
కేజ్రీవాల్ కోసం 300 కిలోమీటర్ల పాదయాత్ర
న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) అధినేత అరవింద్ కేజ్రీవాల్ కు మద్దతుగా నలుగురు ఆప్ వాలంటీర్లు ఆదివారం పాదయాత్ర చేపట్టారు. 300 కిలోమీటర్లు పైగా వీరు పాదయాత్ర చేయనున్నారు. సుఖ్ దేవ్ సింగ్, ఉదయభాను, అబ్దుల్ ఖాన్, ప్రిన్స్ మాసిహ్ పంజాబ్ లోని లుథియానా నుంచి ఢిల్లీకి పాదయాత్రగా బయలుదేరారు.
లుథియానా టాప్ కన్వీనర్ అహబాబ్ సింగ్ గ్రెవాల్ జెండా ఊపి పాదయాత్రను ప్రారంభించారు. అంతముందు నలుగురు వాలంటీర్లు భగత్ సింగ్, సుఖ్ దేవ్, రాజగురులకు నివాళులర్పించారు.