
నలుగురు నాలుగు కత్తులతో వచ్చి..
లూథియానా: పంజాబ్ లో దారుణం చోటుచేసుకుంది. పొద్దున్నే తన షాపు తెరుచుకుని కూర్చున్న వ్యక్తిపై నలుగురు దుండగులు కత్తులతో దాడులు చేశారు. పదేపదే తలపై, కాళ్లపై కత్తులతో నరకడంతో అతడు ప్రస్తుతం అతడు ఆస్పత్రి పాలయ్యాడు. ఇదంతా కూడా అతడి దుకాణంలో పెట్టిన సీసీటీవీ కెమెరాలో రికార్డయింది. పూర్తి వివరాల్లోకి వెళితే గురప్రీత్ సింగ్ అనే చిన్న వ్యాపారస్తుడు లూథియానాలో బ్రోకర్ గా పనిచేస్తున్నాడు. ఆదివారం ఉదయాన్నే తన షాపు తీశాడు.
అలా అతడు తీసి ఒక 20 నిమిషాలు అయిందో లేదో వెంటనే ఓ నలుగురు వేగంగా కత్తులు తీసుకొని వచ్చారు. కౌంటర్ లో కూర్చున్న అతడిపై నలుగురు ఒకేసారి పదేపదే దాడి చేశారు. పదే పదే నరికేసి పారిపోయారు. అనంతరం అతడిని ఆస్పత్రిలో చేర్పించారు. గుర్ ప్రీత్ తలకు బలమైన గాయాలు అయ్యాయి. అయితే, అతంతకు ముందు అతడి కారు ఎవరో వ్యక్తిని ఢీకొట్టిందని, ఆ వ్యక్తికి సంబంధించిన వాళ్లే వచ్చి దాడి చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.