సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ : ఎన్నికల అనంతరం పూర్తిగా నిస్తేజంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ జిల్లా శ్రేణుల్లో ఎట్టకేలకు కదలిక వచ్చినట్లయ్యింది. ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ పాదయాత్ర నేపథ్యంలో ఆ పార్టీ వర్గాల్లో సందడి వాతావరణం నెలకొంది. ఆత్మహత్యకు పాల్పడిన రైతు కుటుంబాల్లో ఆత్మస్థైర్యం నింపేందుకు రాహుల్ గాంధీ కిసాన్ సందేశ్ యాత్ర పేరు తో జిల్లాలో పాదయాత్ర చేపట్టాలని నిర్ణయించారు. గురువారం రాత్రి నిర్మల్‌కు చేరుకుంటారు.
శుక్రవారం ఉదయం ఏడు గంటల నుంచి పాదయాత్ర ప్రారంభం కానుంది. లక్ష్మణచాంద, మామడ మండలాల పరిధిలోని కొరిటికల్ నుంచి వడ్యాల్ వరకు సుమారు 15 కిలో మీటర్ల మేరకు ఈ పాదయాత్ర సాగనుంది. మార్గమధ్యలో ఆత్మహత్యలకు పాల్పడిన రైతు కుటుం బాలను ఆయన పరామర్శించనున్నారు. రైతులతో కూడా మాట్లాడే అవకాశాలున్నాయని నేతలు పేర్కొం టున్నారు. పాదయాత్ర అనంతరం రాహుల్ రైతులను ఉద్దేశించి ప్రసంగించనున్నారు.
ఈ పాదయాత్రను వి జయవంతం చేసేందుకు డీసీసీ అధ్యక్షుడు ఏలేటి మహేశ్వర్‌రెడ్డితోపాటు పలువురు నాయకులు పక్షం రోజులుగా ఏర్పాట్లలో తలమునకలయ్యారు. టీపీసీసీ చీఫ్ ఉత్తంకుమార్‌రెడ్డి, ఏఐసీసీ నేతలు కుంతియా వంటి ముఖ్యనేతలు ఇప్పటికే ఈ పాదయాత్ర ఏర్పాట్లను పరిశీలించారు. సుమారు 40 వేల మందిని తరలించేందుకు పార్టీ నేతలు ఏర్పాట్లు చేశారు.
ఆయా ని యోజకవర్గాల ఇన్‌చార్జీలు ఈ పనుల్లో నిమగ్నమయ్యారు. పాదయాత్రలో రాహుల్ రైతులు, రైతు కు టుంబాలతో మమేకమయ్యే అవకాశాలున్నాయని పా ర్టీ వర్గాలు భావిస్తున్నాయి. ఈ మేరకు పాదయాత్రలో నేతలు, కార్యకర్తల హంగు, ఆర్భాటాలు లేకుండా చూ డాలని పార్టీ వర్గాలకు ఆదేశాలందినట్లు సమాచారం.
నేతల ఐక్యత రాగం..
వర్గ పోరుకు చిరునామాగా మారిన జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు రాహుల్ పాదయాత్ర సందర్భంగా ఐక్యతా రాగాన్ని ఆలపిస్తున్నారు. నేతల్లో ఉన్న విభేదాలు బహిర్గతం కాకుండా ఇప్పటికే టీపీసీసీ ముఖ్యనేతలు రంగంలోకి దిగారు. అసంతృప్తిని వ్యక్తం చేసిన నాయకులను బుజ్జగించారు. కనీసం తమకు ఒక్క మాటైనా చెప్పకుండానే జిల్లాలో రాహుల్ పర్యటన ఖరారు చేయడం పట్ల ఒకవర్గం నాయకులు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు.
టీపీసీసీ చీఫ్ ఉత్తంకుమార్‌రెడ్డి సోదరుడు కౌషిక్‌రెడ్డి ఈ నాయకులతో మాట్లాడినట్లు తెలుస్తోంది. అలాగే ఎన్నికల అనంతరం పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న మాజీ ఎమ్మెల్సీ ప్రేంసాగర్‌రావు, మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే జి.అరవింద్‌రెడ్డి వంటి నాయకులు రాహుల్ పాదయాత్ర సందర్భంగా కూడా దూరంగా ఉన్నారు.
కాంగ్రెస్‌లో యువనేత సందడి
Published Thu, May 14 2015 1:48 AM | Last Updated on Mon, Oct 1 2018 2:00 PM
Advertisement
Advertisement