DRI SUMMIT: దేశాల మధ్య సమన్వయంతోనే స్మగ్లింగ్‌ నిరోధం సాధ్యం | DRI SUMMIT: FM Nirmala Sitharaman seeks global help to nab smuggling masterminds | Sakshi
Sakshi News home page

DRI SUMMIT: దేశాల మధ్య సమన్వయంతోనే స్మగ్లింగ్‌ నిరోధం సాధ్యం

Published Tue, Oct 31 2023 5:42 AM | Last Updated on Tue, Oct 31 2023 10:59 AM

DRI SUMMIT: FM Nirmala Sitharaman seeks global help to nab smuggling masterminds - Sakshi

ఎన్‌ఫోర్స్‌మెంట్‌ మేటర్స్‌ 2023 అన్న అంశంపై డీఆర్‌ఐ నిర్వహించిన గ్లోబల్‌ కాన్ఫరెన్స్‌లో ప్రసంగిస్తున్న ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌

న్యూఢిల్లీ: అక్రమ రవాణా, వ్యాపారం వెనుక ఉన్న సూత్రధారులను అణిచివేసేందుకు ప్రపంచ దేశాల ప్రభుత్వాల సమన్వయం అవసరమని ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ పిలుపునిచ్చారు. చట్టవిరుద్ధ వ్యాపారం వెనుక ఉన్న ‘‘మాస్టర్‌ మైండ్స్‌’’ ను  పట్టుకోవడంపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఏజెన్సీల దృష్టి సారించాలని ఆమె పేర్కొన్నారు. ఆర్థిక వ్యవస్థతో పాటు పౌరుల ప్రయోజనాలను  దెబ్బతీసే చట్టవిరుద్ధ కార్యకలాపాలకు నిరోధానికి విచారణా సంస్థల సమన్వయ చొరవలు అవసరమని ఆమె అన్నారు.

అక్రమంగా రవాణా, లేదా చట్టవిరుద్ధ వ్యాపార స్వభావం గత 50 నుంచి 60 సంవత్సరాలుగా మారలేదని ఆమె ఈ సందర్భంగా పేర్కొన్నారు. విలువైన లోహాలు, మాదక ద్రవ్యాలు, అటవీ లేదా సముద్ర జీవుల అక్రమ రవాణా కొనసాగడం విచారకరమని అన్నారు. అక్రమ వ్యాపారం, స్మగ్లింగ్‌ ముప్పును అరికట్టడంలో సాంకేతికత కీలక పాత్ర పోషిస్తుందని కూడా ఆమె ఈ సందర్బంగా అన్నారు.  సమాచారాన్ని ఇచి్చపుచ్చుకోవడంలో సాంకేతికత వినియోగం చాలా ప్రాధాన్యత కలిగిన అంశమని పేర్కొన్నారు.

   ‘‘ఎన్‌ఫోర్స్‌మెంట్‌ మేటర్స్‌ 2023’’ అన్న అంశంపై డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటెలిజెన్స్‌ (డీఆర్‌ఐ) ఇక్కడ నిర్వహించిన ఒక గ్లోబల్‌ కాన్ఫరెన్స్‌ను ఉద్ధేశించి ఆర్థికమంత్రి చేసిన ప్రారంభోపన్యాసంలో కొన్ని ముఖ్యాంశాలు..

► చాలా వరకు అక్రమంగా వ్యాపారం చేసే వస్తువులు అలాగే ఉంటాయి. కస్టమ్స్‌ అధికారులు కంగుతినేంత స్థాయిలో కొత్త వస్తువుల అక్రమ రవాణా ఏదీ లేదు.  దశాబ్ద కాలంగా ఇదే ధోరణి కొనసాగుతుందంటే... దీని వెనుక ఉన్న శక్తులు ఎవరో సమాజానికి తెలియాలి.
∙అక్రమ రవాణా సూత్రధారుల అణచివేతకు డబ్ల్యూసీఓ (ప్రపంచ కస్టమ్స్‌ ఆర్గనైజేషన్‌)తో పాటు ప్రభుత్వాల మధ్య సహకారానికి చాలా ముఖ్యం.  తద్వారా అక్రమ రవాణా వెనుక
ఉన్న సూత్రధారులను పట్టుకో
గలుగుతాము.  
► జప్తు చేసిన వస్తువులన్నింటినీ ధ్వంసం చేసి, మార్కెట్‌లోకి తీసుకురాకుండా అడ్డుకోగలిగితే, అక్రమ వ్యాపారాన్ని అరికట్టడం తేలికవుతుంది.  
► అక్రమ రవాణా కార్యకలాపాలకు పాల్పడినవారికి శిక్ష తప్పదని, ఆయా చర్యల నిరోధం సాధ్యమేనని ప్రజల్లో విశ్వాసాన్ని పునరుద్ధరించడం మన కర్తవ్యం.  
► బంగారం, సిగరెట్లు, మాదక ద్రవ్యాలు, పురాతన వస్తువులు, వన్యప్రాణి సంపద అక్రమ రవాణాలపై ప్రత్యేక నిఘా అవసరం. ఎందుకంటే ఇది  ఆర్థిక వ్యవస్థలన్నింటినీ దెబ్బతీస్తుంది.
► దొంగిలించిన, అక్రమంగా తరలించిన పురాతన వస్తువులన్నింటినీ వాటికి సంబంధించిన స్వదేశాలకు తిరిగి అప్పగించాల్సిన అవసరం ఉంది. దీనికీ అంతర్జాతీయ సమన్వయం, సహకారం అవసరం.  
► ఈ కార్యక్రమంలో డీఆర్‌ఐ ’ఆపరేషన్‌ శేష’  నాల్గవ దశను మంత్రి ప్రారంభించారు. ఈ ఆపరేషన్‌కు ప్రపంచ కస్టమ్స్‌ ఆర్గనైజేషన్‌ రీజినల్‌ ఇంటెలిజెన్స్‌ లైజన్‌ ఆఫీస్‌ (ఆర్‌ఐఎల్‌ఓ) ఆసియా పసిఫిక్, మిడిల్‌ ఈస్ట్‌ల సహకారం అందిస్తోంది. కలప అక్రమ వ్యాపారాన్ని అరికట్టేందుకు 2015లో తొలిసారిగా ఈ ఆపరేషన్‌ ప్రారంభించారు.  


అక్రమ రవాణా పెరుగుతోంది: సంజయ్‌ కుమార్‌ అగర్వాల్‌
పరోక్ష పన్నులు– కస్టమ్స్‌ సెంట్రల్‌ బోర్డ్‌ (సీబీఐసీ) చీఫ్‌ సంజయ్‌ కుమార్‌ అగర్వాల్‌ కార్యక్రమంలో మాట్లాడుతూ, ప్రపంచ వాణిజ్యం పరస్పరం అనుసంధానం కావడం, ఆర్థిక వ్యవస్థలు అభివృద్ధి వంటి అంశాల నేపథ్యంలో  పురాతన వస్తువులు, సిగరెట్లు, బంగారం, అంతరించిపోతున్న వన్యప్రాణులసహా నిషేధిత వస్తువుల అక్రమ తరలింపు పెరుగుతోందన్నారు. మాదక ద్రవ్యాల అక్రమ వ్యాపారం తీవ్రంగా ఉందని పేర్కొన్నారు. గ్లోబల్‌ డ్రగ్‌ ట్రాఫికింగ్‌ విలువ దాదాపు 650 బిలియన్‌ డాలర్లని  ఆయన పేర్కొన్నారు. మొత్తం అక్రమ ఆర్థిక వ్యాపార కార్యకలాపాల్లో ఈ వాటా దాదాపు 30 శాతమని తెలిపారు.

ఇది తీవ్ర ప్రభావాలకు దారితీస్తోందని పేర్కొన్న ఆయన, మనీలాండరింగ్‌ తీవ్రవాద కార్యకలాపాల ఫైనాన్షింగ్‌ ఫైనాన్సింగ్‌కు ఇది దారితీస్తోందని, ఆయా అంశాలు జాతీయ భద్రతపై ప్రభావం చూపుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. దీని నిరోధానికి విచారణా సంస్థల మధ్య సన్నిహిత సమన్వయ చర్యలు అవసరమని పేర్కొన్నారు. రెవెన్యూ కార్యదర్శి సంజయ్‌ మల్హోత్రా మాట్లాడుతూ, స్మగ్లింగ్‌ ముప్పును ఎదుర్కోవాల్సిన అవసరం చాలా ముఖ్యమైనదని పేర్కొన్నారు. వ్యాపార వ్యయాలను తగ్గించి, పోటీతత్వాన్ని పెంచే సులభతర వాణిజ్య చర్యలను కూడా ఈ దిశలో చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement