తీసుకువస్తూ పట్టుబడిన వారంతా క్యారియర్స్‌గా గుర్తించిన అధికారులు విదేశంలోని సప్లయర్లతో పాటు ఇక్కడి రిసీవర్లను పట్టుకోవడానికి ప్రయత్నాలు ముమ్మరం చేశారు. పక్కా పథకం ప్రకారం ఈ స్మగ్లింగ్ చేయిస్తున్న సప్లయర్లు, మాదకద్రవ్యాలను తీసుకునే రిసీవర్లు ఎక్కడా తమ ఉనికి బయటపడకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు గుర్తించారు. విమానాశ్రయంలో గడిచిన పక్షం రోజుల్లో నాలుగు కేసుల్లో చిక్కిన వారిలో టాంజానియన్లే ఎక్కువ మంది ఉన్నారు. ప్రాథమిక పరిశీలన నేపథ్యంలో ఈ డ్రగ్ హైదరాబాద్‌లో తీసుకునే రిసీవర్లు ఎవరనేది నిందితులకు కూడా తెలియదని అధికారులు చెప్తున్నారు. డ్రగ్‌తో ప్రయాణిస్తున్న క్యారియర్ల కోసం నగరంలో హోటల్ గదులనూ సప్లయర్లే బుక్ చేశారు. ముంబై కేంద్రంగా పని చేస్తున్న సద్గురు ట్రావెల్స్ సంస్థకు టాంజానియాలోనూ బ్రాంచ్ ఉంది. ఆ శాఖ నుంచే క్యారియర్ల కోసం సప్లయర్లు గచ్చిబౌలి, మాదాపూర్, మాసబ్‌ట్యాంక్‌ల్లోని హోటళ్లలో రూమ్స్ బుక్ చేశారు. క్యారియర్లతో పాటు ఈ బుకింగ్ రసీదులనూ సప్లయర్లు పంపారు. వీటిని స్వాధీనం చేసుకున్న డీఆర్ఐ అధికారులు సదరు ట్రావెల్స్ సంస్థను సంప్రదించారు. టాంజానియాలోని తమ బ్రాంచ్‌కు వెళ్లిన కొందరు ఈ గదులను క్యారియర్స్‌గా వస్తున్న వారి కోసం బుక్ చేశారని, ఆ సందర్భంలో సగం నగదు చెల్లించాలని కోరినా... చెక్ ఇన్ సమయంలో ఇస్తామంటూ దాట వేశారని సమాధానం ఇచ్చారు. ఈ నేపథ్యంలో తాము ఆ గదులను బుక్ చేయకుండా కేవలం బ్లాక్ చేసి ఉంచామని వివరించారు. సద్గురు ట్రావెల్స్‌కు సంబంధించిన టాంజానియా బ్రాంచ్‌కు వెళ్లిన వారి వివరాలు తెలపాల్సిందిగా డీఆర్ఐ ఆ సంస్థను కోరింది. క్యారియర్లు డ్రగ్స్‌తో వచ్చిన విమానంలోనే సప్లయర్లు, రిసీవర్లకు చెందిన వ్యక్తి కూడా ప్రయాణించి, పరిస్థితులను గమనించి ఉంటాడని అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయా విమానాల్లో ప్రయాణించిన వారి జాబితాలను విశ్లేషిస్తున్నారు. క్యారియర్లు డ్రగ్స్‌తో విమానాశ్రయం దాటి వచ్చిన తర్వాత బస చేయాల్సిన హోటల్‌కు చేరుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఒకటి, రెండు రోజులకు రిసీవర్ నేరుగా వెళ్లి సరుకు తీసుకునేలా సప్లయర్లు పథకం వేశారు. క్యారియర్లు చిక్కినా తాము పట్టుబడకూదనే డ్రగ్ స్మగ్లర్లు ఈ జాగ్రత్తలు తీసుకుంటున్నారని డీఆర్ఐ అధికారులు చెప్తున్నారు. ఈ కేసుల్లో ఇతర నిందితులను గుర్తించడానికి దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: మ్యాట్రిమోనితో వల.. మూడు పెళ్లిళ్లు చేసుకుని.. మరో పెళ్లికి -
కడుపులో 11.57కోట్ల కొకైన్..
సాక్షి, హైదరాబాద్: కిలోకు పైగా కొకైన్ డ్రగ్స్‌ను ట్యాబ్లెట్ల రూపంలో పొట్టలో పెట్టుకొని స్మగ్లింగ్ చేస్తున్న టాంజానియా వ్యక్తి (44)ని డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) అధికారులు హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రయంలో పట్టుకున్నారు. పొట్టలోంచి 79 ట్యాబ్లెట్లను బయటకు తీశారు. జోహెన్నెస్‌బర్గ్ నుంచి ఈ నెల 21న ఎమిరేట్స్ విమానంలో ఆ వ్యక్తి హైదరాబాద్ చేరుకోగా ఇంటెలిజెన్స్ సమాచారంతో అతడిని అదుపులోకి తీసుకున్నారు. తాను టాంజానియా నుంచి జోహెన్నెస్‌బర్గ్ వచ్చానని.. జోహెన్స్‌బర్గ్ నుంచి ఇండియాకు వచ్చే ముందు ప్రొటేరియా వెళ్లి అక్కడ కొకైన్ ట్యాబ్లెట్లు మింగానని అధికారుల విచారణలో వెల్లడించాడు. 3 నుంచి 4 రోజులు కడుపులోనే దాచుకొని మరో వ్యక్తికి డెలివరీ చేయాల్సిందిగా ఆదేశాలున్నాయన్నాడు. ఆ వ్యక్తి నుంచి 22 కొకైన్ ట్యాబ్లెట్స్ను అధికారులు బయటకు తీశారు. మిగిలిన ట్యాబ్లెట్లను తీయడం కష్టమవడంతో ఆస్పత్రికి తరలించి ఆపరేషన్ ద్వారా మంగళవారం మరో 57 ట్యాబ్లెట్లను తీశామని డీఆర్ఐ వెల్లడించింది. ఇవి 1,157 గ్రాముల బరువున్నాయని, అంతర్జాతీయ మార్కెట్లో వీటి విలువ సుమారు రూ.11.57 కోట్ల వరకు ఉంటుందని చెప్పింది. ఆ వ్యక్తిపై ఎన్డీపీఎస్ యాక్ట్ 1985 కింద కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించామని, డ్రగ్స్‌ను ఎక్కడికి తరలిస్తున్నాడో విచారణ చేయాల్సి ఉందని చెప్పింది. -
రూ.1,700 కోట్ల హెరాయిన్ పట్టివేత
అహ్మదాబాద్: గుజరాత్లో వేర్వేరు ఘటనల్లో భారీ మొత్తంలో డ్రగ్స్ పట్టుబడ్డాయి. కాండ్లా పోర్టులోని ఓ కంటైనర్ నుంచి రూ.1,439 కోట్ల విలువైన 200 కిలోల హెరాయిన్‌ను స్వాధీనం చేసుకున్నట్లు డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజన్స్ (డీఆర్ఐ) అధికారులు సోమవారం వెల్లడించారు. గత సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో ఇరాన్ నుంచి జిప్సమ్ పేరుతో వచ్చిన 17 కంటెయినర్లు ఉత్తరాఖండ్‌లోని ఓ సంస్థకు అందాల్సి ఉందని తెలిపారు. వాటిని తనిఖీ చేయగా 205.6 కిలోల బరువున్న రూ.1,439 కోట్ల విలువైన హెరాయిన్ బయటపడిందని చెప్పారు. ఉత్తరాఖండ్‌కు చెందిన సంస్థ యజమానిని ఎట్టకేలకు అనేక ప్రాంతాల్లో సోదాల అనంతరం పంజాబ్‌లోని ఓ కుగ్రామంలో పట్టుకున్నట్లు చెప్పారు. కాగా, గత ఏడాది సెప్టెంబర్‌లో గుజరాత్‌లోని ముంద్రా పోర్టులో రూ.21వేల కోట్ల విలువైన సుమారు 3 టన్నుల హెరాయిన్ పట్టుబడిన విషయం తెలిసిందే. పాక్ బోటులో రూ.280 కోట్ల హెరాయిన్ పాకిస్తాన్‌కు చెందిన పడవలో అక్రమంగా తరలిస్తున్న రూ.280 కోట్ల విలువైన హెరాయిన్ కచ్ తీరంలో పట్టుబడింది. సోమవారం ఉదయం భారత ప్రాదేశిక జలాల్లోకి అక్రమంగా ప్రవేశించిన అల్ హజ్ అనే పడవను తీరరక్షక దళం, గుజరాత్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ గుర్తించింది. లొంగిపోవాలంటూ చేసిన హెచ్చరికలతో పారిపోయేందుకు ప్రయత్నించగా ఆ పడవలోని వారిపై కాల్పులు జరిపింది. దీంతో అందులోని కనీసం ఇద్దరు గాయపడ్డారని అధికారులు తెలిపారు. అనంతరం, పడవతోపాటు అందులో ఉన్న 56 కిలోల బరువున్న రూ.280 కోట్ల హెరాయిన్‌ను స్వాధీనం చేసుకుని, 9 మందిని అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు. ఓ ఉత్తరాది రాష్ట్రానికి ఈ నిషేధిత డ్రగ్ చేరాల్సి ఉందని, కరాచీకి చెందిన ముస్తాఫా అనే స్మగ్లరే ఈ రాకెట్ వెనుక ఉండి ఉంటాడని అనుమానిస్తున్నట్లు ఉన్నతాధికారులు తెలిపారు. -
రూ.21.9 కోట్ల విలువైన హెరాయిన్ స్వాధీనం
సాక్షి, హైదరాబాద్/శంషాబాద్: డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) అధికారులు భారీ ఇంటర్నేషనల్ డ్రగ్ రాకెట్ గుట్టురట్టు చేశారు. కెన్యా రాజధాని నైరోబీ నుంచి హెరాయిన్‌తో వచ్చిన మలావీ దేశ జాతీయురాలిని సోమవారం తెల్లవారుజామున శంషాబాద్ విమానాశ్రయంలో పట్టుకున్నారు. ఆమె నుంచి రూ. 21.9 కోట్ల విలువైన 3.129 కేజీల హెరాయిన్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఆమె క్యారియర్ అని, ఈ డ్రగ్‌ను తీసుకొనే రిసీవర్లు ఎవరనేది గుర్తించే కోణంలో దర్యాప్తు చేస్తు న్నామని డీఆర్ఐ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. పక్కా రెక్కీ అనంతరం... మలావీకి చెందిన మహిళను బిజినెస్ వీసాపై కొన్ని రోజుల క్రితం నైరోబీకి పిలిపించిన అంతర్జాతీయ డ్రగ్ మాఫియా... రెక్కీ కోసం అక్కడ నుంచి రెండుసార్లు ఆమెను హైదరాబాద్‌కు పంపి ఒకట్రెండు రోజుల తర్వాత తిరిగి వెనక్కు రప్పించింది. అన్నీ పక్కాగా ఉన్నాయని నిర్ధారించుకున్న మాఫియా సూత్రధారులు శుక్రవారం 3.129 కేజీల హెరాయిన్‌ను ఆమెకు అప్పగించారు. దీన్ని రెండు పాలిథిన్ బ్యాగుల్లో ఉంచి ట్రాలీ బ్యాగ్ కింది వైపు ఏర్పాటు చేసిన రహస్య అరలో ఉంచారు. స్కానింగ్‌లోనూ హెరాయిన్ ఉనికి బయటపడకుండా నల్లరంగు పాలిథిన్ సంచులను వాడారు. ఈ బ్యాగ్‌తో నైరోబీ నుంచి బయలుదేరిన మలావీ జాతీయురాలు తొలుత దోహాకు.. అక్కడి నుంచి సోమవారం శంషాబాద్‌కు చేరుకుంది. అయితే ఆమె బిజినెస్ వీసాపై నైరోబీ నుంచి రావడం, గతంలోనూ రెండుసార్లు వచ్చివెళ్లడంతో డీఆర్ఐ అధికారులకు అనుమానం వచ్చింది. దీంతో ఆమెను అదుపులోకి తీసుకొని లగేజీని తనిఖీ చేయగా హెరాయిన్ లభ్యమైంది. ఆ మహిళను అరెస్టు చేసిన అధికారులు కోర్టులో హాజరుపరిచి జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించారు. -
హైదరాబాద్: క్యాటరింగ్ ఉద్యోగి @ 2 కిలోల బంగారం
సాక్షి, హైదరాబాద్: డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) అధికారులు రెండ్రోజులుగా హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో తనిఖీలు చేసి రూ.1.09 కోట్ల విలువైన 2 కిలోల బంగారం స్వాధీనం చేసుకున్నారు. ఓ ప్రైవేట్ ఎయిర్‌లైన్స్ సంస్థలోని క్యాటరింగ్ సర్వీస్ ఉద్యోగి నుంచి ఈ బంగారం స్వాధీనం చేసుకున్నట్లు డీఆర్ఐ హైదరాబాద్ జోనల్ అధికారులు సోమవారం ఒక ప్రకటనలో వెల్లడించారు. మిడిల్ ఈస్ట్ దేశాల నుంచి స్మగ్లింగ్ అవుతున్న ఈ బంగారాన్ని ఆహార పదార్థాల లోడింగ్, అన్లోడింగ్ పద్ధతిలో హైదరాబాద్‌కు స్మగ్లింగ్ చేస్తున్నట్లు డీఆర్ఐ కనిపెట్టింది. ఇలా పార్శిల్లో వచ్చిన బంగారాన్ని క్యాటరింగ్ ఉద్యోగి బయటకు తీసుకొచ్చి స్మగ్లింగ్ గ్యాంగ్‌కు చేరవేస్తున్నట్లు గుర్తించింది. ఇతన్ని అరెస్టు చేసిన డీఆర్ఐ కోర్టులో ప్రవేశపెట్టగా.. కోర్టు రిమాండ్ విధించింది. అసలు ఈ మాఫియాలో హైదరాబాద్‌లో పనిచేస్తున్న వారు ఎవరు? ఏయే దేశాల నుంచి ఎంత బంగారం ఇప్పటివరకు వచ్చిందన్న పూర్తి అంశాలపై విచారణ జరుగుతోందని డీఆర్ఐ అధికారులు తెలిపారు. చదవండి: పరిచయం ప్రేమగా మారింది, పెళ్లి చేసుకుంటానన్నాడు.. కానీ -
కృనాల్ పాండ్యా నిర్బంధం
ముంబై: క్రికెటర్ కృనాల్ పాండ్యాను ముంబై అంతర్జాతీయ విమానాశ్రయంలో డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) అధికారులు నిర్బంధించారు. ముంబై ఇండియన్స్ ఆల్‌రౌండర్ పాండ్యా సరైన ధ్రువ పత్రాలు లేని బంగారం, ఇతర విలువైన వస్తువులు కలి గి వుండటంతో అతన్ని విమానాశ్రయంలోనే ఆపివేశారు. ఐపీఎల్–13 చాంపియన్ ముంబై జట్టు సభ్యుడైన అతను గురువారం యూఏఈ నుంచి వచ్చాడు. పరిమితికి మించి బంగారం ఉండటంతో పాటు ఇన్వాయిస్ లేని వస్తువులు కొనుగోలు చేయడంతో నిర్బంధించినట్లు డీఆర్ఐ వర్గాలు తెలిపాయి. -
పన్ను ఎగవేతదారుల పప్పులుడకవు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఇకపై పన్ను ఎగవేతదారుల ఆటలు సాగవు. వీరికి కళ్లెం వేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (ఏపీఎస్డీఆర్ఐ) విభాగాన్ని ప్రత్యేకంగా ఏర్పాటుచేస్తోంది. ఇందుకు రాష్ట్ర మంత్రివర్గం ఇప్పటికే ఆమోదం తెలుపగా ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు నేడో రేపో జారీకానున్నాయి. ఏపీఎస్డీఆర్ఐ ప్రధానంగా జీఎస్టీతో పాటు ఎక్సైజ్, స్టాంప్స్ అండ్ రిజస్ట్రేషన్స్, రవాణా, గనుల ఆదాయంలో లీకేజీ నివారణే లక్ష్యంగా పనిచేయనుంది. వివిధ రంగాల్లో పన్ను ఎగవేతదారులను గుర్తించడంతో పాటు ఎగవేసిన పన్నును రాబట్టేందుకు అవసరమైన చర్యలను తీసుకుంటుంది. అంతేకాక.. పన్ను ఎగవేతకు లేదా తక్కువ పన్ను చెల్లించేందుకు సహకరించే అధికారులు, ఉద్యోగులను గుర్తించి వారిపై కఠిన చర్యలకు సిఫార్సు చేస్తుంది. జీరో వ్యాపారం చూపెట్టి పన్ను ఎగవేయడం, పన్ను మదింపు తక్కువగా చేయడం, వ్యాపారం చేయకపోయినప్పటికీ ఇన్పుట్ టాక్స్ క్రెడిట్ క్లెయిమ్స్ చేయడం వంటి వాటిపై నిరంతరం నిఘా పెట్టనుంది. ఏపీఎస్డీఆర్ఐ విధులు ఇలా.. ► అన్ని రకాల పన్ను ఎగవేతలను ఇంటెలిజెన్స్ మార్గంలో సమాచారాన్ని సేకరిస్తుంది. ► వాణిజ్య పన్నులు, సీఎస్టీ, ఎక్సైజ్, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్, రవాణా, మినరల్స్ రాయల్టీ, పన్నేతర రెవెన్యూలపై సంబంధిత శాఖల రికార్డులు, ఫిర్యాదులు, ఇతర మార్గాలతో పాటు క్రమబద్ధమైన సర్వే ద్వారా పన్ను వసూళ్ల సమాచారాన్ని రాబడుతుంది. ► రాష్ట్రంలో పన్ను వసూళ్ల తీరు తెన్నులు, లీకేజీపై నిరంతరం నిఘా ఉంచడంతో పాటు ఆ సమాచారాన్ని ఆయా శాఖలకు ఎప్పటికప్పుడు పంపిస్తుంది. ► పన్ను ఎగవేతదారులను గుర్తించి వారికి షోకాజ్ నోటీసులు జారీచేసి దర్యాప్తు చేస్తుంది. అంతేకాక.. ఆ సమాచారాన్ని సంబంధిత శాఖలకు పంపిస్తుంది. ► చట్ట ప్రకారం వారిపై చర్యలు తీసుకోవడంతో పాటు ఎగవేసిన పన్నును పూర్తిగా రాబడతారు. ఇలాంటి కేసులను నిరంతరం పర్యవేక్షిస్తుంది. ► కేంద్ర డైరెక్టర్ రెవెన్యూ ఇంటెలిజెన్స్, డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ జీఎస్టీ ఇంటెలిజెన్స్, సెబీ, పోలీసు, సీబీఐ, ఆదాయపు పన్ను విభాగాలతో ఎప్పటికప్పుడు పన్నులకు సంబంధించిన సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకోవడం చేస్తుంది. ► రాష్ట్ర సరిహద్దుల్లో అక్రమ వ్యాపారాలను అరికట్టేందుకు ఆయా రాష్ట్రాల రెవెన్యూ ఇంటెలిజెన్స్ ఏజెన్సీలతో కలిసి పనిచేస్తుంది. ► పన్ను ఎగవేతల్లో ప్రభుత్వోద్యోగులు, అధికారులు భాగస్వామ్యం ఉన్నట్లు ప్రాథమిక సమాచారం లభిస్తే తదుపరి దర్యాప్తునకు సిఫార్సు చేస్తుంది. పన్నుల ఎగవేతను అరికట్టేందుకు తీసుకోవాల్సిన చర్యలు, వ్యవస్థలో మార్పులతో పాటు ఐటీ వ్యవస్థను మెరుగుపర్చడంపై తగిన సూచనలు చేస్తుంది. ► వివిధ రకాల పన్ను రాయితీలు, మినహాయింపుల్లో అక్రమాలకు, దుర్వినియోగానికి పాల్పడినట్లు సమాచారం ఉంటే ఆ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేయడంతో పాటు తీసుకోవాల్సిన చర్యలపై సిఫార్సులు చేస్తుంది. ► పన్ను ఎగవేత, లీకేజీలపై కంప్ట్రోలర్ ఆడిటర్ జనరల్, అకౌంటెంట్ జనరల్ నివేదికల్లోని అంశాలపై దృష్టిసారించడంతో పాటు రెవెన్యూ లీకేజీ నివారణకు అవసరమైన చర్యలను సూచిస్తుంది. -
హైదరాబాద్‌లో భారీగా బంగారం పట్టివేత
సాక్షి, హైదరాబాద్ : సికింద్రాబాద్‌లో భారీగా బంగారం పట్టుబడింది. ఈస్ట్‌మారేడుపల్లిలోని షైన్ హాస్పిటల్‌పై దాడులు చేసిన డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ అధికారులు.. నలభై బంగారు బిస్కెట్లను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ దాదాపు రూ. రెండు కోట్లకు పైగా ఉంటుందని అధికారులు తెలిపారు. ఈ బంగారాన్ని ఇద్దరు వ్యక్తులు కారులో క్యాలికట్ నుంచి మైసూర్ మీదుగా హైదరాబాద్‌కు తరలించినట్లు అధికారులు గుర్తించారు. మొత్తం ముగ్గురు వ్యక్తులను అదుపులోకి విచారిస్తున్నారు. నిందితుల నుంచి రూ.2కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నామని అధికారులు తెలిపారు. -
డీఆర్ఐ వద్దన్నా.. 80:20 తెచ్చారు
న్యూఢిల్లీ: పి.చిదంబరం ఆర్థిక మంత్రిగా ఉండగా 2013లో ప్రవేశపెట్టిన 80:20 బంగారం దిగుమతుల పథకాన్ని డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్(డీఆర్ఐ) వ్యతిరేకించినట్లు తెలిసింది. ప్రజా పద్దుల సంఘం(పీఏసీ) ఉప కమిటీతో ఆర్థిక శాఖ అధికారులు ఈ వివరాలు పంచుకున్నట్లు వెల్లడైంది. ఆ పథకం ప్రారంభించడంలో అవలంబించిన పద్ధతులు, విధానాలపై సీబీఐ విచారణకు సిఫార్సు చేయాలని బీజేపీ ఎంపీ నిశికాంత్ దూబే నేతృత్వంలోని ఉప కమిటీ నిర్ణయించింది. రెవెన్యూ కార్యదర్శితో పాటు ఈడీ, సీబీడీటీ, సీబీఈసీ ఉన్నతాధికారులు ఉప కమిటీ ముందు హాజరై ఈ పథకం గురించి వివరణ ఇచ్చారు. 80:20 పథకంతో నల్లధనం తెల్లధనంగా మారడంతో పాటు, మనీ లాండరింగ్ పెరుగుతుందని అప్పట్లోనే డీఆర్ఐ ఆందోళన వ్యక్తం చేసినట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. పూర్వ ఏడాది దిగుమతుల నుంచి 20 శాతం బంగారాన్ని ఎగుమతి చేసిన తరువాతే మళ్లీ బంగారాన్ని దిగుమతి చేసుకోవాలనే నిబంధనతో తెచ్చిన ఈ పథకాన్ని ఎన్డీయే అధికారంలోకి వచ్చిన తరువాత 2014 నవంబర్‌లో రద్దు చేసింది. కార్తీకి నార్కో పరీక్షలు?: ఐఎన్ఎక్స్ మీడియా అవినీతి కేసులో అరెస్టయిన కార్తీ చిదంబరానికి నార్కో పరీక్ష చేయడానికి అనుమతి కోరుతూ సీబీఐ ఈ కేసును విచారిస్తున్న ప్రత్యేక కోర్టును ఆశ్రయించింది. మార్చి 9న ఈ విజ్ఞప్తిని పరిశీలిస్తామని స్పెషల్ జడ్జీ సునీల్ రానా చెప్పారు. మూడు రోజుల సీబీఐ కస్టడీ ముగించుకుని కార్తీ మళ్లీ అదే రోజు కోర్టుకు హాజరుకానున్నారు. మనీ లాండరింగ్ కేసులో అరెస్టయిన కార్తీ చార్టర్డ్ అకౌంటెంట్ భాస్కరరామన్, సహ నిందితురాలు ఇంద్రాణి ముఖర్జీలపై జారీ అయిన వారెంట్లు కోరుతూ సీబీఐ దాఖలు చేసిన పిటిషన్లనూ కోర్టు విచారణకు చేపడుతుందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. కార్తీ విచారణకు సహకరించడం లేదన్న నేపథ్యంలో నార్కో పరీక్షల కోసం పిటిషన్ వేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. -
అవాక్కు.. ఫ్లైట్ ఉద్యోగిని బ్యాగులో రూ.3.21కోట్లు
సాక్షి, న్యూఢిల్లీ : జెట్ ఎయిర్వేస్ మహిళా ఉద్యోగినిని ఢిల్లీ అధికారులు అరెస్టు చేశారు. అక్రమంగా రూ.మూడు కోట్ల విలువైన అమెరికా డాలర్లను పట్టుకెళుతున్న ఆమెను ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. వివరాల్లోకి వెళితే.. హాంకాంగ్‌కు చెందిన జెట్ ఎయిర్వేస్ విమానం సోమవారం రాత్రి ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగింది. డీఆర్ఐ అధికారులు ఆ సమయంలో తనిఖీ చేయగా జెట్ ఎయిర్వేస్ సిబ్బందిలోని ఒకరి వద్ద ఉన్న సూట్ కేసులో రూ.3.21కోట్ల విలువైన అమెరికన్ డాలర్లు లభించాయి. దీంతో ఆమెను అరెస్టు చేసి కస్టడీలోకి తీసుకున్నారు. ఈ కేసుపై లా ఎన్ఫోర్స్మెంట్ అధికారులు చర్యలు తీసుకోనున్నారు. -
తమిళనాడులో భారీగా బంగారం పట్టివేత !
-
87 బంగారు కడ్డీలు స్వాధీనం
చెన్నై: తమిళనాడులో అక్రమంగా తరలిస్తున్న బంగారం పట్టుబడింది. రామనాథపురం జిల్లా ఉచ్చిపుళ్లి రైల్వే గేట్ సమీపంలో రెవెన్యూ ఇంటలిజెన్స్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. శ్రీలంక నుంచి తరలిస్తున్న 8.7 కిలోల బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఆ కారులో అధికారులు తనిఖీలు జరపగా డ్రైవర్ సీటు కింద ఉన్న బ్యాగులో 87 బంగారు బిస్కెట్లు కనిపించాయి. ఇవన్నీ 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారంగా ఉంది. ఒక్కొక్కటీ 100 గ్రాముల బరువుంది. దీంతో 8.7 కిలో బంగారు బిస్కెట్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ రూ.2.44 కోట్లని తెలిపారు. కారు డ్రైవర్ ముజిబుర్ రెహమాన్‌ను అరెస్టు చేసి మధురై జైలుకు తరలించారు. ఇవన్నీ శ్రీలంక నుంచి పడవలో తీసుకువచ్చినట్లు తెలుస్తోంది. -
భారీ స్థాయిలో బంగారం అక్రమాలు !
-
రద్దయిన నోట్లతో కనకాభిషేకం!
► దేశవ్యాప్తంగా భారీ స్థాయిలో బంగారం కొనుగోళ్లు ► ఢిల్లీలో ఇంతవరకు రూ. 650 కోట్ల అమ్మకాలు న్యూఢిల్లీ: రద్దయిన పెద్ద నోట్లతో అక్రమార్కులు బంగారు పంట పండిస్తున్నారు. లెక్కల్లో చూపని ఈ డబ్బుతో నల్లకుబేరులు భారీగా బంగారాన్ని కొంటున్నారు. బులియన్ వ్యాపారులు పకడ్బందీగా ఈ నోట్లకు కనకపు కడ్డీలను అమ్ముకుని దర్జాగా బ్యాంకు ఖాతాల్లో డిపాజిట్ చేసుకుంటున్నారు. పెద్ద నోట్ల రద్దు తర్వాత దేశవ్యాప్తంగా ఆదాయపన్ను(ఐటీ), డైరెక్టరేట్ ఆఫ్ రెవిన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ), ఎన్ ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) జరిపిన దాడుల్లో కళ్లు తిరిగే స్థాయిలో అక్రమాలు వెలుగు చూశాయి. ముఖ్యంగా ఢిల్లీ ‘నోట్లకు బంగారం’ లావాదేవీలకు అడ్డాగా మారింది. ఇంతవరకు రూ. 650 కోట్లకు పైగా విలువైన ఇలాంటి అమ్మకాలను ఢిల్లీలో గుర్తించారు. తాజా దాడుల్లో.. ఢిల్లీలోని కరోల్ బాగ్, చాందినీ చౌక్ తదితర చోట్ల షాపులు, బులియన్ వ్యాపారుల ఇళ్లపై శుక్రవారం జరిపిన దాడుల్లో లెక్కల్లో చూపని రూ. 250 కోట్ల బంగారం అమ్మకాలు బయటపడ్డాయి. రద్దయిన నోట్లకు నలుగురు ట్రేడర్లు బంగారాన్ని అమ్మినట్లు అధికారులు గుర్తించారు. రద్దయిన నోట్లకు బంగారాన్ని అమ్మి, ఆ డబ్బును డొల్ల(షెల్) ఖాతాల్లో డిపాజిట్ చేసినట్లు గుర్తించారు. ఇంతకుముందు.. నోట్ల రద్దు తర్వాత ఢిల్లీలోనే జరిపిన దాడుల్లో రూ. 400 కోట్ల లెక్కల్లో చూపని బంగారం అమ్మకాలు వెలుగు చూశాయి. ఇద్దరు దళారులను, ఇద్దరు బ్యాంకు మేనేజర్లను అరెస్ట్‌చేశారు. కాగా, బెంగళూరులో శుక్రవారం బులియన్ ట్రేడర్లు, నగల వ్యాపారుల షాపుల్లో, ఇళ్లలో జరిపిన దాడుల్లో రూ. 47 కోట్ల లెక్కచెప్పని ఆదాయం బయటపడింది. ఆగ్రాలో ఓ బులియన్ గ్రూపుపై జరిపిన దాడుల్లో.. లెక్కల్లో లేని 12 కోట్ల డబ్బు బయటపడింది. కేరళలో రూ.39 లక్షలు సీజ్ మలప్పురం: కేరళలో రద్దయిన నోట్లకు మార్పిడి చేసిన రూ. 39.98 లక్షల విలువైన 2000 కరెన్సీని జప్తు చేశారు. తిరూర్ వ్యాపారి షాబిర్ బాబు ఇంట్లో ఈ మొత్తం బయటపడింది. దళారిగా వ్యవహరించిన అలీని అరెస్ట్ చేసి, అతనికి షాబిర్ నోట్ల మార్పిడి కోసం ఇచ్చిన రూ. 3 లక్షల విలువైన రద్దయిన నోట్లను స్వాధీనం చేసుకున్నారు. ఐటీ అధికారులు మీడియాలో చర్చించొద్దు.. అధికార నిర్ణయాలపై ఐటీ అధికారులు ట్విటర్, ఫేస్బుక్ వంటి సోషల్ మీడియా వెబ్సైట్లలో చర్చించకూడదని కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు ఆదేశించింది. అధికార నిర్ణయాలతోపాటు, రహస్యంగా జరిపే అధికార భేటీల వివరాలపైనా కొందరు సోషల్ మీడియాలో చర్చిస్తున్నారని, ఇకపై దీన్ని మానుకోవాలని స్పష్టం చేసింది. నేటి నుంచి ‘నగదు రహిత’ అవార్డులు నగద రహిత(డిజిటల్) చెల్లింపులను ప్రోత్సహించడానికి ప్రవేశపెట్టిన ‘లక్కీ గ్రాహక్ యోజన’, ‘డిజీ ధన్ వ్యాపార్ యోజన’ అవార్డులు ఆదివారం నుంచి 100 నగరాల్లో ప్రారంభం కానున్నట్లు నీతి ఆయోగ్ తెలిపింది. ఏప్రిల్ 14న మెగా డ్రా నిర్వహిస్తారు. లక్కీ గ్రాహక్ యోజన కింద రోజూ 15 వేల మంది విజేతలకు రూ. 100 క్యాష్ బ్యాక్ ఇస్తారు. మరో పథకం కింద ప్రతివారం గెలిచిన వ్యాపారికి గిఫ్ట్లిస్తారు. 430 కేజీల బంగారాన్ని అక్రమంగా అమ్మేశారు! ప్రత్యేక రాయితీ పథకం కింద సుంకం కట్టకుండా దిగుమతి చేసుకున్న వందల కేజీల బంగారాన్ని ఓ సంస్థ అడ్డదారిలో అమ్మేసి అడ్డంగా దొరికిపోయింది. నోయిడా సెజ్ నుంచి కార్యకలాపాలు నిర్వహిస్తున్న మెజర్స్ శ్రీలాల్ కంపెనీ రూ. 140 కోట్ల విలువైన 430 కేజీల బంగారాన్ని అక్రమంగా అమ్మినట్లు రెవిన్యూ(డీఆర్ఐ) అధికారులు గురు, శక్రవారాల్లో జరిపిన దాడుల్లో బయటపడింది. ఈ కంపెనీలో, కంపెనీ అధికారుల ఇళ్లలో దాడులు జరిపి రూ. 2.60 కోట్ల నగదు(రూ. 12 లక్షల కొత్త నోట్లతో కలిపి), 15 కేజీల బంగారు నగలు, 80 కేజీల వెండిని సీజ్ చేశారు. నోట్లను రద్దు చేసిన నవంబర్ 8న ఈ కంపెనీ 24 కేజీల బంగారాన్ని కొని రద్దయిన నోట్లకు అమ్మినట్లు గుర్తించారు. -
సిగరెట్లు నాలుగు రెట్లు ...
న్యూఢిల్లీ: విదేశాల నుంచి భారత్‌కు సిగరెట్లు అక్రమ రవాణ నాలుగు రెట్లు పెరిగిందంట. అది కూడా కేవలం 2012 -2014 మధ్య కాలంలో అని ద డైరెక్టర్ ఆఫ్ రెవెన్యూ ఇంటిలిజన్స్ ( డీఆర్ఐ) వెల్లడించింది. అందుకు సంబంధించిన తాజా లెక్కల జాబితాను శనివారం ఇక్కడ విడుదల చేసింది. సిగరెట్ల అక్రమ రవాణా కారణంగా 2014-15 మధ్య కాలంలో భారత్‌కు రూ. 2,363 కోట్ల నష్టం వాటిల్లిందని పేర్కొంది. కొరియా, ఇండోనేషియా, మలేసియా, సింగపూర్, చైనా, యూనైటెడ్ అరబ్ ఏమిరేట్స్ దేశాల నుంచి భారత్‌కు సిగరేట్లు అక్రమ రవాణ వెల్లువెత్తిందని చెప్పింది. ఈ అక్రమ రవాణాకు న్యూఢిల్లీ, సింగపూర్, దుబాయి నగరాలు ట్రాన్సిట్ పాయింట్లుగా ఉన్నాయిని తెలిపింది. దక్షిణాసియా ప్రాంతంలో చాలా దేశాల మధ్య సరిహద్దుల్లో ఎంత చిన్న అవకాశం దొరికిన పొగాకు ఉత్పత్తుల అక్రమ రవాణాకు స్మగ్లర్లు సద్వినియోగం చేసుకుంటున్నారని డబ్ల్యూహెచ్‌వో దిక్షిణాసియా ప్రాంతీయ సంచాలకులు పూనమ్ క్షేత్రపాల్ సింగ్ వెల్లడించారు. స్మగ్లింగ్‌ని అరికట్టేందుకు ఈ దేశాల మధ్య చట్టాలను మరింత కఠినతరం చేయాల్సిన అవశ్యకతను సింగ్ ఈ సందర్భంగా తెలిపారు. అక్రమ పొగాకు వ్యాపారం గ్లొబల్ ప్రాబ్లమ్ అని కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి భాను ప్రతాప్ శర్మ పేర్కొన్నారు. సిగరెట్లు అక్రమ రవాణాపై డబ్ల్యూహెచ్‌వో తాజాగా రూపొందించిన నివేదిక ఆధారంగా డీఆర్ఐ తెలిపింది. -
ఆన్ మిలటరీ డ్యూటీ ట్రక్ ... 200 కోట్ల హెరాయిన్
ఛండీగడ్: పంజాబ్‌లో మరోసారి భారీ ఎత్తున హెరాయిన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. లూథియానా జిల్లాలోని ములాన్‌పూర్ వద్ద పోలీసులు శనివారం వాహన తనిఖీలు నిర్వహంచారు. ఈ సందర్భంగా 'ఆన్ మిలటరీ డ్యూటీ' అనే బోర్డు ఉన్న ట్రక్‌లో అక్రమంగా తరలిస్తున్న దాదాపు 40 కేజీల హెరాయిన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం హెరాయిన్‌ను డైరెక్టర్ ఆఫ్ రెవెన్యూ ఇంటిలిజెన్స్ (డీఆర్ఐ) అధికారులకు అప్పగించారు. ఆ హెరాయిన్‌ను అధికారులు సీజ్ చేశారు. పోలీసులు, భద్రత సిబ్బంది దృష్టి మళ్లించేందుకు మిలటరీ బోర్డు వాహనానికి తగిలించారని అధికారులు వెల్లడించారు. పట్టుబడిన హెరాయిన్ విలువ అంతర్జాతీయ మార్కెట్లో రూ. 200 కోట్లు వరకు ఉంటుందన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు డీఆర్ఐ అధికారులు తెలిపారు. ఈ నెల 15న హర్యానాలో ఎన్నికలు జరగనున్నాయి. ఈ సందర్బంగా ఆ పక్క రాష్ట్రమైన పంజాబ్‌లో పోలీసుల తనిఖీలు ముమ్మరం చేశారు.