న్యూఢిల్లీ: దేశంలో పేదరికం మటుమాయం అవుతోందని ప్రధాని మోదీ చెప్పారు. గత పదేళ్లలో తలసరి గృహ వినియోగ వ్యయం రెండున్నర రెట్లు పెరగడమే ఇందుకు తార్కాణమన్నారు. ఆదివారం న్యూస్9 గ్లోబల్ సదస్సులో ఆయన ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు. ‘‘తలసరి వినియోగ పెరుగుదల పట్టణాల కంటే గ్రామాల్లోనే ఎక్కువగా ఉన్నట్టు కూడా సర్వేలో తేలింది.
ప్రజలకు ఖర్చు చేసే సామర్థ్యం పెరుగుతోందని ఈ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. గ్రామాలు, పేదలు, రైతుల సంక్షేమంపై మేమిచ్చిన ప్రాధాన్యమే ఇందుకు కారణం. గ్రామీణ భారతాన్ని దృష్టి పెట్టుకుని పలు మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేశాం. మహిళల సాధికారత సాధించాం. అపారమైన ఉపాధి అవకాశాలు కలి్పంచాం. ప్రజల ఆత్మవిశ్వాసాన్ని అద్భుతంగా పెంచాం. పాలనతో పాటు దృక్కోణం తదితరాలన్నింట్లోనూ అపారమైన మార్పు తీసుకొచ్చాం’’ అని వివరించారు.
గత ప్రభుత్వాలు ఓటు బ్యాంకు రాజకీయాల కోసం ప్రజలను కావాలనే కరువు పరిస్థితుల్లో మగ్గేలా చేశాయంటూ కాంగ్రెస్‌పై మోదీ విమర్శలు గుప్పించారు. ‘‘ఈ కరువు, సంతుïÙ్టకరణ రాజకీయాలపై మాకు నమ్మకం లేదు. సంతృప్త పాలనే మా ధ్యేయం. అభివృద్ధి ఫలాలు ప్రతి ఒక్కరికీ అందేలా చూస్తున్నాం’’ అని వివరించారు. గత పదేళ్లలో ప్రపంచ వేదికపై భారత్ విశ్వసనీయత ఎంతగానో పెరిగిందన్నారు.
సమున్నత శిఖరాలకు సామర్థ్యం: కొన్నేళ్లుగా తమ ప్రభుత్వ పనితీరుకు ఆరి్టకల్ 370 రద్దు, ట్రిపుల్ తలాక్ రద్దు, మహిళా రిజర్వేషన్ల బిల్లు, అయోధ్యలో రామ మందిర నిర్మాణం వంటివి గీటురాయిగా నిలిచాయని మోదీ చెప్పారు. ‘‘గత పాలకులకు భారతీయుల సామర్థ్యంపై కనీస నమ్మకం కూడా లేదు. వారిని తక్కువగా అంచనా వేశారు’’ అంటూ కాంగ్రెస్ పాలనపై విమర్శలు గుప్పించారు.
అప్పుడెప్పుడో 1960లు, 80ల్లో వారు మొదలు పెట్టిన పలు పథకాలను 2014లో తాము అధికారంలోకి వచ్చాక పూర్తి చేయాల్సి వచి్చందన్నారు. ‘‘మా పాలనలో దేశవ్యాప్తంగా సగటున రోజుకు రెండు కొత్త కాలేజీలు, వారానికో కొత్త యూనివర్సిటీ వచ్చాయి. అసాధ్యమంటూ ఏదీ లేదన్న విశ్వాసం ఇప్పుడు దేశ ప్రజల్లో తొణికిసలాడుతోంది’’ అని మోదీ అన్నారు. చెప్పారు. మూడో టర్ము పాలనలో దేశ సామర్థ్యాన్ని సమున్నత శిఖరాలకు చేర్చడమే లక్ష్యమని ఆయన పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment