
ముంబై: క్రికెటర్ కృనాల్ పాండ్యాను ముంబై అంతర్జాతీయ విమానాశ్రయంలో డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్‌ఐ) అధికారులు నిర్బంధించారు. ముంబై ఇండియన్స్ ఆల్‌రౌండర్ పాండ్యా సరైన ధ్రువ పత్రాలు లేని బంగారం, ఇతర విలువైన వస్తువులు కలి గి వుండటంతో అతన్ని విమానాశ్రయంలోనే ఆపివేశారు. ఐపీఎల్–13 చాంపియన్ ముంబై జట్టు సభ్యుడైన అతను గురువారం యూఏఈ నుంచి వచ్చాడు. పరిమితికి మించి బంగారం ఉండటంతో పాటు ఇన్‌వాయిస్ లేని వస్తువులు కొనుగోలు చేయడంతో నిర్బంధించినట్లు డీఆర్‌ఐ వర్గాలు తెలిపాయి.
Comments
Please login to add a commentAdd a comment