Masterminds
-
DRI SUMMIT: దేశాల మధ్య సమన్వయంతోనే స్మగ్లింగ్ నిరోధం సాధ్యం
న్యూఢిల్లీ: అక్రమ రవాణా, వ్యాపారం వెనుక ఉన్న సూత్రధారులను అణిచివేసేందుకు ప్రపంచ దేశాల ప్రభుత్వాల సమన్వయం అవసరమని ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ పిలుపునిచ్చారు. చట్టవిరుద్ధ వ్యాపారం వెనుక ఉన్న ‘‘మాస్టర్ మైండ్స్’’ ను పట్టుకోవడంపై ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీల దృష్టి సారించాలని ఆమె పేర్కొన్నారు. ఆర్థిక వ్యవస్థతో పాటు పౌరుల ప్రయోజనాలను దెబ్బతీసే చట్టవిరుద్ధ కార్యకలాపాలకు నిరోధానికి విచారణా సంస్థల సమన్వయ చొరవలు అవసరమని ఆమె అన్నారు. అక్రమంగా రవాణా, లేదా చట్టవిరుద్ధ వ్యాపార స్వభావం గత 50 నుంచి 60 సంవత్సరాలుగా మారలేదని ఆమె ఈ సందర్భంగా పేర్కొన్నారు. విలువైన లోహాలు, మాదక ద్రవ్యాలు, అటవీ లేదా సముద్ర జీవుల అక్రమ రవాణా కొనసాగడం విచారకరమని అన్నారు. అక్రమ వ్యాపారం, స్మగ్లింగ్ ముప్పును అరికట్టడంలో సాంకేతికత కీలక పాత్ర పోషిస్తుందని కూడా ఆమె ఈ సందర్బంగా అన్నారు. సమాచారాన్ని ఇచి్చపుచ్చుకోవడంలో సాంకేతికత వినియోగం చాలా ప్రాధాన్యత కలిగిన అంశమని పేర్కొన్నారు. ‘‘ఎన్ఫోర్స్మెంట్ మేటర్స్ 2023’’ అన్న అంశంపై డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) ఇక్కడ నిర్వహించిన ఒక గ్లోబల్ కాన్ఫరెన్స్‌ను ఉద్ధేశించి ఆర్థికమంత్రి చేసిన ప్రారంభోపన్యాసంలో కొన్ని ముఖ్యాంశాలు.. ► చాలా వరకు అక్రమంగా వ్యాపారం చేసే వస్తువులు అలాగే ఉంటాయి. కస్టమ్స్ అధికారులు కంగుతినేంత స్థాయిలో కొత్త వస్తువుల అక్రమ రవాణా ఏదీ లేదు. దశాబ్ద కాలంగా ఇదే ధోరణి కొనసాగుతుందంటే... దీని వెనుక ఉన్న శక్తులు ఎవరో సమాజానికి తెలియాలి. ∙అక్రమ రవాణా సూత్రధారుల అణచివేతకు డబ్ల్యూసీఓ (ప్రపంచ కస్టమ్స్ ఆర్గనైజేషన్)తో పాటు ప్రభుత్వాల మధ్య సహకారానికి చాలా ముఖ్యం. తద్వారా అక్రమ రవాణా వెనుక ఉన్న సూత్రధారులను పట్టుకో గలుగుతాము. ► జప్తు చేసిన వస్తువులన్నింటినీ ధ్వంసం చేసి, మార్కెట్లోకి తీసుకురాకుండా అడ్డుకోగలిగితే, అక్రమ వ్యాపారాన్ని అరికట్టడం తేలికవుతుంది. ► అక్రమ రవాణా కార్యకలాపాలకు పాల్పడినవారికి శిక్ష తప్పదని, ఆయా చర్యల నిరోధం సాధ్యమేనని ప్రజల్లో విశ్వాసాన్ని పునరుద్ధరించడం మన కర్తవ్యం. ► బంగారం, సిగరెట్లు, మాదక ద్రవ్యాలు, పురాతన వస్తువులు, వన్యప్రాణి సంపద అక్రమ రవాణాలపై ప్రత్యేక నిఘా అవసరం. ఎందుకంటే ఇది ఆర్థిక వ్యవస్థలన్నింటినీ దెబ్బతీస్తుంది. ► దొంగిలించిన, అక్రమంగా తరలించిన పురాతన వస్తువులన్నింటినీ వాటికి సంబంధించిన స్వదేశాలకు తిరిగి అప్పగించాల్సిన అవసరం ఉంది. దీనికీ అంతర్జాతీయ సమన్వయం, సహకారం అవసరం. ► ఈ కార్యక్రమంలో డీఆర్ఐ ’ఆపరేషన్ శేష’ నాల్గవ దశను మంత్రి ప్రారంభించారు. ఈ ఆపరేషన్‌కు ప్రపంచ కస్టమ్స్ ఆర్గనైజేషన్ రీజినల్ ఇంటెలిజెన్స్ లైజన్ ఆఫీస్ (ఆర్ఐఎల్ఓ) ఆసియా పసిఫిక్, మిడిల్ ఈస్ట్‌ల సహకారం అందిస్తోంది. కలప అక్రమ వ్యాపారాన్ని అరికట్టేందుకు 2015లో తొలిసారిగా ఈ ఆపరేషన్ ప్రారంభించారు. అక్రమ రవాణా పెరుగుతోంది: సంజయ్ కుమార్ అగర్వాల్ పరోక్ష పన్నులు– కస్టమ్స్ సెంట్రల్ బోర్డ్ (సీబీఐసీ) చీఫ్ సంజయ్ కుమార్ అగర్వాల్ కార్యక్రమంలో మాట్లాడుతూ, ప్రపంచ వాణిజ్యం పరస్పరం అనుసంధానం కావడం, ఆర్థిక వ్యవస్థలు అభివృద్ధి వంటి అంశాల నేపథ్యంలో పురాతన వస్తువులు, సిగరెట్లు, బంగారం, అంతరించిపోతున్న వన్యప్రాణులసహా నిషేధిత వస్తువుల అక్రమ తరలింపు పెరుగుతోందన్నారు. మాదక ద్రవ్యాల అక్రమ వ్యాపారం తీవ్రంగా ఉందని పేర్కొన్నారు. గ్లోబల్ డ్రగ్ ట్రాఫికింగ్ విలువ దాదాపు 650 బిలియన్ డాలర్లని ఆయన పేర్కొన్నారు. మొత్తం అక్రమ ఆర్థిక వ్యాపార కార్యకలాపాల్లో ఈ వాటా దాదాపు 30 శాతమని తెలిపారు. ఇది తీవ్ర ప్రభావాలకు దారితీస్తోందని పేర్కొన్న ఆయన, మనీలాండరింగ్ తీవ్రవాద కార్యకలాపాల ఫైనాన్షింగ్ ఫైనాన్సింగ్‌కు ఇది దారితీస్తోందని, ఆయా అంశాలు జాతీయ భద్రతపై ప్రభావం చూపుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. దీని నిరోధానికి విచారణా సంస్థల మధ్య సన్నిహిత సమన్వయ చర్యలు అవసరమని పేర్కొన్నారు. రెవెన్యూ కార్యదర్శి సంజయ్ మల్హోత్రా మాట్లాడుతూ, స్మగ్లింగ్ ముప్పును ఎదుర్కోవాల్సిన అవసరం చాలా ముఖ్యమైనదని పేర్కొన్నారు. వ్యాపార వ్యయాలను తగ్గించి, పోటీతత్వాన్ని పెంచే సులభతర వాణిజ్య చర్యలను కూడా ఈ దిశలో చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు. -
'ఒకరోజు ఆగండి, మా పిల్లలు లేచి వస్తారు'
సాక్షి, మదనపల్లె: మూఢనమ్మకాలు, విపరీతమైన భక్తి భావాలతో యుక్తవయసులోని ఇద్దరు యువతులను తల్లిదండ్రులు అతికిరాతకంగా హత్యచేశారు. జాతీయ బాలికల దినోత్సవం రోజునే చోటుచేసుకున్న ఈ ఘటన చిత్తూరు జిల్లా మదనపల్లిలో ఆదివారం రాత్రి జరిగింది. పట్టణంలోని టీచర్స్ కాలనీ శివనగర్‌లో భార్యాభర్తలు వల్లూరుపల్లె పురుషోత్తం నాయుడు, పద్మజ ఉంటున్నారు. పురుషోత్తం నాయుడు ఉమెన్స్ డిగ్రీ కాలేజ్ వైస్ ప్రిన్సిపాల్ కాగా, పద్మజ మాస్టర్ మైండ్ స్కూల్ ప్రిన్సిపాల్. వీరికి అలేఖ్య (27), సాయిదివ్య (22) ఇద్దరు కుమార్తెలు. పద్మజకు విపరీతమైన భక్తి భావాలు, మూఢనమ్మకాలు ఉన్నాయి. చదవండి: (సోదరుడితో శారీక సంబంధం.. ప్రియుడి హత్య) కుటుంబ సభ్యులతో మాట్లాడుతున్న డిఎస్పీ ఈ నేపథ్యంలో.. ఆదివారం ఏకాదశి సందర్భంగా ఇంట్లో ప్రత్యేక పూజలు చేసేందుకు నిశ్చయించుకున్నారు. ఈ సందర్భంలో వ్యాయామానికి ఉపయోగించే డంబెల్స్ సహాయంతో తల్లిదండ్రులిద్దరూ తమ పిల్లలను కొట్టి అతికిరాతకంగా హత్యచేశారు. అనంతరం తల్లిదండ్రుల అరుపులు, కేకలతో విషయం వెలుగుచూసింది. దీంతో పోలీసులు తల్లిదండ్రులిద్దరినీ అదుపులోకి తీసుకున్నారు. ‘సత్యలోకం తిరిగి వస్తుంది. మా బిడ్డలను మేం తిరిగి బతికించుకుంటాం.. ఒకరోజు గడువు ఇవ్వండి, మా పిల్లలు లేచి వస్తారు’అని ఆ తల్లిదండ్రులిద్దరూ చెప్పినట్లు పోలీసులు తెలిపారు. చదవండి: (ప్రేమోన్మాది ఘాతుకం.. కత్తితో కర్కషంగా..) -
హీరోయిన్లు మాత్రమేనా? హీరోల మాటేమిటి?
(వెబ్ స్పెషల్): బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ అనుమానాస్పద మరణం ప్రాథమికంగా చిత్ర పరిశ్రమపై అనేక ప్రశ్నల్ని లేవనెత్తింది. మొదట సుశాంత్ ది ఆత్మహత్యగా మీడియాలో వార్తలు వ్యాపించినా, క్రమ క్రమంగా అనేక నీలినీడలు వెలుగు చూస్తూ వచ్చాయి. నెపోటిజం, పెద్దోళ్ల పెత్తనం, డ్రగ్ మాఫియా దాకా వరుసగా పలు కీలక మలుపులు చోటు చేసుకున్నాయి. గత మూడు నెలలుగా సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ సినిమా స్టోరీని తలపిస్తూ మీడియాలో సుశాంత్ సంబంధిత కథనాలు లేని రోజు లేదంటే అతిశయోక్తి కాదు. ప్రధానంగా సుశాంత్ స్నేహితురాలు, రియా చక్రవర్తి పేరు మారు మోగుతూ వచ్చింది. విచారణలో సీబీఐ, ఈడీ, ఎన్సీబీ ఎంట్రీ తరువాత కేసు స్వరూపమే మారిపోయింది. విచారణలో పలువురు బాలీవుడ్ స్టార్ల పేర్లు రియా వెల్లడించినట్లు సమాచారం. దీనిపై పార్లమెంటులో కూడా వాదోపవాదాలు జరిగాయంటే దీని తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. ప్రధానంగా సుశాంత్ ఆత్మహత్య కేసులో మొదటినుంచీ ఏదో ఒక విధమైన వాదం, వివాదంతో వార్తల్లో నిలిచిన బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ పరిశ్రమంలో నెపోటిజంపై గొంతెత్తారు. బాలీవుడ్ పెద్దలపై తనదైన శైలిలో విమర్శలు రేకెత్తించారు. తదనంతర పరిణామాల్లో సుశాంత్ స్నేహితురాలు అరెస్ట్ కావడంతో డ్రగ్స్ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. దీంతో కంగన మరోసారి బాలీవుడ్ హీరోలపై సంచలన వ్యాఖ్యలే చేశారు. డర్టీ సీక్రెట్స్ అంటూ ట్వీట్ల దుమారం రేపారు. బాలీవుడ్ హీరోలు రణబీర్ కపూర్, రణవీర్ సింగ్, విక్కీ కౌశల్ వంటి వారు డ్రగ్స్ తీసుకోలేదని ప్రకటించాలని కంగనా డిమాండ్ చేయడం విశేషం. అంతేకాదు తాను డ్రగ్స్ తీసుకున్నట్టు నిరూపిస్తే.. ముంబై విడిచిపోతానని ప్రగల్భాలు పోయినా, తాను మత్తుమందులకు బానిసనంటూ గతంలో వాపోయిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ కావడంతో కంగన మౌనాన్ని ఆశ్రయించక తప్పలేదు. బాలీవుడ్ లో దాదాపు 99 శాతం మంది డ్రగ్స్ ని నీళ్లలాగే వాడేస్తున్నారన్న కంగనా వ్యాఖ్యలు సృష్టించిన దుమారం దాదాపు అన్ని వుడ్ లను చుట్టేస్తోంది. మాదకద్రవ్యాల మాఫియాతో 20 మంది కన్నడ నటీ నటులకు లింకులున్నాయని బెంగళూరు పోలీసులే నిర్ధారించారు. ఇక 2017లో టాలీవుడ్ డ్రగ్స్ వ్యవహారం రేపిన సంచలనాన్ని ఎలా మర్చిపోగలం. తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన పూరీ జగన్నాథ్, రవితేజ, ఛార్మీ సుబ్బరాజు, నవదీప్, తరుణ్, మొమైత్ ఖాన్ తదితరులు విచారణకు హాజరైన వారేకదా. ఈ సందర్భంగా నటి మాధవీలత తెలంగాణ నార్కోటిక్స్ కంట్రోల్ బోర్డునుద్దేశించి చేసిన విజ్ఞప్తిని ప్రస్తావించుకోవాలి. తెలుగు సినీ పరిశ్రమలో డ్రగ్స్ లేని పార్టీలు లేవనీ, కాలేజీ విద్యార్థులపై నిఘా పెట్టాలని ఆమె కోరారు. బాలీవుడ్, టాలీవుడ్ శాండిల్‌వుడ్ లను డ్రగ్స్ దుమారం గతంలో పట్టి కుదిపేయలేదా? డ్రగ్స్ మాఫియా పరిశ్రమను ఏలుతోందనేది ఎప్పటినుంచో ఉన్న ఆరోపణే. అయితే ఎవరో ఒకరో ఇద్దరో చేసిన పనికి అందరిపైనా విమర్శలు సరికాదంటూ ఇండస్ట్రీ పెద్దలు సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. బాలీవుడ్ డ్రగ్స్ మాఫియాకు అంతర్జాతీయ స్థాయిలో లింకులు ఉన్నాయని, ఈ మేరకు దర్యాప్తు సంస్థ ఎన్సీబీ (నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో)కి ఆధారాలు డ్రగ్ మాఫియా కోరల ప్రభావాన్ని చెప్పకనే చెబుతున్నాయి. విలాసంగా, సరదాగా గంజాయి నుంచి మొదలైన గమ్మత్తైన మత్తునుంచి అతిప్రమాదకరమైన డ్రగ్స్ వైపునకు మళ్లుతున్నారు. ప్రపంచంలోని అత్యంత ఖరీదైన డ్రగ్స్ హెరాయిన్, కొకైన్, ఎల్ఎస్డీ, డీవోబీ, వీడ్ (గంజాయి) లాంటివి ఇపుడు కాలేజీ విద్యార్థులకు సైతం కాలేజీ క్యాంటీన్లు, హాస్టళ్లలో దొడ్డిదారిన సులువుగా దొరుకుతున్నాయనేది జగమెరిగిన సత్యం. దేశంలోని మెట్రో నగరాల్లో రేవ్ పార్టీలు, పబ్ కల్చర్, రేసింగులు, బెట్టింగులు లాంటి అతి వినాశకరమైన సంస్కృతిని పెంచి పోషిస్తోందీ డ్రగ్ మాఫియా. శ్రీలంక, దక్షిణాఫ్రికా, నైజీరియాదేశాల మాస్టర్ మైండ్స్ అండతో అంతర్జాతీయ స్థాయిలో మాదక ద్రవ్యాల వ్యాపార లింకులు వెలుగులోకి వస్తున్నాయి. ఈ నెల సెప్టెంబర్1న 970 గ్రాముల హెరాయిన్ పార్శిల్ ను స్వాధీనం చేసుకున్న అధికారులు డిజిటల్ ఫోరెన్సిక్ విశ్లేషణల ఆధారంగా అంతర్జాతీయ ముఠాను ఛేదించారు. ఎన్సీబీ విడుదల చేసిన తాజా ప్రకటన ప్రకారం, మొత్తం భారతదేశం అంతా ఒక సిండికేట్‌గా దందా నిర్వహిస్తున్నారు. ఇండో-నైజీరియన్ డ్రగ్ సిండికేట్ ఫ్రాంక్ ప్రధాన సూత్రధారిగా విదేశాల్లో ఉంటూనే దేశ రాజధాని నగరం డిల్లీ కేంద్రంగా మొత్తం సిండికేట్‌ను నిర్వహిస్తున్నాడు. నకిలీ, చట్టవిరుద్ధ గుర్తింపు కార్డులే వీరి మోడెస్ ఒపరాండీ. డ్రగ్స్ కేసు, బాలీవుడ్ స్టార్ల ప్రమేయం డ్రగ్స్ కోణం నుంచి దర్యాప్తులో రియా, ఆమె సోదరుడు షోవిక్ చక్రవర్తి, శామ్యూల్ మిరండా, దీపేష్ సావంత్, మరికొంతమంది డ్రగ్ వ్యాపారులను ఇప్పటికే అరెస్టు చేసింది. ముఖ్యంగా ఈ కేసులో డ్రగ్స్ కోణం వెలుగులోకి వచ్చిన గతకొన్ని రోజులుగా కేవలం బాలీవుడ్ హీరోయిన్ల పేర్లు మాత్రమే ఎందుకు వెలుగులోకి వస్తున్నాయి. తెలుగులో స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్, తాజాగా అగ్రహీరో మహేష్ భార్య నమ్రతా శిరోద్కర్, బాలీవుడ్లో సారా అలీఖాన్, దీపికా పదుకోన్, దియా మీర్జా, శ్రద్ధా కపూర్ లాంటి వారి పేర్లు బయటికి రావడం పెద్ద సెన్సేషన్‌గా మారింది. అటు హీరోయిన్లు స్లిమ్‌గా మారేందుకు డ్రగ్స్‌ను ఆశ్రయిస్తున్నారనే వాదన తెరపైకి వచ్చింది. తాజా పరిణామం అనంతరం బాలీవుడ్ సూపర్ హీరోలపై ఆసక్తికర చర్చకు దారితీసింది. మొత్తం దేశీయ సినీ పరిశ్రమలోగానీ, బాలీవుడ్ హీరోల్లో గానీ డ్రగ్స్ వాడేవారే లేరా? మత్తు మందులు, ధూమపానం లాంటి చెడు అలవాట్లుకు బానిసలైన హీరోలు లేరా? వారికి నేరచరిత్ర ఆరోపణలు లేవా? డ్రగ్ మాఫియా లింకులు లేవా? లాంటి ప్రశ్నలు వెల్లువెత్తున్నాయి. ఇది ఇలా ఉంటే అటు రియా ద్వారాగానీ, ఇటు టాలెంట్ మేనేజర్ జయా సాహా ద్వారా ఇంకెంతమంది గుట్టు రట్టు కానుందనేది మాత్రం ప్రస్తుతానికి సస్పెన్స్. ఏది ఏమైనా సుశాంత్ ఆత్మహత్య తరువాత జస్టిస్ ఫర్ సుశాంత్ అనేది పక్కకుపోయింది. ఉన్నదల్లా ఆరోపణలు.. ప్రత్యారోపణలు..సవాళ్లు.. ప్రతి సవాళ్లు... ట్విస్ట్ అండ్ టర్న్స్. ఒక అనుమానాస్పద మరణం కేసులో ఇన్ని రాజకీయ, నాటకీయ పరిణామాలు, సంచలన ట్విస్టులు బహుశా ఇదే మొదటి సారి. (సుశాంత్ డ్రగ్స్ కోసం మమ్మల్ని వాడుకున్నాడు) -
ఐసీడబ్ల్యూఏలో మెరిసిన తెలుగు తేజాలు
- ఆలిండియా స్థాయిలో ప్రథమ, ద్వితీయసహా పలు ర్యాంకులు - ఇప్పటి వరకూ 50 ఆలిండియా ఫస్ట్ ర్యాంకులతో ‘సూపర్‌విజ్’ రికార్డు విజయవాడ(లబ్బీపేట): ది ఇనిస్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా బుధవారం విడుదల చేసిన ఐసీడబ్ల్యూఏ(సీఎంఏ) ఫైనల్ ఫలితాల్లో తెలుగు విద్యార్థులు సత్తా చాటారు. కృష్ణాజిల్లా నందిగామకు చెందిన ఉడతా వెంకటసాయికిరణ్ ఆలిండియా స్థాయిలో ప్రథమ ర్యాంక్ సాధించగా, వైఎస్సార్ జిల్లా రాయచోటికి చెందిన మసాల వెంకట సాయిచరణ్ ద్వితీయ ర్యాంకుతో మెరిశాడు. రాయదుర్గానికి చెందిన ఎట్టాకుల వాసవీప్రియ నాలుగో ర్యాంక్, విజయవాడ మొగల్రాజపురానికి చెందిన వావిలాల అనూష ఐదో ర్యాంక్, తాండూర్‌కు చెందిన తిరుపతి ధరణి ఏడో ర్యాంక్ సాధించి సత్తా చాటారు. వీరంతా విజయవాడలోని సూపర్‌విజ్‌లో శిక్షణ పొందినవారే. ర్యాంకులు సాధించిన విద్యార్థులకు సూపర్‌విజ్ ప్రిన్సిపాల్ సబ్బినేని వెంకటేశ్వరరావు అభినందనలు తెలిపారు. ఈ ఫలితాల్లో తమ విద్యార్థులు 50లోపు 14 ర్యాంకులు సాధించినట్లు ఆయన తెలిపారు. వినూత్న కోచింగ్ విధానంతో ఎందరో విద్యార్థుల్ని అఖిల భారత స్థాయిలో ర్యాంకర్లుగా తీర్చిదిద్దామని చెప్పారు. సూపర్‌విజ్ సంస్థ బుధవారం సాధించిన ఐసీడబ్ల్యూఏ ఫైనల్ ఫస్ట్ ర్యాంక్‌తో ఇప్పటివరకూ కామర్స్ కోర్సుల్లో ఆలిండియా ఫస్ట్ర్యాంకులు 50 సాధించినట్లు ఆయన తెలిపారు. దేశంలోని ఏ సంస్థకు ఇన్ని ఆలిండియా ఫస్ట్ ర్యాంకులు రాలేదని, ఇదొక రికార్డని పేర్కొన్నారు. ఆలిండియా ఫస్ట్ ర్యాంకులు 50 సాధించడాన్ని పురస్కరించుకుని 2017 ఫిబ్రవరి నుంచి ప్రారంభమయ్యే సీఏ ఫైనల్ కోర్సుకు ఉచిత కోచింగ్ ఇవ్వనున్నట్లు తెలిపారు. మాస్టర్‌మైండ్స్ విజయదుందుభి.. గుంటూరు ఈస్ట్: 2016 జూన్‌లో నిర్వహించిన సీఎంఏ ఇంటర్, సీఎంఏ ఫైనల్ పరీక్షా ఫలితాల్లో మాస్టర్‌మైండ్స్ విద్యార్థులు విజయదుందుభి మోగించారని సంస్థ డెరైక్టర్ మట్టుపల్లి ప్రకాష్ తెలిపారు. గుంటూరు బ్రాడీపేట 4/12లోని సరస్వతి క్యాంపస్‌లో ఆయన బుధవారం మాట్లాడుతూ ఐసీఏఐ పరీక్షా ఫలితాలు విడుదలయ్యాయని, ఇంటర్లో మొత్తం 50 ర్యాంకులకుగాను మాస్టర్‌మైండ్స్ విద్యార్థులు 44 ర్యాంకులు సాధించి సత్తా చాటారని తెలిపారు. 40 ర్యాంకులు సాధించడం ఇది మూడోసారన్నారు. సీఎంఏ ఫైనల్లో తమ విద్యార్థులు 13 ర్యాంకులు సాధించారన్నారు. సంస్థ పాఠ్యప్రణాళిక, ఉపాధ్యాయులు, విద్యార్థుల సమష్టి కృషివల్లే ర్యాంకులు సాధించామన్నారు. సంతోషంగా ఉంది... సీఏ ఫైనల్ పూర్తవడంతో ఇప్పటికే లుపిన్ కంపెనీలో రూ.9 లక్షల వార్షిక వేతనంతో ఉద్యోగం చేస్తున్నా. ఐసీడబ్ల్యూఏలో ఆలిండి యా ఫస్ట్‌ర్యాంక్ రావడం చాలా సంతోషంగా ఉంది. ఫౌండేషన్‌లోనూ ఫస్ట్ ర్యాంక్ సాధించా. నా తల్లిదండ్రులు చిల్లర దుకాణం నిర్వహిస్తూ కష్టమంటే ఏమిటో తెలియకుండా నన్ను చదివించారు. వారి కష్టానికి ప్రతిఫలంగా ర్యాంక్ సాధించా. అందుకు సూపర్‌విజ్ టెక్నిక్స్ ఎంతగానో దోహదం చేశాయి. - వెంకటసాయికిరణ్, ఆలిండియా ఫస్ట్ ర్యాంకర్ పారిశ్రామికవేత్తనవుతా మంచి ఇండస్ట్రియలిస్టుగా ఎదగాలనేది నాలక్ష్యం. ప్రస్తు తం ఐసీడబ్ల్యూఏ ఆలిండి యా రెండో ర్యాంక్ సాధిం చా. ఈ ఏడాది నవంబర్‌లో సీఏ ఫైనల్స్‌కు హాజరవుతా. అనంతరం మంచి కంపెనీలో కొద్దికాలం ఉద్యోగం చేస్తా. నా తల్లిదండ్రుల ఆర్థిక ఇబ్బందులు తీరాక ఎంబీఏ చేసి మంచి కంపెనీ స్థాపించి ఇండస్ట్రియలిస్టుగా ఎదగాలనేది కోరిక. ఆ లక్ష్యం నెరవేరేవరకూ కృషిచేస్తా. - మసాల వెంకటసాయిచరణ్ ఆలిండియా రెండో ర్యాంకర్