సిగరెట్లు నాలుగు రెట్లు ...
న్యూఢిల్లీ: విదేశాల నుంచి భారత్కు సిగరెట్లు అక్రమ రవాణ నాలుగు రెట్లు పెరిగిందంట. అది కూడా కేవలం 2012 -2014 మధ్య కాలంలో అని ద డైరెక్టర్ ఆఫ్ రెవెన్యూ ఇంటిలిజన్స్ ( డీఆర్ఐ) వెల్లడించింది. అందుకు సంబంధించిన తాజా లెక్కల జాబితాను శనివారం ఇక్కడ విడుదల చేసింది. సిగరెట్ల అక్రమ రవాణా కారణంగా 2014-15 మధ్య కాలంలో భారత్కు రూ. 2,363 కోట్ల నష్టం వాటిల్లిందని పేర్కొంది. కొరియా, ఇండోనేషియా, మలేసియా, సింగపూర్, చైనా, యూనైటెడ్ అరబ్ ఏమిరేట్స్ దేశాల నుంచి భారత్కు సిగరేట్లు అక్రమ రవాణ వెల్లువెత్తిందని చెప్పింది. ఈ అక్రమ రవాణాకు న్యూఢిల్లీ, సింగపూర్, దుబాయి నగరాలు ట్రాన్సిట్ పాయింట్లుగా ఉన్నాయిని తెలిపింది.
దక్షిణాసియా ప్రాంతంలో చాలా దేశాల మధ్య సరిహద్దుల్లో ఎంత చిన్న అవకాశం దొరికిన పొగాకు ఉత్పత్తుల అక్రమ రవాణాకు స్మగ్లర్లు సద్వినియోగం చేసుకుంటున్నారని డబ్ల్యూహెచ్వో దిక్షిణాసియా ప్రాంతీయ సంచాలకులు పూనమ్ క్షేత్రపాల్ సింగ్ వెల్లడించారు. స్మగ్లింగ్ని అరికట్టేందుకు ఈ దేశాల మధ్య చట్టాలను మరింత కఠినతరం చేయాల్సిన అవశ్యకతను సింగ్ ఈ సందర్భంగా తెలిపారు. అక్రమ పొగాకు వ్యాపారం గ్లొబల్ ప్రాబ్లమ్ అని కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి భాను ప్రతాప్ శర్మ పేర్కొన్నారు. సిగరెట్లు అక్రమ రవాణాపై డబ్ల్యూహెచ్వో తాజాగా రూపొందించిన నివేదిక ఆధారంగా డీఆర్ఐ తెలిపింది.