హత్యకు గురైన సాయిదివ్య, అలేఖ్య (ఫైల్ ఫొటో)
సాక్షి, మదనపల్లె: మూఢనమ్మకాలు, విపరీతమైన భక్తి భావాలతో యుక్తవయసులోని ఇద్దరు యువతులను తల్లిదండ్రులు అతికిరాతకంగా హత్యచేశారు. జాతీయ బాలికల దినోత్సవం రోజునే చోటుచేసుకున్న ఈ ఘటన చిత్తూరు జిల్లా మదనపల్లిలో ఆదివారం రాత్రి జరిగింది. పట్టణంలోని టీచర్స్ కాలనీ శివనగర్‌లో భార్యాభర్తలు వల్లూరుపల్లె పురుషోత్తం నాయుడు, పద్మజ ఉంటున్నారు. పురుషోత్తం నాయుడు ఉమెన్స్ డిగ్రీ కాలేజ్ వైస్ ప్రిన్సిపాల్ కాగా, పద్మజ మాస్టర్ మైండ్ స్కూల్ ప్రిన్సిపాల్. వీరికి అలేఖ్య (27), సాయిదివ్య (22) ఇద్దరు కుమార్తెలు. పద్మజకు విపరీతమైన భక్తి భావాలు, మూఢనమ్మకాలు ఉన్నాయి. చదవండి: (సోదరుడితో శారీక సంబంధం.. ప్రియుడి హత్య)
కుటుంబ సభ్యులతో మాట్లాడుతున్న డిఎస్పీ
ఈ నేపథ్యంలో.. ఆదివారం ఏకాదశి సందర్భంగా ఇంట్లో ప్రత్యేక పూజలు చేసేందుకు నిశ్చయించుకున్నారు. ఈ సందర్భంలో వ్యాయామానికి ఉపయోగించే డంబెల్స్ సహాయంతో తల్లిదండ్రులిద్దరూ తమ పిల్లలను కొట్టి అతికిరాతకంగా హత్యచేశారు. అనంతరం తల్లిదండ్రుల అరుపులు, కేకలతో విషయం వెలుగుచూసింది. దీంతో పోలీసులు తల్లిదండ్రులిద్దరినీ అదుపులోకి తీసుకున్నారు. ‘సత్యలోకం తిరిగి వస్తుంది. మా బిడ్డలను మేం తిరిగి బతికించుకుంటాం.. ఒకరోజు గడువు ఇవ్వండి, మా పిల్లలు లేచి వస్తారు’అని ఆ తల్లిదండ్రులిద్దరూ చెప్పినట్లు పోలీసులు తెలిపారు. చదవండి: (ప్రేమోన్మాది ఘాతుకం.. కత్తితో కర్కషంగా..)
Comments
Please login to add a commentAdd a comment