
ట్యాంకర్ నుంచి అమ్మోనియం లీక్ : ఆరుగురు మృతి
లూథియానా: లూథియానా జిల్లాలో దోర్హా బైపాస్ రహదారి వద్ద ఫ్లైఓవర్ కింద అమ్మోనియం ట్యాంకర్ ఇరుక్కుపోయింది. దీంతో ట్యాంకర్ నుంచి అమ్మోనియం గ్యాస్ లీకైంది. గ్యాస్ పీల్చిన స్థానికుల్లో ఆరుగురు అక్కడికక్కడే మరణించారు. మరో 100 మంది తీవ్రంగా ఆస్వస్థతకు గురైయ్యారు. పోలీసులు వెంటనే స్పందించింది వైద్య సిబ్బంది సహాయంతో జిల్లాలోని వివిధ ఆసుపత్రులకు హుటాహుటిన తరలించారు. ఆస్వస్థతకు గురైన వారంతా శ్వాస పీల్చుకోవడం ఇబ్బందిగా మారిందని చెబుతున్నారని పోలీసు ఉన్నతాధికారి వెల్లడించారు.
మృతులను గుర్తించవలసి ఉందన్నారు. గుజరాత్కు చెందిన ట్యాంకర్ లూథియానా వైపు వస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుందని తెలిపారు. ఈ ఘటనపై సమాచారం అందిన వెంటనే జిల్లాకు చెందిన ఉన్నతాధికారులు ఘటన స్థలికి చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారని చెప్పారు. అలాగే ట్యాంకర్ నుంచి అమ్మోనియం వాయివు వెలువడకుండా చర్యలు చేపట్టారని పోలీసులు తెలిపారు.