padyatra
-
గాంధీ మార్గంలో ప్రచారం.. భేష్ అంటున్న జనం!
దేశంలో లోక్‌సభ ఎన్నికలు జరుగుతున్నాయి. ఓటింగ్ జరగని స్థానాల్లో ఎన్నికల ప్రచారం జోరుగా కొనసాగుతోంది. నాయకులు వివిధ రకాలుగా ప్రచారాలు చేస్తున్నారు. అయితే గుజరాత్‌లోని పోర్బందర్ లోక్‌సభ స్థానం నుండి ఎన్నికల బరిలోకి దిగిన బీజేపీ అభ్యర్థి, కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవియా ప్రత్యేక రీతిలో ప్రచారం సాగిస్తున్నారు. పోర్బందర్.. జాతిపిత మహాత్మా గాంధీ జన్మస్థలం. అందుకే మన్సుఖ్ మాండవియా.. మహాత్మాగాంధీని స్పూర్తిగా తీసుకుని ఎన్నికల ప్రచారంలో ఇంటింటికీ తిరుగుతూ ప్రజలను ఓట్లు అడుగుతున్నారు.మన్సుఖ్ మాండవియా గ్రామ గ్రామాన పాదయాత్ర చేస్తూ రోడ్ షోలకు దూరంగా ఉంటున్నారు. ఈ పాత విధానంలో ప్రచారానికి కారణమేమిటని విలేకరులు అడగగా, ఆయన తాను పోర్బందర్ నుంచి ఎన్నికల్లో పోటీ చేస్తున్నానని, అందుకే మహాత్మాగాంధీ పాదయాత్రలు చేపట్టిన మాదిరిగా ప్రచారం కొనసాగిస్తున్నానని అన్నారు.తన ఎన్నికల పాదయాత్ర ప్రచారానికి ప్రజల నుంచి అనూహ్య మద్దతు వస్తున్నదని ఆయన తెలిపారు. కాలినడకన ఇంటింటికీ ప్రచారం చేయడం వల్ల ఎన్నికల ఖర్చు కూడా తగ్గిందని ఆయన పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో అనవసర ఖర్చులు తగ్గించాలని అన్నారు. బహిరంగ సభ నిర్వహిస్తే, వేడి వాతావరణంలో జనం కూర్చోలేరని, అందుకే ఇంటింటికీ ప్రచారం చేయాలని నిర్ణయించుకున్నానని అన్నారు. కాగా పోర్బందర్ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి లలిత్ వసోయాపై మాండవ్య పోటీ చేస్తున్నారు. గుజరాత్‌లోని 25 లోక్‌సభ స్థానాలకు మే 7న ఒకే దశలో ఎన్నికలు జరగనున్నాయి. -
Bharat Nyay Yatra: రాహుల్ గాంధీ ‘భారత్ న్యాయ యాత్ర’
సాక్షి, న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ మరో సుదీర్ఘయాత్రకు సన్నద్ధమవుతున్నారు. వచ్చే ఏడాది జరుగనున్న సార్వత్రిక ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పార్టీ నూతన జవసత్వాలు అందించే దిశగా రెండో విడత యాత్రకు శ్రీకారం చుట్టబోతున్నారు. ‘భారత్ న్యాయ యాత్ర’ పేరిట తూర్పున మణిపూర్ నుంచి పశ్చిమాన మహారాష్ట్ర వరకు పాదయాత్ర జరుగనుందని కాంగ్రెస్ వర్గాలు బుధవారం వెల్లడించాయి. వచ్చే ఏడాది జనవరి 14న మణిపూర్ రాజధాని ఇంఫాల్‌లో ప్రారంభం కానున్న ఈ యాత్ర 67 రోజుల పాటు కొనసాగి, మార్చి 20వ తేదీన మహారాష్ట్ర రాజధాని ముంబైలో ముగుస్తుంది. దేశ ప్రజలకు ఆర్థిక, సామాజిక, రాజకీయ న్యాయాన్ని అందించడమే ధ్యేయంగా రాహుల్ గాంధీ భారత్ న్యాయ యాత్ర చేపట్టనున్నట్లు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరామ్ రమేశ్ తెలిపారు. ఈ యాత్రను ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఇంఫాల్‌లో జెండా ఊపి ప్రారంభిస్తారు. ఈ మేరకు కాంగ్రెస్ అధిష్టానం షెడ్యూల్ ఖరారు చేసింది. రెండో విడత యాత్ర చేపట్టాలని రాహుల్ గాం«దీని కోరుతూ కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ఈ నెల 21న ఏకగ్రీవంగా తీర్మానం ఆమోదించిన సంగతి తెలిసిందే. చాలావరకు బస్సు యాత్ర.. అవసరమైన చోట పాదయాత్ర రాహుల్ గాంధీ తన తొలి విడత భారత్ జోడో యాత్రను 2022 సెపె్టంబర్ 7న తమిళనాడులోని కన్యాకుమారిలో ప్రారంభించారు. 12 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాల గుండా 136 రోజులపాటు 3,970 కిలోమీటర్లు మేర పాదయాత్ర చేశారు. ఈ ఏడాది జనవరి 30న జమ్మూకశ్మీర్‌లోని శ్రీనగర్‌లో యాత్ర ముగిసింది. మొదటి యాత్రకు కొంత భిన్నంగా చాలావరకు బస్సు ద్వారా భారత్ న్యాయ యాత్ర చేపట్టనున్నప్పటికీ, అవసరమైన చోట పాదయాత్ర సైతం ఉంటుందని ఏఐసీసీ వర్గాలు వెల్లడించాయి. ఈ యాత్ర 14 రాష్ట్రాల్లోని 85 జిల్లాల మీదుగా మొత్తం 6,200 కిలోమీటర్ల మేర సాగనుంది. మణిపూర్‌లో ప్రారంభమై నాగాలాండ్, అస్సాం, మేఘాలయా, పశ్చిమ బెంగాల్, బిహార్, జార్ఖండ్, ఒడిశా, ఛత్తీస్‌గఢ్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్తాన్, గుజరాత్ రాష్ట్రాల మీదుగా కొనసాగి మహారాష్ట్రలో ముగియనుంది. భారత్ జోడోయాత్ర 136 రోజులపాటు 3,970 కిలోమీటర్లు జరిగింది. భారత్ న్యాయ యాత్ర 67 రోజుల్లోనే 6,200 కిలోమీటర్లు సాగనుంది. ఈశాన్య రాష్ట్రాల ప్రజల గాయాలు మాన్పాలన్నదే ఆకాంక్ష ఇటీవల నెలల తరబడి హింసాత్మక సంఘటనలు చోటుచేసుకుంటున్న మణిపూర్ నుంచి యాత్రను ప్రారంభిస్తుండడం ప్రాధాన్యం సంతరించుకుంది. బాధితులకు తమ పార్టీ అండగా ఉంటుందన్న సందేశాన్ని ప్రజలకు చేరవేయడమే కాంగ్రెస్ పెద్దల ఉద్దేశమని తెలుస్తోంది. ఈశాన్య రాష్ట్రాల ప్రజల గాయాలను మాన్పాలన్నదే తమ ఆకాంక్ష అని కాంగ్రెస్ అగ్రనేత కె.సి.వేణుగోపాల్ వివరించారు. యాత్ర సందర్భంగా 12 బహిరంగ సభల్లో రాహుల్ ప్రసంగిస్తారు. 100కుపైగా స్ట్రీట్–కార్నర్ సమావేశాలు ఉంటాయి. 13 ప్రెస్ కాన్ఫరెన్స్‌లు సైతం నిర్వహిస్తారు. మహిళలు, యువతతోపాటు అణగారిన వర్గాల ప్రజలతో ముఖాముఖి భేటీ అవుతారు. పార్టీ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ఈ నెల 28న మహారాష్ట్రలోని నాగపూర్‌లో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్లు జైరామ్ రమేశ్ తెలిపారు. ఈ సభకు హమ్ తయ్యార్ హూ(మేము సిద్ధంగా ఉన్నాం) అని నామకరణం చేసినట్లు పేర్కొన్నారు. -
ప్రశాంత్ కిషోర్ 3,500 కిలోమీటర్ల పాదయాత్ర.. అదే లక్ష్యం!
పాట్నా: రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ 3,500 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేపట్టనున్నారు. ‘జన్ సురాజ్’ ప్రచారంలో భాగంగా మహాత్మాగాంధీ జయంతి రోజున తూర్పు చంపారన్ జిల్లా నుంచి ఆదివారం పాదయాత్ర ప్రారంభించనున్నారు. ప్రస్తుతం బిహార్‌లో సాగనున్న ఈ పాదయాత్ర.. దేశంలోని వివిధ ప్రాంతాలకూ విస్తరించనున్నారని, సుమారు 12-18 నెలల పాటు సాగనుందని పార్టీ వర్గాలు తెలిపాయి. క్రియాశీల రాజకీయాల్లోకి అడుగుపెట్టాలని భావిస్తున్న ప్రశాంత్ కిషోర్‌కు ఈ యాత్ర సన్నాహంగా మారనుందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. పాదయాత్రలో భాగంగా ప్రతి పంచాయతీ, బ్లాక్‌లను సందర్శించనున్నారు ప్రశాంత్ కిషోర్. ఎలాంటి బ్రేక్ లేకుండా యాత్రను కొనసాగించేలా ప్రణాళికలు రచించినట్లు పార్టీ తెలిపింది. తూర్పు చంపారన్‌లోని గాంధీ ఆశ్రమం భిటిహర్వా నుంచి పాదయాత్రను ప్రారంభించనున్నారు ప్రశాంత్ కిషోర్. అక్కడి నుంచే 1917లో మహాత్ముడు తొలి సత్యాగ్రహ ఉద్యమాన్ని ప్రారంభించారు. ఈ యాత్రను ముఖ్యంగా మూడు లక్ష్యాలతో చేపడుతున్నట్లు పార్టీ తెలిపింది. అందులో క్షేత్రస్థాయిలో సరైన వ్యక్తులను గుర్తించటం, వారిని ప్రజాస్వామ్య వ్యవస్థలోకి తీసుకురావటం, వివిధ రంగాల్లోని నిపుణుల ఆలోచనలను అమలు చేసేలా ప్రణాళికలు సిద్ధం చేయటం వంటివి ఉన్నాయి. ఇదీ చదవండి: కాంగ్రెస్ కార్యకర్తపై పోలీసుల దాడి.. ఆర్టికల్ 19 ప్రకారం స్వేచ్చ ఇదేనా అంటూ.. -
రైతుల పాదయాత్ర కాదు.. టీడీపీ రాజకీయ యాత్ర
-
‘ఆయన’ తిరిగొచ్చారు
భోపాల్ : ఆయన తిరిగొచ్చారు. ఆరు నెలల క్రితం ‘నర్మద పాదయాత్ర’ పేరిట ఆయన చేపట్టిన రాజకీయేతర యాత్ర సోమవారం నాడు ముగిసింది. ఆయన తన యాత్రను రాజకీయేతర యాత్రగా అభివర్ణించుకున్నప్పటికీ అందులో రాజకీయం లేకపోలేదు. ప్రజలతో పోయిన సంబంధాలను పునరుద్ధరించుకునేందుకు, పార్టీలో పోయిన పరువును తిరిగి తెచ్చుకునేందుకు ఆయన ఈ యాత్రను చేపట్టారు. ప్రతిపక్షాలనే కాకుండా స్వపక్షాన్ని కూడా ఉన్నది ఉన్నట్లు మాట్లాడి ఇబ్బందిపెట్టే తత్వం ఆయనది. అలా అని బోలా మనిషి కాదు. కనిపించని కపట నాయకుడు. దివంగత కాంగ్రెస్ నేత అర్జున్ సింగ్ శిశ్యరికంలో రాజకీయంగా ఎదిగిన వారు. ఆయనే దిగ్విజయ్ సింగ్. స్వరాష్ట్రమైన మధ్యప్రదేశ్‌లో ఆరు నెలల తన యాత్రను దిగ్విజయంగా పూర్తి చేసుకొని ఇంటికి తిరిగొచ్చారు. ‘నేను ఇదివరకటిలా రాజకీయ కార్యకర్తను కాను. ఇప్పుడు పరిపాలనాదక్షుడిన’ ని మీడియా ముందు చెబుతూ ఎన్నికలు జరుగనున్న మధ్యప్రదేశ్ రాష్ట్రంలో సీఎం అభ్యర్థిత్వాన్ని ఆశిస్తున్నట్లు చెప్పకనే చెప్పారు. తాను పార్టీలో ఏ బాధ్యతలు నిర్వహించాలో పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీయే నిర్ణయిస్తారని లౌక్యం ప్రదర్శించారు. ముఖ్యమంత్రి పదవి పట్ల మీ అభిప్రాయం ఏమిటని ప్రశ్నించగా, అది ఇరువైపుల పదునున్న కత్తిలాంటిదని చెప్పారు. ప్రతిపక్షంలో భయం పుట్టించగలదని, స్వపక్షంలో చీలికలకు కారణం కాగలదనే ఉద్దేశంతోనే ఆయన ఇరువైపుల పదునున్న కత్తితో పోల్చారు. ప్రస్తుతం రాష్ట్రంలో దిగ్విజయ్ సింగ్‌తోపాటు కమల్ నాథ్ బృందం, జ్యోతిరాధిత్య సింధియా బృందం అంటూ మూడు వర్గాలు ఉన్నాయి. వచ్చే ఎన్నికల్లో 70 ఏళ్లు దాటిన వారిని పోటీకి నిలబెట్టరాదని రాహుల్ గాంధీ బలంగా భావిస్తున్నందున 71 ఏళ్ల దిగ్విజయ్ సింగ్‌కు ముఖ్యమంత్రి అభ్యర్థి అయ్యే అవకాశం లేకపోవచ్చు. అలాంటి సందర్భంలో ఆయన కమల్‌నాథ్‌ను సమర్థించేందుకు సిద్ధంగా ఉన్నారు. జ్యోతిరాధిత్యను ఆయన మొదటి నుంచి దూరం పెడుతున్నారు. 2003లో దిగ్విజయ్ సింగ్ స్వరాష్ట్రంలో ఓడిపోయిన తర్వాత కేంద్ర పార్టీ కార్యకలాపాల్లో ఆయన కీలక బాధ్యతలు నిర్వహిస్తూ వచ్చారు. మొన్నటి వరకు గోవా, తెలంగాణ, ఆంధ్ర, కర్ణాటక పార్టీ వ్యవహారాలు చూసుకున్నారు. గోవా ఎన్నికల్లో అధిక సీట్లు వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని తీసుకరావడంలో దిగ్విజయ్ సింగ్ విఫలం కావడంతో ఆయన బాధ్యతలను కుదించారు. ప్రస్తుతం ఆయన ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాలకు మాత్రమే పరిమితమయ్యారు. సరిగ్గా ఈ సమయంలోనే ఆయన పాదయాత్ర మొదలు పెట్టారు. ఇప్పుడు దిగ్విజయ్ తిరిగి రావడంతో ఆయన గురించి పార్టీ వర్గాల్లో ‘ఆయన తిరిగొచ్చారు’ అని నర్మగర్భంగా కార్యకర్తలు మాట్లాడుతున్నారు. మధ్యప్రదేశ్‌లోని శివరాజ్ సింగ్ చౌహాన్ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం పట్ల రాష్ట్ర ప్రజలు విసిగి ఉన్నారు. గ్రామీణ ప్రాంతం ప్రజలు దుర్భర దారిద్య్ర పరిస్థితులతో మగ్గుతున్నారు. ఇసుక మాఫియా వ్యవహారాలు పట్టణ ప్రాంతాల్లో ప్రభుత్వం పరువు తీశాయి. ఇలాంటి పరిస్థితుల్లో దిగ్విజయ్, కమల్‌నాథ్, సింధియాలు ఒక్కటయితే కాంగ్రెస్‌కు విజయం పెద్ద కష్టం కాదు. -
'గోడ దూకి వెళ్లైనా పాదయాత్ర చేస్తా'
కిర్లంపూడి: తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడిలో శుక్రవారం ఉద్రిక్తత చోటుచేసుకుంది. పోలీసుల ఒత్తిడిని తట్టుకోలేక ఏదో ఒక రోజు గోడ దూకి వెళ్లైనా పాదయాత్ర చేస్తానని కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం తెలిపారు. ముద్రగడ మరోసారి పాదయాత్ర చేసేందుకు ప్రయత్నించగా పోలసులుల అడ్డుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం చంద్రబాబు తీరుకు నిరసనగా తన నివాసం వద్ద ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఆందోళన చేస్తామని పేర్కొన్నారు. ముద్రగడ గేటు బయట చేపట్టిన ఆందోళనకు కాపులు తరలివచ్చి మద్దతు తెలిపారు. చంద్రబాబుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కార్యక్రమంలో కాపు జేఏసీ నాయకులు పాల్గొన్నారు. -
ఊపిరున్నంత వరకూ పోరాటం : మద్రగడ
కిర్లంపూడి (జగ్గంపేట)/గాంధీనగర్ (విజయవాడ సెంట్రల్): సీఎం చంద్రబాబు కాపులకు ఇచ్చిన హామీలు సాధించేందుకు ఊపిరి ఉన్నంత వరకు పోరాటం చేస్తానని మాజీ ఎంపీ, కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం పేర్కొన్నారు. తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడిలో బుధవారం విలేకరులతో మాట్లాడుతూ కాపు జాతిలోని పేదవారి కోసం పాదయాత్ర చేస్తుంటే వేల మంది పోలీసు బలగాలను ఎందుకు ఉపయోగిస్తున్నారో తెలియజేయాలన్నారు. గతంలో బాబు పాదయాత్ర చేసినప్పుడు అప్పట్లో అనుమతుల కోసం ప్రభుత్వానికి దరఖాస్తు చేశారా? అని ప్రశ్నించారు. -
కాంగ్రెస్‌లో యువనేత సందడి
సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ : ఎన్నికల అనంతరం పూర్తిగా నిస్తేజంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ జిల్లా శ్రేణుల్లో ఎట్టకేలకు కదలిక వచ్చినట్లయ్యింది. ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ పాదయాత్ర నేపథ్యంలో ఆ పార్టీ వర్గాల్లో సందడి వాతావరణం నెలకొంది. ఆత్మహత్యకు పాల్పడిన రైతు కుటుంబాల్లో ఆత్మస్థైర్యం నింపేందుకు రాహుల్ గాంధీ కిసాన్ సందేశ్ యాత్ర పేరు తో జిల్లాలో పాదయాత్ర చేపట్టాలని నిర్ణయించారు. గురువారం రాత్రి నిర్మల్‌కు చేరుకుంటారు. శుక్రవారం ఉదయం ఏడు గంటల నుంచి పాదయాత్ర ప్రారంభం కానుంది. లక్ష్మణచాంద, మామడ మండలాల పరిధిలోని కొరిటికల్ నుంచి వడ్యాల్ వరకు సుమారు 15 కిలో మీటర్ల మేరకు ఈ పాదయాత్ర సాగనుంది. మార్గమధ్యలో ఆత్మహత్యలకు పాల్పడిన రైతు కుటుం బాలను ఆయన పరామర్శించనున్నారు. రైతులతో కూడా మాట్లాడే అవకాశాలున్నాయని నేతలు పేర్కొం టున్నారు. పాదయాత్ర అనంతరం రాహుల్ రైతులను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఈ పాదయాత్రను వి జయవంతం చేసేందుకు డీసీసీ అధ్యక్షుడు ఏలేటి మహేశ్వర్‌రెడ్డితోపాటు పలువురు నాయకులు పక్షం రోజులుగా ఏర్పాట్లలో తలమునకలయ్యారు. టీపీసీసీ చీఫ్ ఉత్తంకుమార్‌రెడ్డి, ఏఐసీసీ నేతలు కుంతియా వంటి ముఖ్యనేతలు ఇప్పటికే ఈ పాదయాత్ర ఏర్పాట్లను పరిశీలించారు. సుమారు 40 వేల మందిని తరలించేందుకు పార్టీ నేతలు ఏర్పాట్లు చేశారు. ఆయా ని యోజకవర్గాల ఇన్చార్జీలు ఈ పనుల్లో నిమగ్నమయ్యారు. పాదయాత్రలో రాహుల్ రైతులు, రైతు కు టుంబాలతో మమేకమయ్యే అవకాశాలున్నాయని పా ర్టీ వర్గాలు భావిస్తున్నాయి. ఈ మేరకు పాదయాత్రలో నేతలు, కార్యకర్తల హంగు, ఆర్భాటాలు లేకుండా చూ డాలని పార్టీ వర్గాలకు ఆదేశాలందినట్లు సమాచారం. నేతల ఐక్యత రాగం.. వర్గ పోరుకు చిరునామాగా మారిన జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు రాహుల్ పాదయాత్ర సందర్భంగా ఐక్యతా రాగాన్ని ఆలపిస్తున్నారు. నేతల్లో ఉన్న విభేదాలు బహిర్గతం కాకుండా ఇప్పటికే టీపీసీసీ ముఖ్యనేతలు రంగంలోకి దిగారు. అసంతృప్తిని వ్యక్తం చేసిన నాయకులను బుజ్జగించారు. కనీసం తమకు ఒక్క మాటైనా చెప్పకుండానే జిల్లాలో రాహుల్ పర్యటన ఖరారు చేయడం పట్ల ఒకవర్గం నాయకులు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. టీపీసీసీ చీఫ్ ఉత్తంకుమార్‌రెడ్డి సోదరుడు కౌషిక్‌రెడ్డి ఈ నాయకులతో మాట్లాడినట్లు తెలుస్తోంది. అలాగే ఎన్నికల అనంతరం పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న మాజీ ఎమ్మెల్సీ ప్రేంసాగర్‌రావు, మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే జి.అరవింద్‌రెడ్డి వంటి నాయకులు రాహుల్ పాదయాత్ర సందర్భంగా కూడా దూరంగా ఉన్నారు. -
నేడే రాహుల్ రాక
నిర్మల్ అర్బన్ : కాంగ్రెస్ పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ గురువారం జిల్లాకు వస్తున్నారు. ఆత్మహత్యకు పాల్పడిన రైతు కుటుంబాల్లో ఆత్మస్థైర్యం నింపేందుకు రాహుల్ గాంధీ కిసాన్ సందేశ్ యాత్ర పేరుతో జిల్లాలో పాదయాత్ర చేపట్టాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా గురువారం రాత్రి ఆయన నిర్మల్‌కు చేరుకోనున్నారు. ఇప్పటికే ఆయన రూట్‌మ్యాప్ ఖరారు కావడంతో నేతలు ఏర్పాట్లను వేగవంతం చేశారు. నిర్మల్ పట్టణంలో భారీ కటౌట్లు ఏర్పాటు చేశారు. దారి పొడవునా ప్రచార ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. పార్టీ రాష్ట్ర స్థాయి నేతలంతా ఏర్పాట్లపై దృష్టి పెట్టారు. మూడు, నాలుగు రోజులుగా ఏర్పాట్లను దగ్గరుండి నిత్యం పర్యవేక్షిస్తున్నారు. పర్యటనను విజయవంతం చేసేందుకు కసరత్తులు చేస్తున్నారు. ఎస్పీజీ గుప్పిట్లో నిర్మల్... రాహుల్ గాంధీ పర్యటన నేపథ్యంలో నిర్మల్, మామడ, లక్ష్మణచాంద ప్రాంతాల్లో స్పెషల్ ప్రొటక్షన్ గ్రూప్(ఎస్పీజీ), నిఘా విభాగం భద్రతా ఏర్పాట్లను నిర్వహిస్తోంది. జిల్లా ఎస్పీ తరున్జోషితోపాటు జాతీయ స్థాయి భద్రతా అధికారులు భద్రతను పర్యవేక్షిస్తున్నారు. భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. రాహుల్‌గాంధీ గురువారం రాత్రి నిర్మల్‌లో బస చేస్తుండడంతో ఇప్పటికే భద్రతను ముమ్మరం చేశారు. రాహుల్ పర్యటించే రూట్లలో పోలీసులు బృందాలతో తనిఖీలు చేయించారు. ఇప్పటికే నిర్మల్ ప్రాంతాన్ని ఎస్పీజీ గుప్పిట్లోకి తీసుకొంది. భారీ ఏర్పాట్లు.. రాహుల్‌గాంధీ పర్యటన నేపథ్యంలో పార్టీ నాయకులు భారీ ఏర్పాట్లను చేశారు. డీసీసీ అధ్యక్షుడు ఏలేటి మహేశ్వర్‌రెడ్డి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ పర్యటనను పార్టీ రాష్ట్రస్థాయి నేతలు పర్యవేక్షిస్తున్నారు. వారం రోజులుగా పార్టీ ప్రముఖులు నిర్మల్‌కు వచ్చి ఏర్పాట్లను సమీక్షిస్తున్నారు. నిర్మల్ పట్టణంతోపాటు మామడ మండలం కొరిటికల్, లక్ష్మణచాంద మండలం లక్ష్మణచాంద, పొట్టపెల్లి, రాచాపూర్, వడ్యాల్ గ్రామాల్లో ఏర్పాట్లు చేశారు. శుక్రవారం వడ్యాల్లో నిర్వహించే బహిరంగ సభకు జనాలను సిద్ధం చేస్తున్నారు. ప్రత్యేకంగా సభా వేదికను తయారు చేశారు. -
కేజ్రీవాల్ కోసం 300 కిలోమీటర్ల పాదయాత్ర
న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) అధినేత అరవింద్ కేజ్రీవాల్ కు మద్దతుగా నలుగురు ఆప్ వాలంటీర్లు ఆదివారం పాదయాత్ర చేపట్టారు. 300 కిలోమీటర్లు పైగా వీరు పాదయాత్ర చేయనున్నారు. సుఖ్ దేవ్ సింగ్, ఉదయభాను, అబ్దుల్ ఖాన్, ప్రిన్స్ మాసిహ్ పంజాబ్ లోని లుథియానా నుంచి ఢిల్లీకి పాదయాత్రగా బయలుదేరారు. లుథియానా టాప్ కన్వీనర్ అహబాబ్ సింగ్ గ్రెవాల్ జెండా ఊపి పాదయాత్రను ప్రారంభించారు. అంతముందు నలుగురు వాలంటీర్లు భగత్ సింగ్, సుఖ్ దేవ్, రాజగురులకు నివాళులర్పించారు. -
వేలివెన్ను నుంచి బాబు పాదయాత్ర ప్రారంభం
-
వేలివెన్ను నుంచి బాబు పాదయాత్ర ప్రారంభం
ఏలూరు : పశ్చిమగోదావరి జిల్లా నిడదవోలు నియోజకవర్గం వేలివెన్ను గ్రామంలోని ఎన్టీఆర్ విగ్రహానికి సీఎం చంద్రబాబు ఆదివారం నివాళులర్పించారు. అనంతరం ఆయన పాదయాత్ర ప్రారంభించారు. ఈ పాదయాత్రలో చంద్రబాబుతోపాటు పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కొవ్వూరు నియోజకవర్గంలోని బ్రాహ్మణగూడెం వరకు 18 కిలోమీటర్ల మేర చంద్రబాబు పాదయాత్ర చేయనున్నారు. -
టీడీపీ-బీజేపీ సెపరూట్
ఎవరి దారి వారిదే! {శేణుల మధ్య సఖ్యత కరువు పరస్పరం సహాయ నిరాకరణ పలుచోట్ల అభ్యర్థుల ఎదురీత {పచారంలో అంటీముట్టని క్యాడర్ సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్ హైదరాబాద్‌లో భారతీయ జనతా పార్టీ- తెలుగుదేశం మధ్య పొత్తు చిత్తవుతోంది. మిత్రపక్షాలుగా కలిసి పనిచేయాల్సిన ఇరు పార్టీల మధ్య రోజు రోజుకూ మరింత అగాథం ఏర్పడుతోంది. ఇప్పటికే ఎడముఖం.. పెడముఖంగా ఉన్న ఇరు పార్టీల నేతలు పరస్పరం సహాయ నిరాకరణతో ప్రచారపర్వంలో ఎదురీదుతున్నారు. ముఖ్యనేతలు, కార్యకర్తలు కలిసి రాకపోవడంతో అభ్యర్థుల ప్రచారం గల్లీలు దాటడం లేదు. ఈ పరిస్థితి అభ్యర్థులకు కంటిపై కునుకు లేకుండా చేస్తోంది. పొత్తు మేరకు కలిసికట్టుగా సార్వత్రిక సంగ్రామంలో దూకాల్సిన ఇరు పార్టీలు.. క్షేత్రస్థాయిలో తలోదారి పట్టాయి. బీజేపీ అభ్యర్థుల పాదయాత్రకు టీడీపీ కార్యకర్తలు డుమ్మా కొడుతున్నారు. టీడీపీ బరిలో ఉన్న సనత్‌నగర్, సికింద్రాబాద్, జూబ్లీహిల్స్, కూకట్పల్లి, శేరిలింగంపల్లి నియోజకవర్గాల్లో బీజేపీ శ్రేణుల జాడ కనిపించట్లేదు. తమకు సీటు దక్కని స్థానంలో మరొకరికి తరపున ప్రచారం చేయడానికి ఇరు పార్టీల్లోని ముఖ్య నేతలు ముఖం చాటేస్తున్నారు. ఒకరి ఓటమికి మరొకరు అంతర్గతంగా పావులు కదుపుతున్నారు. ఒకటీ అరా చోట్ల టీడీపీ, బీజేపీ ముఖ్యనేతలు ప్రచారం, పాదయాత్రల్లో పైకి సఖ్యత ప్రదర్శిస్తున్నా.. వాటికి తమ అనుచరులు, క్యాడర్‌ను మాత్రం రానివ్వట్లేదు. ఖైరతాబాద్, గోషామహల్, ముషీరాబాద్, మలక్‌పేట, ఉప్పల్ స్థానాల్లో బీజేపీ పాగావేస్తే భవిష్యత్‌లో తాము ఇబ్బందులు పడాల్సి వస్తుందన్న భావనతో అక్కడి టీడీపీ నేతలు కావాలనే దూరంగా ఉంటున్నారని సమాచారం. కీలక స్థానాల్లో మిత్రపక్షాల అభ్యర్థులను ఓడిస్తే ఆ పార్టీకి ఇక్కడ బలం లేదని తేలిపోతుంది.. ఫలితంగా భవిష్యత్‌లో ఇక్కడ తమకు ఢోకా ఉండదనే ఆశతో పలువురు నేతలు అంటీముట్టనట్లు ఉంటున్నారు. ఉమ్మడి స్థానాల్లో అభ్యర్థులను ఎలాగైనా ఓడించాలన్న లక్ష్యంతో కొందరు నేతలు ప్రత్యర్థి పార్టీలకు ఓటు వేయాలంటూ అంతర్గత ప్రచారం సాగిస్తున్నట్లు తెలుస్తోంది. ఎక్కడా పొసగని పొత్తు సికింద్రాబాద్ లోక్‌సభ బీజేపీ అభ్యర్థి బండారు దత్తాత్రేయ ఇప్పటికే సికింద్రాబాద్, ఖైరతాబాద్ నియోజకవర్గాల్లోని పలు డివిజన్లలో ప్రచారం నిర్వహించారు. టీడీపీ శ్రేణులు ఎక్కడా ఆయన వెంట నడవలేదు. ఖైరతాబాద్ నియోజకవర్గంలో విజయరామారావు (టీడీపీ) అనుచరవర్గంలోని ఒక్కరూ దత్తాత్రేయ పర్యటనలో పాల్గొనలేదు. తన అనుచరుల్ని విజయరామారావు కావాలనే జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి పంపిస్తున్నట్టు ఆ పార్గీ నాయకులే చెబుతున్నారు. ఇక, చింతల రామచంద్రారెడ్డి (ఖైరతాబాద్-బీజేపీ) వెంట వెళ్లేందుకు టీడీపీ క్యాడర్ ఆసక్తిచూపడం లేదు అంబర్‌పేటలో కిషన్‌రెడ్డి (బీజేపీ) ప్రచార కార్యక్రమానికి టీడీపీ నాయకుడు కృష్ణయాదవ్ హాజరైనా, ఆయన అనుచరులు, కార్యకర్తలు ముఖం చాటేస్తున్నారు కార్వాన్ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి బద్దం బాల్‌రెడ్డి.. మిత్రపక్షమైన టీడీపీ సహాయ నిరాకరణతో ఒంటరిపోరు చేస్తున్నారు గోషామహల్లో రెబల్ అభ్యర్థి నందకిషోర్ వ్యాస్ బీజేపీకి గుబులు పుట్టిస్తున్నారు. ఇక్కడి టీడీపీ నేత ప్రేమ్‌కుమార్ దూత్ టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకోవడంతో ఆయన అనుచరవర్గమంతా అటువైపు వెళ్లింది. టీడీపీ మద్దతు కనీస స్థాయిలోనూ లేక రాజాసింగ్ (బీజేపీ) ఎదురీదుతున్నారు ముషీరాబాద్ నియోజకవర్గంలో పట్టున్న ముఠా గోపాల్ టీఆర్ఎస్లో చేరికతో టీడీపీ క్యాడర్ ఖాళీ అయింది. ఇక్కడ మిగిలిన టీడీపీ నేత ఎమ్మెన్ శ్రీనివాస్ అంతంతగానే సహకరిస్తుండటం బీజేపీని ఇరుకున పడేస్తోంది ఉప్పల్, మల్కాజిగిరి, యాకుత్‌పుర తదితర నియోజకవర్గాల్లోనూ పరిస్థితి ఇందుకు భిన్నంగా ఏమీ లేదు. -
రజనీ కోసం తిరుపతికి అభిమానుల పాదయాత్ర!
సూపర్ స్టార్ రజనీకాంత్ కు ప్రపంచవ్యాప్తంగా వీరాభిమానులున్నారనే సంగతి ఎన్నో సంఘటనలు రుజువు చేశాయి. ఏప్రిల్ 11 తేదిన రజనీ నటించిన 'కొచ్చడయాన్' చిత్రం విడుదలకు సిద్దమవుతున్న నేపథ్యంలో అభిమానులు పాదయాత్ర చేపట్టారు. కొచ్చడయాన్ చిత్రం ఘన విజయం సాధించాలని ఏప్రిల్ 2 తేదిన వెల్లూరు నుంచి తిరుపతికి పాదయాత్ర చేపట్టనున్నారు. నెల్లూరు కు చెందిన రజనీకాంత్ ఫ్యాన్ క్లబ్ ట్రెజరర్ ఎన్ రవి పాదయాత్రకు ఏర్పాట్లు చేస్తున్నారు. వందలాది రజనీ ఫ్యాన్స్ ఏప్రిల్ 2 తేదిన పాదయాత్రగా తిరుపతి బయలు దేరుతున్నాం. రెండేళ్ల తర్వాత కొచ్చడయాన్ చిత్రం విడుదలవుతోంది. ఈ చిత్రం ఘన విజయం సాధించాలి. అంతేకాకుండా రజనీకాంత్ ఆరోగ్యం బాగుండాలని భగవంతుడ్ని ప్రార్ధిస్తాం అని రవి తెలిపారు. భారత దేశపు తొలి ఫోటో రియలిస్టిక్ 3D యానిమేషన్ చిత్రంగా 'కొచ్చడయాన్'ను సౌందర్య రజనీకాంత్ రూపొందించారు. దీపికా పదుకొనే, జాకీ ష్రాఫ్, శరత్ కుమార్, నాజర్, ఆది పినిశెట్టి నటించిన ఈ చిత్రం ఆరు భాషల్లో విడుదలకు సిద్దమవుతోంది. -
ప్రత్యేక విదర్భ కోసం పాదయాత్ర
మహారాష్ట్రలోని విదర్భ ప్రాంతాన్ని ప్రత్యేక రాష్ట్రంగా విభజించాలనే డిమాండ్ ఊపందుకుంటోంది. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు కోరుతూ శనివారమిక్కడ వేలాదిమంది యువకులు పాదయాత్ర ప్రారంభించారు. కాంగ్రెస్ నాయకుడు రంజీత్ దేశ్‌ముఖ్ కుమారుడు ఆశీష్ దేశ్‌ముఖ్ ఈ ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్నారు. ఐదు రోజుల పాటు సాగే ఈ యాత్ర మహాత్మా గాంధీ జయంతి అక్టోబర్ 2 వరకు సాగనుంది. ఆ రోజున గాంధీ సేవాగ్రమ్ ఆశ్రమమ్ వద్ద జరిగే కార్యక్రమంతో యాత్ర ముగియనుంది. ఇట్వారీ ప్రాంతంలోని విదర్భ చంద్రిక ఆలయంలో పూజలు నిర్వహించిన అనంతరం పాదయాత్ర మొదలైంది. పలువురు కాంగ్రెస్ నాయకులు, మాజీ ఉన్నతాధికారులు ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు సంఘీభావం తెలుపుతూ యాత్రలో పాల్గొన్నారు. కాగా 1953లో విదర్భను మహారాష్ట్రలో విలీనం చేశారు.