న్యూఢిల్లీ: పంజాబ్‌లోని లూథియానా కేంద్రంగా పనిచేస్తున్న అంతర్జాతీయ డ్రగ్స్ సిండికేట్ గుట్టురట్టు చేసినట్లు నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో(ఎన్‌సీబీ) సోమవారం పేర్కొంది. ఇద్దరు అఫ్గాన్లు సహా 16 మందిని అదుపులోకి తీసుకోవడంతోపాటు 60 కిలోల డ్రగ్స్, 31 తూటాలను స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొంది.
‘‘ఈ ముఠాకు గతేడాది ఢిల్లీలోని షహీన్‌బాగ్, యూపీలోని ముజఫర్‌నగర్‌ల్లో పట్టుబడిన డ్రగ్స్‌తో సంబంధముంది. అఫ్గానిస్తాన్, పాకిస్తాన్‌లతోపాటు దేశంలోని వివిధ రాష్ట్రాల్లో నెట్‌వర్క్ ఉంది’’ అని ఎన్‌సీబీ డిప్యూటీ డీజీ జ్ఞానేశ్వర్ సింగ్ చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment