న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి తెలియకుండానే లిక్కర్ కింగ్ విజయ్‌మాల్యా దేశం నుంచి పారిపోయాడనడం నమ్మశక్యంగా లేదని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. భారత్ వదిలి బ్రిటన్‌కు వెళ్లేముందు కేంద్ర ఆర్థిక మంత్రి జైట్లీతో తాను సమావేశమయ్యానన్న మాల్యా వ్యాఖ్యపై రాహుల్ స్పందించారు. ‘ప్రధానికే సీబీఐ జవాబుదారీగా ఉంటుంది. అలాంటప్పుడు మాల్యాపై జారీ చేసిన లుకౌట్ నోటీసుల్లో ‘నిర్బంధించు’ బదులు ‘తెలియపరుచు’ అని మార్చడం ద్వారా లిక్కర్ కింగ్ దేశం నుంచి పలాయనం అయ్యేందుకు సీబీఐ సహకరించిందనడం నమ్మశక్యంగా లేదు’ అని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment