భారీ స్థాయిలో బంగారం అక్రమాలు ! | Gold extends losses, down Rs 50 on lacklustre demand | Sakshi
Sakshi News home page

Published Sun, Dec 25 2016 7:39 AM | Last Updated on Fri, Mar 22 2024 11:22 AM

రద్దయిన పెద్ద నోట్లతో అక్రమార్కులు బంగారు పంట పండిస్తున్నారు. లెక్కల్లో చూపని ఈ డబ్బుతో నల్లకుబేరులు భారీగా బంగారాన్ని కొంటున్నారు. బులియన్ వ్యాపారులు పకడ్బందీగా ఈ నోట్లకు కనకపు కడ్డీలను అమ్ముకుని దర్జాగా బ్యాంకు ఖాతాల్లో డిపాజిట్‌ చేసుకుంటున్నారు. పెద్ద నోట్ల రద్దు తర్వాత దేశవ్యాప్తంగా ఆదాయపన్ను(ఐటీ), డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెవిన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్‌ఐ), ఎన్ ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) జరిపిన దాడుల్లో కళ్లు తిరిగే స్థాయిలో అక్రమాలు వెలుగు చూశాయి. ముఖ్యంగా ఢిల్లీ ‘నోట్లకు బంగారం’ లావాదేవీలకు అడ్డాగా మారింది. ఇంతవరకు రూ. 650 కోట్లకు పైగా విలువైన ఇలాంటి అమ్మకాలను ఢిల్లీలో గుర్తించారు.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement