Hyderabad DRI Seizes Gold Worth 1 9 Crore At RGIA - Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌: క్యాటరింగ్‌ ఉద్యోగి @ 2 కిలోల బంగారం  

Published Tue, Nov 30 2021 10:31 AM | Last Updated on Tue, Nov 30 2021 2:27 PM

Hyderabad DRI Seizes Gold Worth 1 9 Crore At RGIA - Sakshi

Gold worth Rs 1.09 cr seized, employee of airplane catering service held by DRI: పార్శిల్‌లో వచ్చిన బంగారాన్ని క్యాటరింగ్‌ ఉద్యోగి బయటకు తీసుకొచ్చి స్మగ్లింగ్‌ గ్యాంగ్‌కు చేరవేస్తున్నట్లు గుర్తించింది. ఇతన్ని అరెస్టు చేసిన డీఆర్‌ఐ కోర్టులో ప్రవేశపెట్టగా

సాక్షి, హైదరాబాద్‌: డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటెలిజెన్స్‌ (డీఆర్‌ఐ) అధికారులు రెండ్రోజులుగా హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో తనిఖీలు చేసి రూ.1.09 కోట్ల విలువైన 2 కిలోల బంగారం స్వాధీనం చేసుకున్నారు. ఓ ప్రైవేట్‌ ఎయిర్‌లైన్స్‌ సంస్థలోని క్యాటరింగ్‌ సర్వీస్‌ ఉద్యోగి నుంచి ఈ బంగారం స్వాధీనం చేసుకున్నట్లు డీఆర్‌ఐ హైదరాబాద్‌ జోనల్‌ అధికారులు సోమవారం ఒక ప్రకటనలో వెల్లడించారు. మిడిల్‌ ఈస్ట్‌ దేశాల నుంచి స్మగ్లింగ్‌ అవుతున్న ఈ బంగారాన్ని ఆహార పదార్థాల లోడింగ్, అన్‌లోడింగ్‌ పద్ధతిలో హైదరాబాద్‌కు స్మగ్లింగ్‌ చేస్తున్నట్లు డీఆర్‌ఐ కనిపెట్టింది.

ఇలా పార్శిల్‌లో వచ్చిన బంగారాన్ని క్యాటరింగ్‌ ఉద్యోగి బయటకు తీసుకొచ్చి స్మగ్లింగ్‌ గ్యాంగ్‌కు చేరవేస్తున్నట్లు గుర్తించింది. ఇతన్ని అరెస్టు చేసిన డీఆర్‌ఐ కోర్టులో ప్రవేశపెట్టగా.. కోర్టు రిమాండ్‌ విధించింది. అసలు ఈ మాఫియాలో హైదరాబాద్‌లో పనిచేస్తున్న వారు ఎవరు? ఏయే దేశాల నుంచి ఎంత బంగారం ఇప్పటివరకు వచ్చిందన్న పూర్తి అంశాలపై విచారణ జరుగుతోందని డీఆర్‌ఐ అధికారులు తెలిపారు.   
చదవండి: పరిచయం ప్రేమగా మారింది, పెళ్లి చేసుకుంటానన్నాడు.. కానీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement