రైతులు దొంగలా? మరి మాల్యా?
గోరఖ్‌పూర్: ‘రైతులు మంచాలు తీసుకెళ్తుంటే దొంగలంటున్నారు. విజయ్ మాల్యా లాంటి పెద్దలు దేశం నుంచి పారిపోతే రుణ ఎగవేతదారులు అంటున్నారు’... ఉత్తరప్రదేశ్‌లో తను పాల్గొన్న ‘ఖాట్ పే చర్చా’ సభ నుంచి మంచాలను ఎత్తుకెళ్లిన రైతులను దొంగలు అన్న వారి వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ స్పందన ఇది. బుధవారం ఖలీదాబాద్ పర్యటనలో ఆయన ఈ అంశంపై స్పందించారు. మాల్యా లాంటి వాళ్లు దేశం నుంచి పారిపోతుంటే కేంద్రం చూస్తూ ఊరుకుందని అన్నారు.