
సాక్షి, న్యూఢిల్లీ : పంజాబ్‌లోని లుథియానా సెంట్రల్ జైల్లో పోలీసులకు, ఖైదీలకు మధ్య జరిగిన ఘర్షణలో నలుగురు పోలీసులు, ఆరుగురు ఖైదీలు గాయపడ్డారు. సెంట్రల్ జైలు నుంచి నలుగురు ఖైదీలు పారిపోయేందుకు ప్రయత్నించారు. వారిని గమనించిన జైలు అధికారులు పోలీసులు బలగాలను మోహరించారు. ఈ క్రమంలో పోలీసులకు, నలుగురు ఖైదీలను మధ్య ఘర్షణ జరిగింది. ఈ సందర్భంగా పోలీసులు గాల్లో కాల్పులు జరిపారు. పారిపోయేందుకు ప్రయత్నించిన ఖైదీలతో పాటు జైల్లో ఉనన్న మరికొంత మంది ఖైదీలు పోలీసులపై ఘర్షణకు దిగడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. అయితే పోలీసులు బలగాలు పరిస్థితిని మొత్తం అదుపులోని తీసుకొని ఖైదీలను పట్టుకున్నారు. పారిపోయేందుకు ప్రయత్నించిన ఖైదీలను తిరిగి తీసుకొచ్చి జైలుకు తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment