Global Conference
-
ఎకానమీ పటిష్టతే ఆర్బీఐ లక్ష్యం
బెంగళూరు: దేశ ఆర్థిక రంగాన్ని పటిష్టంగా, చురుగ్గా, కస్టమర్‌కు స్నేహ పూర్వకమైనదిగా మార్చడానికి రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) నిరంతరం పనిచేస్తుందని గవర్నర్ శక్తికాంతదాస్ సోమవారం స్పష్టం చేశారు. ఇందుకు తగిన విధాన పరమైన చర్యలను తీసుకుంటుందని ఉద్ఘాటించారు. ఆర్బీఐ @ 90 గ్లోబల్ కాన్ఫరెన్స్‌లో డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఎమర్జింగ్ టెక్నాలజీస్‌పై గవర్నర్ ప్రసంగిస్తూ, యూనిఫైడ్ లెండింగ్ ఇంటర్ఫేస్ (యూఎల్ఐ), సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీకి (సీబీడీసీ) సంబంధించి సెంట్రల్ బ్యాంక్ చేపడుతున్న వివిధ కార్యక్రమాలను ప్రస్తావించారు. విదేశాల నుంచి యూపీఐ ద్వారా నగదు బదిలీ సేవలను విస్తృతం చేయనున్నట్లు ఆయన తెలిపారు. గవర్నర్ చేసిన ప్రసంగంలో కొన్ని ముఖ్యాంశాలను పరిశీలిస్తే... → క్రాస్–బోర్డర్ రెమిటెన్స్‌లకు (విదేశాల నుంచి స్వదేశానికి డబ్బు పంపడానికి సంబంధించి) ప్రత్యామ్నాయంగా చౌకైన, వేగవంతమైన ఇన్‌స్ట్రుమెంట్‌గా యూపీఐ వ్యవస్థ పురోగమించనుంది. ప్రత్యేకించి తక్కువ విలువ కలిగిన వ్యక్తిగత రెమిటెన్స్‌ల విషయంలో విప్లవాత్మకమైన మార్పులకు యూపీఐ వ్యవస్థ నాందీ పలకనుంది. జూలైలో పార్లమెంట్లో ప్రవేశపెట్టిన ఆర్థిక సర్వే ప్రకారం, సేవా ఎగుమతుల తర్వాత విదేశాల నుంచి వచ్చే నిధుల విషయంలో రెమిటెన్సులు రెండో స్థానాన్ని ఆక్రమించాయి. 2024 క్యాలెండర్ ఇయర్లో ఇవి 3.7 శాతం వృద్ధితో 124 బిలియన్ డాలర్లకు, 2025లో 4 శాతం వృద్ధితో 129 బిలియన్ డాలర్లకు చేరే అవకాశం ఉంది. → రిజర్వ్ బ్యాంక్ గణనీయమైన ఆశావాదంతో ఆర్బీఐ ః 100 వైపు ప్రయాణం సాగిస్తోంది. → అభివృద్ధి చెందుతున్న సాంకేతికతల, డీపీఐ (డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్) థీమ్ విషయానికి వస్తే, గత దశాబ్ద కాలంలో సాంప్రదాయ బ్యాంకింగ్ వ్యవస్థలో అపూర్వమైన సాంకేతిక పరివర్తన చోటుచేసుకుంది. → లావాదేవీల వ్యయాలను తగ్గించడం, ఆర్థిక సదుపాయాల అందుబాటు, ఇంటరాపరబిలిటీ విషయంలో పోటీ, ప్రైవేట్ మూలధనాన్ని ఆకర్షించడం, అందరికీ ఆర్థిక సేవల వంటి కీలక చర్యలను డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రా ప్రోత్సహిస్తుంది. -
పేదరికం కనుమరుగవుతోంది
న్యూఢిల్లీ: దేశంలో పేదరికం మటుమాయం అవుతోందని ప్రధాని మోదీ చెప్పారు. గత పదేళ్లలో తలసరి గృహ వినియోగ వ్యయం రెండున్నర రెట్లు పెరగడమే ఇందుకు తార్కాణమన్నారు. ఆదివారం న్యూస్9 గ్లోబల్ సదస్సులో ఆయన ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు. ‘‘తలసరి వినియోగ పెరుగుదల పట్టణాల కంటే గ్రామాల్లోనే ఎక్కువగా ఉన్నట్టు కూడా సర్వేలో తేలింది. ప్రజలకు ఖర్చు చేసే సామర్థ్యం పెరుగుతోందని ఈ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. గ్రామాలు, పేదలు, రైతుల సంక్షేమంపై మేమిచ్చిన ప్రాధాన్యమే ఇందుకు కారణం. గ్రామీణ భారతాన్ని దృష్టి పెట్టుకుని పలు మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేశాం. మహిళల సాధికారత సాధించాం. అపారమైన ఉపాధి అవకాశాలు కలి్పంచాం. ప్రజల ఆత్మవిశ్వాసాన్ని అద్భుతంగా పెంచాం. పాలనతో పాటు దృక్కోణం తదితరాలన్నింట్లోనూ అపారమైన మార్పు తీసుకొచ్చాం’’ అని వివరించారు. గత ప్రభుత్వాలు ఓటు బ్యాంకు రాజకీయాల కోసం ప్రజలను కావాలనే కరువు పరిస్థితుల్లో మగ్గేలా చేశాయంటూ కాంగ్రెస్‌పై మోదీ విమర్శలు గుప్పించారు. ‘‘ఈ కరువు, సంతుïÙ్టకరణ రాజకీయాలపై మాకు నమ్మకం లేదు. సంతృప్త పాలనే మా ధ్యేయం. అభివృద్ధి ఫలాలు ప్రతి ఒక్కరికీ అందేలా చూస్తున్నాం’’ అని వివరించారు. గత పదేళ్లలో ప్రపంచ వేదికపై భారత్ విశ్వసనీయత ఎంతగానో పెరిగిందన్నారు. సమున్నత శిఖరాలకు సామర్థ్యం: కొన్నేళ్లుగా తమ ప్రభుత్వ పనితీరుకు ఆరి్టకల్ 370 రద్దు, ట్రిపుల్ తలాక్ రద్దు, మహిళా రిజర్వేషన్ల బిల్లు, అయోధ్యలో రామ మందిర నిర్మాణం వంటివి గీటురాయిగా నిలిచాయని మోదీ చెప్పారు. ‘‘గత పాలకులకు భారతీయుల సామర్థ్యంపై కనీస నమ్మకం కూడా లేదు. వారిని తక్కువగా అంచనా వేశారు’’ అంటూ కాంగ్రెస్ పాలనపై విమర్శలు గుప్పించారు. అప్పుడెప్పుడో 1960లు, 80ల్లో వారు మొదలు పెట్టిన పలు పథకాలను 2014లో తాము అధికారంలోకి వచ్చాక పూర్తి చేయాల్సి వచి్చందన్నారు. ‘‘మా పాలనలో దేశవ్యాప్తంగా సగటున రోజుకు రెండు కొత్త కాలేజీలు, వారానికో కొత్త యూనివర్సిటీ వచ్చాయి. అసాధ్యమంటూ ఏదీ లేదన్న విశ్వాసం ఇప్పుడు దేశ ప్రజల్లో తొణికిసలాడుతోంది’’ అని మోదీ అన్నారు. చెప్పారు. మూడో టర్ము పాలనలో దేశ సామర్థ్యాన్ని సమున్నత శిఖరాలకు చేర్చడమే లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. -
DRI SUMMIT: దేశాల మధ్య సమన్వయంతోనే స్మగ్లింగ్ నిరోధం సాధ్యం
న్యూఢిల్లీ: అక్రమ రవాణా, వ్యాపారం వెనుక ఉన్న సూత్రధారులను అణిచివేసేందుకు ప్రపంచ దేశాల ప్రభుత్వాల సమన్వయం అవసరమని ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ పిలుపునిచ్చారు. చట్టవిరుద్ధ వ్యాపారం వెనుక ఉన్న ‘‘మాస్టర్ మైండ్స్’’ ను పట్టుకోవడంపై ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీల దృష్టి సారించాలని ఆమె పేర్కొన్నారు. ఆర్థిక వ్యవస్థతో పాటు పౌరుల ప్రయోజనాలను దెబ్బతీసే చట్టవిరుద్ధ కార్యకలాపాలకు నిరోధానికి విచారణా సంస్థల సమన్వయ చొరవలు అవసరమని ఆమె అన్నారు. అక్రమంగా రవాణా, లేదా చట్టవిరుద్ధ వ్యాపార స్వభావం గత 50 నుంచి 60 సంవత్సరాలుగా మారలేదని ఆమె ఈ సందర్భంగా పేర్కొన్నారు. విలువైన లోహాలు, మాదక ద్రవ్యాలు, అటవీ లేదా సముద్ర జీవుల అక్రమ రవాణా కొనసాగడం విచారకరమని అన్నారు. అక్రమ వ్యాపారం, స్మగ్లింగ్ ముప్పును అరికట్టడంలో సాంకేతికత కీలక పాత్ర పోషిస్తుందని కూడా ఆమె ఈ సందర్బంగా అన్నారు. సమాచారాన్ని ఇచి్చపుచ్చుకోవడంలో సాంకేతికత వినియోగం చాలా ప్రాధాన్యత కలిగిన అంశమని పేర్కొన్నారు. ‘‘ఎన్ఫోర్స్మెంట్ మేటర్స్ 2023’’ అన్న అంశంపై డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) ఇక్కడ నిర్వహించిన ఒక గ్లోబల్ కాన్ఫరెన్స్‌ను ఉద్ధేశించి ఆర్థికమంత్రి చేసిన ప్రారంభోపన్యాసంలో కొన్ని ముఖ్యాంశాలు.. ► చాలా వరకు అక్రమంగా వ్యాపారం చేసే వస్తువులు అలాగే ఉంటాయి. కస్టమ్స్ అధికారులు కంగుతినేంత స్థాయిలో కొత్త వస్తువుల అక్రమ రవాణా ఏదీ లేదు. దశాబ్ద కాలంగా ఇదే ధోరణి కొనసాగుతుందంటే... దీని వెనుక ఉన్న శక్తులు ఎవరో సమాజానికి తెలియాలి. ∙అక్రమ రవాణా సూత్రధారుల అణచివేతకు డబ్ల్యూసీఓ (ప్రపంచ కస్టమ్స్ ఆర్గనైజేషన్)తో పాటు ప్రభుత్వాల మధ్య సహకారానికి చాలా ముఖ్యం. తద్వారా అక్రమ రవాణా వెనుక ఉన్న సూత్రధారులను పట్టుకో గలుగుతాము. ► జప్తు చేసిన వస్తువులన్నింటినీ ధ్వంసం చేసి, మార్కెట్లోకి తీసుకురాకుండా అడ్డుకోగలిగితే, అక్రమ వ్యాపారాన్ని అరికట్టడం తేలికవుతుంది. ► అక్రమ రవాణా కార్యకలాపాలకు పాల్పడినవారికి శిక్ష తప్పదని, ఆయా చర్యల నిరోధం సాధ్యమేనని ప్రజల్లో విశ్వాసాన్ని పునరుద్ధరించడం మన కర్తవ్యం. ► బంగారం, సిగరెట్లు, మాదక ద్రవ్యాలు, పురాతన వస్తువులు, వన్యప్రాణి సంపద అక్రమ రవాణాలపై ప్రత్యేక నిఘా అవసరం. ఎందుకంటే ఇది ఆర్థిక వ్యవస్థలన్నింటినీ దెబ్బతీస్తుంది. ► దొంగిలించిన, అక్రమంగా తరలించిన పురాతన వస్తువులన్నింటినీ వాటికి సంబంధించిన స్వదేశాలకు తిరిగి అప్పగించాల్సిన అవసరం ఉంది. దీనికీ అంతర్జాతీయ సమన్వయం, సహకారం అవసరం. ► ఈ కార్యక్రమంలో డీఆర్ఐ ’ఆపరేషన్ శేష’ నాల్గవ దశను మంత్రి ప్రారంభించారు. ఈ ఆపరేషన్‌కు ప్రపంచ కస్టమ్స్ ఆర్గనైజేషన్ రీజినల్ ఇంటెలిజెన్స్ లైజన్ ఆఫీస్ (ఆర్ఐఎల్ఓ) ఆసియా పసిఫిక్, మిడిల్ ఈస్ట్‌ల సహకారం అందిస్తోంది. కలప అక్రమ వ్యాపారాన్ని అరికట్టేందుకు 2015లో తొలిసారిగా ఈ ఆపరేషన్ ప్రారంభించారు. అక్రమ రవాణా పెరుగుతోంది: సంజయ్ కుమార్ అగర్వాల్ పరోక్ష పన్నులు– కస్టమ్స్ సెంట్రల్ బోర్డ్ (సీబీఐసీ) చీఫ్ సంజయ్ కుమార్ అగర్వాల్ కార్యక్రమంలో మాట్లాడుతూ, ప్రపంచ వాణిజ్యం పరస్పరం అనుసంధానం కావడం, ఆర్థిక వ్యవస్థలు అభివృద్ధి వంటి అంశాల నేపథ్యంలో పురాతన వస్తువులు, సిగరెట్లు, బంగారం, అంతరించిపోతున్న వన్యప్రాణులసహా నిషేధిత వస్తువుల అక్రమ తరలింపు పెరుగుతోందన్నారు. మాదక ద్రవ్యాల అక్రమ వ్యాపారం తీవ్రంగా ఉందని పేర్కొన్నారు. గ్లోబల్ డ్రగ్ ట్రాఫికింగ్ విలువ దాదాపు 650 బిలియన్ డాలర్లని ఆయన పేర్కొన్నారు. మొత్తం అక్రమ ఆర్థిక వ్యాపార కార్యకలాపాల్లో ఈ వాటా దాదాపు 30 శాతమని తెలిపారు. ఇది తీవ్ర ప్రభావాలకు దారితీస్తోందని పేర్కొన్న ఆయన, మనీలాండరింగ్ తీవ్రవాద కార్యకలాపాల ఫైనాన్షింగ్ ఫైనాన్సింగ్‌కు ఇది దారితీస్తోందని, ఆయా అంశాలు జాతీయ భద్రతపై ప్రభావం చూపుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. దీని నిరోధానికి విచారణా సంస్థల మధ్య సన్నిహిత సమన్వయ చర్యలు అవసరమని పేర్కొన్నారు. రెవెన్యూ కార్యదర్శి సంజయ్ మల్హోత్రా మాట్లాడుతూ, స్మగ్లింగ్ ముప్పును ఎదుర్కోవాల్సిన అవసరం చాలా ముఖ్యమైనదని పేర్కొన్నారు. వ్యాపార వ్యయాలను తగ్గించి, పోటీతత్వాన్ని పెంచే సులభతర వాణిజ్య చర్యలను కూడా ఈ దిశలో చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు. -
సైబర్‌దాడులు ప్రధాన ముప్పు
సాక్షి, న్యూఢిల్లీ: సురక్షితమైన సైబర్ స్పేస్ జీవిత నాణ్యతను మెరుగుపరుస్తుందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ వెల్లడించారు. ఈ నేపథ్యంలోనే డిజిటల్ సేవల అభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందనిమోదీ తెలిపారు. ఢిల్లీలో అతిపెద్ద గ్లోబల్ కాన్ఫరెన్స్ ఆన్ సైబర్ స్పేస్‌ను గురువారం ప్రారంభించిన ప్రధాని సైబర్ దాడులు తీవ్రమైన ముప్పుగా పరిణమించాయని వ్యాఖ్యానించారు. డిజిటల్ యాక్సెస్ ద్వారా ప్రభుత్వం సాధికారతకు కట్టుబడి ఉందని చెప్పారు. డిజిటల్ టెక్నాలజీ ద్వారా సేవలు సమర్థవంతంగా మారాయనీ, చాలా సులువుగా ప్రజలకు సేవలు అందించడంలో డిజిటల్ టెక్నాలజీ కీలకంగా మారిందన్నారు. టెక్నాలజీ వల్లే నగదు రహిత లావాదేవీలు పెరిగాయన్నారు. భీమ్ యాప్ ద్వారా అవినీతి రహిత సమాజాన్ని క్రియేట్ చేస్తున్నామన్నారు. ఎం పవర్(మొబైల్ పవర్) ద్వారా పౌరులు సాధికారత సాధిస్తున్నారని మోదీ పేర్కొన్నారు. అంతేకాదు ఆధార్ ద్వారా సబ్సిడీల లక్ష్యాన్ని ఛేదించడంతోపాటు 10 బిలియన్ డాలర్ల ఆదాయాన్ని పొదుపు చేయగలిగామన్నారు. సైబర్‌స్పేస్‌లో పెట్టుబడుల ద్వారా ప్రగతిలో భాగస్వామ్యం కావాలని ప్రధాని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్‌లు సైబర్‌స్పేస్‌కు సహకరిస్తున్నాయన్నారు. ఇంటర్నెట్ ఒక ఐడియల్ ఫ్లాట్‌ఫామ్‌గా మారిందన్నారు. ఇంటర్నెట్ ఆధారంగా యువత తమ టాలెంట్‌ను ప్రదర్శిస్తున్నారన్నారు. సైబర్‌భద్రతపై పటిష్టమైన నిర్ణయాలు తీసుకోవాలన్నారు. సాధారణ పౌరుడికి కూడా సైబర్‌భద్రత ఉండాలన్నారు. స్టార్టప్‌ల ద్వారా రోజు వారీ సమస్యలకు సమాధానాలు దొరుకుతున్నాయన్నారు. డిజిటల్ టెక్నాలజీ ఉగ్రవాదులకు ఊతమివ్వకుండా చూసుకోవాలని, రైతులకు ఉపయోగకరంగా ఉండే సైబర్ టెక్నాలజీని రూపొందించాలన్నారు. సైబర్ ఫర్ ఆల్ ఎ సెక్యూర్ అండ్ ఇన్‌క్లూజివ్ సైబర్‌స్పేస్ ఫర్ సస్టేయినబుల్ డెవలప్మెంట్ నినాదంతో నిర్వహిస్తున్నఅయిదవ అంతర్జాతీయ సదస్సు రెండు రోజుల పాటు జరగనుంది. ఈ సందర్బంగా ద ఇండియా బుక్‌ను ప్రధాని మోదీ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ప్రధాని ఈజ్ ఆఫ్ లీవింగ్ కోసం డిజిటల్ టెక్నాలజీ చాలా ఉపయోగకరంగా మారిందన్నారు. టెక్నాలజీ వల్ల సుపరిపాలన కూడా సాధ్యమైందన్నారు. టెక్నాలజీ అన్ని అవరోధాలను అధిగమించిందన్నారు. వసుధైక కుటుంబం అన్న భారతీయ సనాతన ధర్మాన్ని డిజిటల్ టెక్నాలజీ నిరూపిస్తుందన్నారు. పెన్షనర్లు బ్యాంక్ ముందు నిలబడాల్సిన అవసరం లేదని, ఆధార్‌తో తమ జీవన ప్రమాణ పత్రాలను సమర్పించవచ్చు అన్నారు. డిజిటల్ టెక్నాలజీ వృద్ధి మూలంగా మహిళలు పారిశ్రామికవేత్తలుగా అవతరిస్తున్నారని తెలిపారు. -
చైనా కరెన్సీ క్షీణత ఆందోళనకరం
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: చైనా కరెన్సీలో క్షీణత భారత ఎగుమతులపై ప్రతికూల ప్రభావం చూపిస్తోందని కేంద్ర వాణిజ్య, ఇంధన శాఖ సంయుక్త కార్యదర్శి రవ్నీత్ కౌర్ చెప్పారు. మూడేళ్లుగా మనదేశ ఎగుమతులు క్షీణిస్తుండటం ఆందోళనకరమైన అంశమని ఆమె అన్నారు. విశాఖపట్నంలో నిర్వహిస్తున్న సీఐఐ 22వ భాగస్వామ్య సదస్సులో సోమవారం ‘మేకిన్ ఇండియా - గ్లోబల్ మాన్యుఫాక్చరింగ్ స్ట్రాటజీ’ అనే అంశంపై చర్చాగోష్టి నిర్వహించారు. ఇందులో రవ్నీత్ కౌర్ మాట్లాడుతూ దేశీయ మార్కెట్ అవసరాలను తీర్చడంతోపాటు అంతర్జాతీయ మార్కెట్లో తగిన స్థానాన్ని సాధించడమే లక్ష్యంగా మేకిన్ ఇండియా కార్యక్రమాన్ని ప్రభుత్వం రూపొందించిందన్నారు. 35 తయారీరంగ అంశాల్లో మేకిన్ ఇండియా కార్యక్రమాన్ని విజయవంతం చేయడం ద్వారా భారత్ ప్రపంచ మార్కెట్లో బలీయ శక్తిగా ఆవిర్భవిస్తుందన్నారు. ‘మేకిన్ ఇండియా’ అంశంపై ఫిబ్రవరిలో ముంబైలో గ్లోబల్ సదస్సు నిర్వహించనున్నట్లు తెలిపారు. రోల్స్‌రాయిస్ ఇండియా ప్రై లిమిటెడ్ ప్రెసిడెంట్ కిశోర్ జయరామన్ మాట్లాడుతూ తమ సంస్థ వాహనాలను పూర్తిగా భారత్‌లో తయారు చేసి ఇతర దేశాలకు ఎగుమతి చేసేందుకు ప్రణాళిక రూపొందించామన్నారు. అందుకు ‘మేకిన్ ఇండియా’ కార్యక్రమం ద్వారా భారత ప్రభుత్వం కల్పించిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటామని చెప్పారు. దేశ స్థూల ఉత్పత్తిలో తయారీ రంగం వాటాను 16 శాతం నుంచి 25 శాతానికి పెంచడానికి ‘మేకిన్ ఇండియా’ కార్యక్రమం దోహదపపడుతుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. ఫాక్స్‌కాన్ ఇండియా ఎండీ జోష్ ఫోల్గర్ మాట్లాడుతూ ఎలక్ట్రానిక్స్ ఉపకరణాలను దేశీయంగా తయారు చేయడానికి భారతదేశం అధిక ప్రాధాన్యమివ్వాలని సూచించారు. లేకపోతే 2029నాటికి భారత ఎలక్ట్రానిక్స్ ఉపకరణాల దిగుమతులు క్రూడాయిల్ దిగుమతులను అధిగమించే అవకాశం ఉందన్నారు. తమ సంస్థ ఏడాదిలో దేశంలో 30 వేల మందికి ఉపాధి అవకాశాలు కల్పించిందన్నారు. ఎలక్ట్రానిక్స్ ఉపకరణాల తయారీ రంగం 2029నాటికి 1.50 మిలియన్ల మందికి ఉపాధి అవకాశాలు కల్పించే స్థాయికి ఎదుగుతుందని ఆయన చెప్పారు. అమెరికాకు చెందిన పాటన్ బోగ్స్ సంస్థ అంతర్జాతీయ సలహాదారు ఫ్రాంక్ జి.విస్నర్ మాట్లాడుతూ భారత ఎగుమతులు మూడేళ్లుగా క్షీణిస్తుండటం ఆందోళనకరమన్నారు. భారత్‌లో భూమి, పన్ను, కార్మిక చట్టాల్లో సంస్కరణలు వేగవంతం చేయాలని సూచించారు. ఈ చర్చాగోష్టిలో దివీస్ లేబరేటరీస్ ఎండీ కిరణ్ ఎస్. దివి తదితరులు పాల్గొన్నారు.