detained in airport
-
ఆ ఘటన షాక్‌కు గురిచేసింది: శశి థరూర్
ఢిల్లీ: తన మాజీ సిబ్బందిలో ఒకరిని గోల్డ్ స్మగ్లింగ్ విషయంలో కస్టమ్స్ అధికారులు అదుపులోకి తీసుకోవటం షాక్‌కు గురిచేసిందని కాంగ్రెస్ నేత శశి థరూర్ అన్నారు. ఢిల్లీ ఇందిరా గాంధీ ఎయిర్ పోర్టులో రూ. 35 లక్షల బంగారంతో శివ ప్రసాద్ అనే వ్యక్తి కస్టమ్స్ అధికారులకు పట్టుబడ్డారు. దీంతో అధికారులు అయన్ను అదుపులోకి తీసుకున్నారు. దీనిపై కాంగ్రెస్ నేత శిశి థరూర్ ‘ఎక్స్’ వేదికగా స్పందించారు.‘‘లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో నేను ధర్మశాలలో ఉన్నా. నా వద్ద తాత్కాలికంగా పని చేసిన సిబ్బందిని బంగారం స్మగ్లింగ్ చేస్తున్నారన్న విషయంలో ఇందిరా గాంధీ అంతర్జాతీయ ఎయిర్‌పోర్టు అధికారులు అదుపులోకి తీసుకోవటంపై షాక్‌కు గురయ్యాను. 72 ఏళ్ల వ్యక్తి తరచూ డయాలసీస్ చేయించుకుంటున్నారు. ఆ వ్యక్తిపై వచ్చిన ఆరోపణలపై దర్యాప్తు చేస్తున్న అధికారులకు నా పూర్తి మద్దతు తెలుపుతున్నా. చట్టం తన పని తాను చేస్తుంది’’ అని థరూర్ అన్నారు.While I am in Dharamshala for campaigning purposes, I was shocked to hear of an incident involving a former member of my staff who has been rendering part-time service to me in terms of airport facilitation assistance. He is a 72 year old retiree undergoing frequent dialysis and…— Shashi Tharoor (@ShashiTharoor) May 30, 2024 బుధవారం ఢిల్లీ ఎయిర్‌పోర్టు టెర్మినల్ 3 లో కస్టమ్స్ అధికారుల తనిఖీల్లో 500 గ్రాములో బంగారంలో శవ ప్రసాద్ అనే వ్యక్తి పట్టుబడ్డారు. ఆయన వద్ద ఉన్న బంగారంపై ప్రశ్నించగా సంబంధం లేని సమాధానం చెప్పటంతో అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అయితే ఆయన కాంగ్రెస్ నేత శశిథరూర్ సహాక సిబ్బంది అని అధికారులు గుర్తించారు. -
కృనాల్ పాండ్యా నిర్బంధం
ముంబై: క్రికెటర్ కృనాల్ పాండ్యాను ముంబై అంతర్జాతీయ విమానాశ్రయంలో డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) అధికారులు నిర్బంధించారు. ముంబై ఇండియన్స్ ఆల్‌రౌండర్ పాండ్యా సరైన ధ్రువ పత్రాలు లేని బంగారం, ఇతర విలువైన వస్తువులు కలి గి వుండటంతో అతన్ని విమానాశ్రయంలోనే ఆపివేశారు. ఐపీఎల్–13 చాంపియన్ ముంబై జట్టు సభ్యుడైన అతను గురువారం యూఏఈ నుంచి వచ్చాడు. పరిమితికి మించి బంగారం ఉండటంతో పాటు ఇన్వాయిస్ లేని వస్తువులు కొనుగోలు చేయడంతో నిర్బంధించినట్లు డీఆర్ఐ వర్గాలు తెలిపాయి. -
లాస్ ఏంజిల్స్‌లో జస్టిన్ బీబర్ అరెస్టు
టీనేజి పాప్ సంచలనం జస్టిస్ బీబర్‌ను అమెరికాలోని లాస్ ఏంజిల్స్ విమానాశ్రయంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జపాన్ పర్యటన ముగించుకుని తిరిగి అమెరికా వస్తున్న జస్టిన్ బీబర్ లాస్ ఏంజిల్స్ అంతర్జాతీయ విమానాశ్రయానికి మధ్యాహ్నం ఒంటిగంట సమయానికి చేరుకున్నాడు. అయితే, అతడి అంగరక్షకులు మాత్రం కస్టమ్స్ గేటు బయట అతడికోసం సాయంత్రం నాలుగు గంటల వరకు వేచిచూస్తూనే ఉన్నారు. అయితే, ఈ కెనడియన్ పాప్ సింగర్‌ను ఎందుకు అదుపులోకి తీసుకున్నారన్న విషయం మాత్రం ఇంకా తెలియలేదు. అసభ్య ప్రవర్తనకు గాను బీబర్‌ను డిపోర్ట్ చేయాలని వైట్‌హౌస్‌లో వారం క్రితం ఓ పిటిషన్ దాఖలైంది. ఆ తర్వాత ఇప్పుడు ఈ గొడవ వచ్చింది. జనవరిలో మియామీలో బీబర్‌ను అరెస్టు చేసిన తర్వాత ఈ పిటిషన్ దాఖలైంది.