look out notice
-
యూట్యూబర్ హర్షసాయి చుట్టూ బిగుస్తున్న ఉచ్చు
-
కోరుట్ల దీప్తి కేసులో కీలక పరిణామం
కోరుట్ల: బంక దీప్తి అనుమానాస్పద మృతి కేసులో నిందితురాలిగా భావిస్తున్న చెల్లెలు చందనపై పోలీసులు లుక్ అవుట్ నోటీసులు జారీ చేసినట్లు సమాచారం. కోరుట్లలోని తన ఇంట్లో మంగళవారం మ ధ్యాహ్నం సాఫ్ట్వేర్ ఇంజినీర్ బంక దీప్తి అనుమానాస్పదంగా మృతి చెందిన విషయం తెలిసిందే. దీప్తి చనిపోవడం, ఆమె చెల్లెలు చందన కనిపించకపోవడంతో ఆమె తన బాయ్ ఫ్రెండ్‌తో కలిసి పరారైనట్లు పోలీసులు అనుమానించారు. ఈ క్రమంలో ఆమె ఆ చూకీ కోసం రెండు రోజులుగా గాలింపు చేపట్టారు. చందన ఇంట్లో నుంచి వెళ్లిపోయే సమయంలో రూ. 2 లక్షల నగదు, రూ.90 లక్షలు విలువ చేసే కిలోన్న ర బంగారు నగలు, పాస్‌పోర్టు తీసుకుని వెళ్లిపోయినట్లు సమాచారం. చందన బాయ్‌ఫ్రెండ్ హైదరాబాదీగా పోలీసులు గుర్తించిన ట్లు తెలిసింది. చందన ఫోన్‌కాల్ డేటా ఆధారంగా బాయ్ ఫ్రెండ్ వి వరాలు పోలీసులు సేకరించారు. ఇద్దరి సెల్ఫోన్లు స్విచ్ఛాఫ్ ఉండటంతో ఆచూకీ కనుక్కోవడం కష్టతరంగా మారింది. దీప్తి, చందనలకు మద్యం బాటిళ్లు ఎవరు తెచ్చి ఇచ్చారన్న విషయంలో ఇప్పటికీ స్పష్టత లేదు. హైదరాబాద్ బాయ్ ఫ్రెండ్ తీసుకుని వచ్చాడా? లేక స్థానికంగా ఉన్న ఎవరైనా కొనుక్కుని తెచ్చారా? అన్న విషయం తేలలేదు. కోరుట్లలో ఉన్న వైన్‌షాపుల వద్ద సీసీ కెమెరాలను పోలీసులు పరిశీలించినప్పటికీ సోమవారం సాయంత్రం రెండు, మూడుసార్లు విద్యుత్ సరాఫరా లో అంతరాయం కలగడంతో సీసీ కెమెరాల్లో ఎలాంటి రికార్డులు లేనట్లు తెలిసింది. ఇప్పటికే కోరుట్ల సర్కిల్లోని ఇద్దరు ఎస్సైలు తమ బృందాలతో క లిసి చందన, ఆమె బాయ్‌ఫ్రెండ్ కోసం హైదరాబాద్‌లో గాలింపులు చేస్తున్నారు. బాయ్‌ఫ్రెండ్ సెల్‌ఫోన్ సిమ్‌కార్డు కేవైసీ అడ్రస్ ప్రకారం వెతకగా అక్కడ ఎవరి ఆచూకీ దొరకలేదని సమాచారం. చందన పాస్‌పోర్టును వెంట తీసుకెళ్లడం, డబ్బులు, బంగారం వెంట ఉండటంతో బాయ్‌ఫ్రెండ్‌తో కలిసి విదేశాలకు పరారవుతారన్న సందేహాలతో ఎయిర్‌పోర్ట్‌లకు లుక్ అవుట్ నోటీసులు జారీ చేసినట్లు తె లిసింది. చందన బీటెక్ రెండో సంవత్సరంలోనే డిటెయిన్ అయినట్లు సమాచారం. ఈ విషయం ఇంట్లో తెలియకుండా దాచిపెట్టి హైదరాబాద్‌లో రెండేళ్లు బీటెక్ చేస్తున్నట్లుగా ఇంట్లో వారిని నమ్మించినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇదిలా ఉండగా చందన, ఆమె బాయ్‌ఫ్రెండ్‌ను గురువారం పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లుగా పుకార్లు రావడం కలకలం రేపింది. ఈ విషయమై కోరుట్ల సీఐ ప్రవీణ్‌కుమార్‌ను సంప్రదించగా చందన కోసం రెండు పోలీసు బృందాల గాలింపులు కొనసాగిస్తున్నాయని ఎవరిని అదుపులోకి తీసుకోలేదని తెలిపారు. -
కిరణ్‌రాజు, అర్జున్‌పై ‘లుక్ఔట్’?
సాక్షి, హైదరాబాద్: రాడిసన్ బ్లూ ప్లాజా హోటల్ అధీనంలోని పుడింగ్ అండ్ మింక్ పబ్‌లో జరిగిన రేవ్ పార్టీ కేసులో నిందితులుగా ఉన్న పబ్ భాగస్వాములు పెనుమత్స కిరణ్ రాజు, అర్జున్ వీరమాచినేనిపై లుక్ఔట్ సర్క్యులర్స్(ఎల్వోసీ) జారీ చేయాలని హైదరాబాద్ సిటీ పోలీసులు యోచిస్తున్నారు. పరారీలో ఉన్న వీరిద్దరు దేశం విడిచిపోకుండా అడ్డుకునేందుకే పోలీసులు ఈ ఎల్వోసీ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే కిరణ్ రాజు పాస్‌పోర్ట్ వివరాలను సేకరించారు. అర్జున్ పాస్‌పోర్టు వివరాల కోసం ప్రయత్నిస్తున్నారు. గురువారం సాయంత్రానికి రాష్ట్ర నోడల్ అధికారుల ద్వారా దేశంలోని అన్ని అంతర్జాతీయ విమానాశ్రయాలు, ఓడరేవులకు ఎల్వోసీలు పంపడానికి చర్యలు ముమ్మరం చేశారు. ఈ చర్యలు పూర్తయితే బంజారాహిల్స్ ఠాణాలో ఎన్డీపీఎస్ యాక్ట్ కింద నమోదైన కేసులో వీరిద్దరు కూడా నిందితులనే విషయం ఇమిగ్రేషన్ డేటాబేస్‌లోకి చేరుతుంది. ఈ క్రమంలో వీరు దేశం దాటి వెళ్లడానికి ప్రయత్నిస్తే, ఇమ్మిగ్రేషన్ అధికారులు గుర్తిం చి అదుపులోకి తీసుకుంటారు. వీరిద్దరూ రాష్ట్రం వెలుపల ఉన్నారని భావిస్తున్న పోలీసులు పట్టుకో వడం కోసం సాంకేతికంగానూ ముందుకు వెళ్తున్నారు. ఇప్పటికే అధికారులు పబ్ ఉద్యోగులను ప్రశ్నించారు. రేవ్ పార్టీ జరిగిన రోజే పబ్‌లో ఓ ప్రముఖుడి కుమారుడి పుట్టినరోజు వేడుక జరిగిందని విచారణలో బయటపడింది. ఆ ‘మూడు టేబుళ్ల’వద్దే డ్రగ్స్ తీసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. వాటి వద్ద కూర్చున్నవారిని గుర్తించడానికి మరోసారి సీసీ కెమెరాల ఫుటేజ్‌ని విశ్లేషిస్తున్నారు. నేడు ఎంఎస్‌జే కోర్టులో కస్టడీ పిటిషన్‌పై విచారణ ఇప్పటికే అరెస్టు అయి, జ్యుడీషియల్ రిమాండ్‌లో ఉన్న పబ్ భాగస్వామి అభిషేక్ ఉప్పాలతోపాటు మేనేజర్ అనిల్‌కుమార్‌ను ఐదు రోజులపాటు తమ కస్టడీకి అప్పగించాలని పోలీసులు మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జి(ఎంఎస్‌జే) కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై గురువారం విచారణ జరిగే అవకాశముంది. ఈ కోర్టులోనే బుధవారం ఈ నిందితులిద్దరు బెయిల్ పిటిషన్లు దాఖలు చేశారు. అయితే ఈ పిటిషన్లను కొట్టేయాలంటూ బంజారాహిల్స్ పోలీసులు కౌంటర్లు సైతం సమర్పిస్తున్నారు. కిరణ్ రాజు డైరెక్టర్‌గా ఉన్న టి-డిజైన్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు అనుబంధంగా పుడింగ్ అండ్ మింక్ పబ్ కొనసాగుతోంది. దీనితోపాటు మరో 24 సంస్థల్లోనూ కిరణ్ డైరెక్టర్‌గా ఉన్నట్లు పోలీసు లు గుర్తించారు. ఆదివారం ఆ పబ్‌పై దాడి చేసిన సందర్భంలో నటుడు నాగబాబు కుమార్తె కొణిదెల నిహారిక, బిగ్‌బాస్ విన్నర్, గాయకుడు రాహుల్ సిప్లిగంజ్, టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ కొడుకు గల్లా సిద్ధార్ధ్తోపాటు మాజీ కేంద్రమంత్రి మనవడు సహా 128 మంది కస్టమర్లు, 18 మంది సిబ్బంది, అభిషేక్, అనిల్కుమార్లను అదుపులోకి తీసుకున్న విషయం విదితమే. వీరిలో అభిషేక్, అనిల్కుమార్లను అరెస్టు చేయగా, మిగిలిన వారిని సొంత పూచీకత్తుపై విడిచిపెట్టిన విషయం తెలిసిందే. -
హైకోర్టును ఆశ్రయించిన కేంద్ర మాజీ కేంద్ర మంత్రి
సాక్షి, అమరావతి: లుక్ అవుట్ నోటీసుల నేపథ్యంలో తాను అమెరికాకు వెళ్లేందుకు అనుమతివ్వాలని కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరి హైకోర్టును ఆశ్రయించారు. జులై రెండోవారంలో జరుగబోయే ఓ సదస్సుకు హాజరయ్యేందుకు తాను అక్కడికి వెళ్లాల్సి ఉందని, అందుకే తన పిటిషన్‌పై అత్యవసరంగా విచారణ చేపట్టాలని న్యాయస్థానాన్ని కోరారు. అయితే సుజనా చేసిన అపీల్‌ను కోర్టు తోసిపుచ్చింది. అమెరికా నుంచి అందిన ఆహ్వానం సమర్పించకుండా అత్యవసర విచారణ ఎలా చేపడతారని మందలించింది. పిటిషన్‌పై తదుపరి విచారణను జులై 7కి వాయిదా వేసింది. మరోవైపు బెస్ట్ అండ్ క్రాంప్టన్ కేసులో సుజనాకు జారీ చేసిన సీబీఐ నోటీసులపై హైకోర్టు విచారణ చేపట్టింది. ఈ కేసు విషయమై అవసరమైతే మళ్లీ పిలుస్తామని న్యాయస్థానం పేర్కొంది. -
సుశీల్ కుమార్ ఎక్కడ?
న్యూఢిల్లీ: రెజ్లింగ్ స్టార్, ఒలింపిక్స్‌లో రెండు పతకాలు గెలిచిన ఏకైక భారతీయుడైన సుశీల్ కుమార్ పరారీ వ్యవహారం సీరియస్‌గా మారింది. యువ రెజ్లర్ సాగర్ రాణా హత్యోదంతానికి సంబంధించి సుశీల్‌పై ఢిల్లీ పోలీసులు ‘లుక్ అవుట్’ నోటీసులు జారీ చేశారు. గత మంగళవారం ఘటన జరిగిన తర్వాత ఎవరికీ అందుబాటులో లేని సుశీల్ కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి. ఆదివారం సాయంత్రం ‘లుక్ అవుట్’ నోటీసు ఇచ్చినట్లు సీనియర్ పోలీసు అధికారి ఒకరు స్పష్టం చేశారు. పోలీసు ఎఫ్ఐఆర్లో సుశీల్ పేరు ఉండటంతో అతడిని పట్టుకునేందుకు అన్ని విధాలా ప్రయత్నించి విఫలమయ్యామని వారు చెప్పారు. ఢిల్లీ–ఎన్సీఆర్తో పాటు పొరుగు రాష్ట్రాల్లో కూడా సుశీల్ కోసం వెతికామని వెల్లడించారు. ఈ ఘటనలో బాధితుల స్టేట్మెంట్ను పోలీసులు ఇప్పటికే రికార్డు చేశారు. ఛత్రశాల్ స్టేడియం పార్కింగ్ వద్ద ఇరు వర్గాలు కొట్టుకున్న ఘటనలో 23 ఏళ్ల జాతీయ మాజీ జూనియర్ చాంపియన్ సాగర్ రాణా తీవ్రంగా గాయపడి ఆపై మృతి చెందాడు. ఆ సమయంలో సుశీల్ అక్కడే ఉన్నాడని సాక్షులు చెప్పారు. తన గురించి బహిరంగంగా చెడుగా మాట్లాడుతున్న రాణాకు బుద్ధి చెప్పాలనే ఉద్దేశంతో అతని ఇంటినుంచి లాక్కొని వచ్చి మరీ సుశీల్, అతని అనుచరులు కొట్టారని కూడా మరికొందరు సాక్ష్యమిచ్చారు. రెజ్లింగ్ పరువు పోయింది: డబ్ల్యూఎఫ్ఐ రెండు ఒలింపిక్ పతకాలతో పాటు ప్రపంచ చాంపియన్‌గా నిలిచిన ఏకైక భారతీయుడైన సుశీల్ కుమార్ ఇప్పుడు హత్య కేసులో పరారీలో ఉండటం దురదృష్టకరమని భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ) సహాయ కార్యదర్శి వినోద్ తోమర్ అన్నారు. ఒకప్పుడు ఒంటి చేత్తో భారత రెజ్లింగ్ స్థాయిని పెంచి ఎందరితో ఆదర్శంగా నిలిచిన సుశీల్ ఇలా కావడం బాధగా ఉందని ఆయన వ్యాఖ్యానించారు. తాజా ఘటన సుశీల్‌కు వ్యక్తిగతంగానే కాకుండా భారత రెజ్లింగ్ మొత్తానికి చెడ్డ పేరు తెచ్చిందని తోమర్ అభిప్రాయ పడ్డారు. రెజ్లర్లు అంటే గూండాలనే భావన మళ్లీ నెలకొంటుందని తోమర్ ఆందోళన వ్యక్తం చేశారు. -
విదేశాలకు వెళ్లాలనుకుంటే 18,000 కోట్లు కట్టండి
న్యూఢిల్లీ: జెట్ ఎయిర్వేస్ ప్రమోటర్ నరేష్ గోయల్‌కు ఢిల్లీ హైకోర్టు గట్టి షాకిచ్చింది. విదేశాలకు వెళ్లాలనుకుంటే, ఆయన కంపెనీ (జెట్‌ఎయిర్‌వేస్) రుణదాతలకు బకాయి పడిన రూ.18,000 కోట్లను గ్యారంటీ కింద డిపాజిట్ చేయాలని హైకోర్టు తేల్చి చెప్పింది. దేశం విడిచి వెళ్లేందుకు గోయల్ చేసిన అభ్యర్థనను తిరస్కరించింది. తనకు వ్యతిరేకంగా జారీ చేసిన లుకవుట్ సర్క్యులర్ (విదేశాలకు వెళ్లేందుకు ప్రయత్నిస్తే, సంబంధిత వ్యక్తి పోలీసుల విచారణకు అసరమా అని గుర్తించి నిలిపివేయడం)ను సవాల్ చేయగా, దీనిపై కేంద్ర ప్రభుత్వ స్పందనను కోర్టు కోరింది. ‘‘ఈ సమయంలో గోయల్‌కు ఎటువంటి మధ్యంతర ఉపశమనం కల్పించేది లేదు. మీరు 18,000 కోట్ల బ్యాంకు గ్యారంటీ ఇచ్చేందుకు సిద్ధపడితే, విదేశానికి వెళ్లొచ్చు’’ అని ఢిల్లీ హైకోర్టు జస్టిస్ సురేష్ కైత్ అన్నారు. ఈ ఏడాది మే 25న దుబాయికి వెళ్లే విమానం నుంచి, గోయల్, అతని భార్య అనిత్ను విమానాశ్రయంలో దించేసిన విషయం గమనార్హం. అయితే, తనపై ఎటువంటి ఎఫ్ఐఆర్ నమోదు కాకపోయినా, లుకవుట్ సర్క్యులర్ పేరిట ఈ విధమైన చర్య తీసుకోవడాన్ని సవాల్ చేస్తూ గోయల్ దాఖలు చేసిన పిటిషన్‌పై కోర్టు విచారణ చేపట్టింది. తమ స్పందన తెలియజేయాలని హోం, కార్పొరేట్, న్యాయ శాఖలను ఆదేశిస్తూ తదుపరి విచారణను ఆగస్ట్ 23కు వాయిదా వేసింది. నిధుల కోసమే... గోయల్ దంపతుల తరఫున న్యాయవాది మణిందర్‌సింగ్ వాదనలు వినిపించారు. మే 25న వారిని విమానం నుంచి దించేసినప్పుడు, వారు విచారణను తప్పించుకునే ప్రయత్నం చేశారని చెప్పేందుకు ఏ ఆధారం చూపలేదన్నారు. హైకోర్టులో గోయల్ పిటిషన్ దాఖలు చేసే వరకు ఆయనపై ఎటువంటి కేసు నమోదు కాలేదని, జూలై 6న మాత్రం, పిటిషన్ విచారణకు వచ్చినప్పుడు, ఎస్ఎఫ్ఐవో నుంచి విచారణకు రావాలని గోయల్‌కు సమన్లు అందినట్టు వివరించారు. తమ క్లయింట్లు ఎన్ఆర్ఐ హోదా కలిగిన వారని, జెట్ గ్రూపు కోసం నిధులు సమకూర్చుకునేందుకు దుబాయి, లండన్ వెళ్లాలనుకున్నట్టు తెలిపారు. గోయల్‌కు బ్రిటన్ నివాస వీసా, యూఏఈ నివాస పర్మిట్ ఉన్నాయని, ఇవి ఈ నెల 10, 23వ తేదీల్లో గడువు రెన్యువల్ చేసుకోవాల్సి ఉన్నందున వెంటనే బ్రిటన్, యూఏఈ వెళ్లాల్సి ఉందన్నారు. అయితే, నరేష్ గోయల్ అభ్యర్థనకు వ్యతిరేకంగా అడిషనల్ సొలిసిటర్ జనరల్ మణిందర్ ఆచార్య వాదనలు వినిపిస్తూ... ఇది తీవ్రమైన రూ.18,000 కోట్ల మోసమని, ఎస్ఎఫ్ఐవో ఆధ్వర్యంలో విచారణ జరుగుతున్నట్టు తెలిపారు. ఈ విచారణలో గోయల్ పాల్గొని తన స్పందనను తెలియజేయాల్సి ఉందన్నారు. -
కోల్‌కతా మాజీ చీఫ్‌పై లుకౌట్ నోటీసు
న్యూఢిల్లీ: శారదా చిట్‌ఫండ్ కుంభకోణం కేసులో కోల్‌కతా మాజీ పోలీస్ కమిషనర్ రాజీవ్ కుమార్‌కు గట్టి షాక్ తగిలింది. రాజీవ్ దేశం విడిచి వెళ్లకుండా ఆదివారం ఆయనపై సీబీఐ లుకౌట్ నోటీసు జారీ చేసింది. ఈమేరకు అన్ని ఎయిర్‌పోర్టులు, ఇమిగ్రేషన్ అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. రూ.2,500 కోట్ల శారదా కుంభకోణం దర్యాప్తు వ్యవహారంపై సీబీఐ ఇటీవల సుప్రీంకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ‘రాజీవ్‌కు తప్పనిసరిగా నిర్బంధ విచారణ అవసరం. ఆయన దర్యాప్తునకు సహకరించకుండా సాకులు చెబుతూ తప్పించుకుంటున్నారు. ఆయన్ని ప్రశ్నించే సమయంలో అహంకారంతో వ్యవహరిస్తున్నారు’ అని సీబీఐ ఆరోపించింది. దీనిపై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు రాజీవ్ కుమార్ 27వ తేదీన జరిగే విచారణకు హాజరు కావాల్సిందేనని స్పష్టం చేసింది. దీంతోపాటు ఆయన్ను అరెస్టు చేయకుండా ఇచ్చిన ఆదేశాలను వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించింది. ‘ఈ కేసులో వేసిన సిట్ దర్యాప్తు సంస్థకు రాజీవ్ కుమార్ అప్పుడు ఇన్చార్జిగా ఉన్నారు. కుంభకోణానికి సంబంధించిన మొబైల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, పలువురు నేతల కీలక ఆధారాలను బాధితుల నుంచి స్వాధీనం చేసుకున్నారు. ఆ మొబైల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌లను ఫోరెన్సిక్ పరీక్షకు పంపకుండా ఆధారాలను నాశనం చేశారు’ అని సీబీఐ తెలిపింది. -
శివాజీ, రవిప్రకాశ్‌పై లుక్ అవుట్ నోటీసులు జారీ
-
రవిప్రకాశ్, శివాజీపై లుక్ అవుట్ నోటీసులు జారీ
సాక్షి, హైదరాబాద్ : నిధుల మళ్లింపు, ఫోర్జరీకి పాల్పడి అజ్ఞాతంలో ఉన్న టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్‌పై సైబరాబాద్ పోలీసులు లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు. రవిప్రకాశ్‌తో పాటు సినీ నటుడు గరుడ పురాణం శివాజీ, మాజీ సీఎఫ్‌వో మూర్తికి కూడా నిన్న అర్థరాత్రి సమయంలో ఈ నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది. ఈ మేరకు దేశంలోని అన్ని ఎయిర్‌పోర్టులను పోలీసులు అప్రమత్తం చేశారు. వీరిరువురు దేశం విడిచి పారిపోకుండా ఉండేందుకు పోలీసులు చర్యలు చేపట్టారు. కాగా ఇప్పటికే రవిప్రకాశ్ పాస్‌పోర్టును పోలీసులు సీజ్ చేసిన విషయం విదితమే. ఈ కేసులో విచారణకు హాజరు కావాలని రవిప్రకాశ్‌తో పాటు శివాజీకి పోలీసులు పలుమార్లు నోటీసులు ఇచ్చినా...వారు గైర్హాజరు అయ్యారు. దీంతో వాళ్లకు ఇచ్చిన గడువు పూర్తి కావడంతో రవిప్రకాశ్, శివాజీలను సైబరాబాద్ పోలీసులు ఏ క్షణంలో అయినా అరెస్టు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. మరోవైపు మాజీ సీఎఫ్‌వో మూర్తి విచారణ నిమిత్తం సైబరాబాద్ పోలీసుల ఎదుట హాజరు అయ్యారు. ఈ విచారణలో ఆయన పలు కీలక విషయాలు వెల్లడించినట్లు సమాచారం. ఇక టీవీ9లో వీరు చేసిన అక్రమాలు, తప్పుడు అగ్రిమెంట్లు, ఫోర్జరీ సంతకాలతో తప్పుదోవ పట్టించటం, నిధులు మళ్లింపు, టీవీ9 లోగోను విక్రయించాలనే దురాలోచన... ఇలాంటి అక్రమాలపై ఇప్పటికే సైబర్ క్రైం, బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదు అయ్యాయి. 2018 ఫిబ్రవరిలో నటుడు శివాజీ, రవి ప్రకాష్, శక్తి, టీవీ9 మాజీ సీఎఫ్‌వో మూర్తి, మోజో టీవీ చైర్మన్ హరికిషణ్ మధ్య ఈ-మెయిల్స్ ద్వారా జరిగిన కుట్రను కూడా సైబర్ క్రైం పోలీసులు బయటపట్టారు. టీవీ9 లోగోను సైతం రూ. 99వేలకు విక్రయించటానికి తప్పుడు అగ్రిమెంట్ కూడా చేసినట్లు పోలీసులు గుర్తించారు. తాజాగా పోలీసులు లుక్ ఔట్ నోటీసులు జారీ చేయడంతో ఇప్పటికైనా రవి ప్రకాష్, శివాజీ అజ్ఞాతం వీడుతారా ? లేదా ? మరింత ఆసక్తిగా మారింది. సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి : శివాజీ, రవిప్రకాశ్‌పై లుక్ అవుట్ నోటీసులు జారీ -
మాల్యా కేసు : టాప్ సీబీఐ ఆఫీసర్‌పై ఆరోపణలు
న్యూఢిల్లీ : లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా వ్యవహారంలో ఒక్కొక్కరూ బుక్కవుతున్నారు. తాను దేశం విడిచి పారిపోవడం అరుణ్ జైట్లీకి తెలుసని మూడు రోజుల క్రితం విజయ్ మాల్యా వెల్లడించగా.. సీబీఐ అధికారుల అలసత్వం ప్రదర్శించడంతోనే మాల్యా పరారైనట్టు నిన్న సీనియర్ సుప్రీంకోర్టు న్యాయవాది దుష్యంత్ దావే ఆరోపించారు. తాజాగా సీబీఐ జాయింట్ డైరెక్టర్ ఏకే శర్మ వల్లే విజయ్ మాల్యా దేశం విడిచి పారిపోగలిగాడని కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ ఆరోపిస్తున్నారు. మాల్యా కోసం ఇచ్చిన లుక్ ఔట్ నోటీసులను ఆయన బలహీనపరిచే పారిపోయేందుకు కారణమయ్యారని రాహుల్ శనివారం ట్వీట్ చేశారు.ఇదే అధికారి నీరవ్ మోదీ, మెహుల్ చోస్కీల పరారీ ప్రణాళికల కోసం పని చేశారని రాహుల్ ఆరోపించారు. ప్రధాని మోదీ ఎంతో ప్రత్యేకంగా చూసే శర్మ గుజరాత్ కేడర్ అధికారని విపక్ష నేత విమర్శించారు. వూప్సూ... ఇన్వెస్టిగేషన్ అంటూ రాహుల్ ట్వీట్ చేశారు. CBI Jt. Director, A K Sharma, weakened Mallya’s “Look Out” notice, allowing Mallya to escape. Mr Sharma, a Gujarat cadre officer, is the PM’s blue-eyed-boy in the CBI. The same officer was in charge of Nirav Modi & Mehul Choksi’s escape plans. Ooops... investigation! — Rahul Gandhi (@RahulGandhi) September 15, 2018 అయితే ఈ ఆరోపణలను సీబీఐ కొట్టిపారేసింది. అవన్నీ నిరాధారమని పేర్కొంది. ‘సీబీఐ సీనియర్ అధికారులపై కొంతమంది వ్యక్తులు నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారు. ఆయన్ను అరెస్ట్ చేయడానికి లేదా అదుపులోకి తీసుకోవడానికి అప్పటికీ సీబీఐ వద్ద అవసరమైన ఆధారాలు లేవు. ఆ కారణంతోనే మాల్యాకు వ్యతిరేకంగా జారీ చేసిన లుక్ అవుట్ నోటీసును మార్చాలని నిర్ణయం తీసుకున్నాం’ అని సీబీఐ అధికార ప్రతినిధి చెప్పారు. హై ప్రొఫైల్, వివాదాస్పదమైన కేసులో ప్రధాని ఆమోదం లేకుండా లుక్ ఔట్ నోటీసులను సీబీఐ మార్చడం ఎలా సాధ్యమని రాహుల్ సంధించిన ప్రశ్నలపై సీబీఐ అధికారి ఈ విధంగా స్పందించారు. నీరవ్ మోదీ, మెహుల్ చోక్సి వ్యవహారంపై కూడా స్పందించిన సీబీఐ అధికార ప్రతినిధి... ‘వారు దేశం విడిచి పారిపోయిన నెల తర్వాత సీబీఐకు నీరవ్, చోక్సిల విషయంపై పీఎన్బీ నుంచి ఫిర్యాదు పొందింది. వారు దేశం విడిచి పారిపోవడానికి సీబీఐ అధికారి కారణం అనడానికి ఎలాంటి ఆధారం లేదు. బ్యాంక్ నుంచి ఫిర్యాదు పొందిన వెంటనే, సీబీఐ చర్యలు తీసుకోవడం ప్రారంభించింది’ అని తెలిపారు. ఏకే శర్మ ప్రస్తుతం అదనపు డైరెక్టర్ విభాగం, అవినీతి నిరోధక యూనిట్లలో పనిచేస్తున్నారు. ఎంతో కీలకమైన కేసుల మాత్రమే ఆయన చూసుకుంటారు. శర్మ, గుజరాత్ కేడర్‌కు చెందిన ఐపీఎస్ ఆఫీసర్. -
మాల్యా పలాయనం ప్రధానికీ తెలుసు: రాహుల్
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి తెలియకుండానే లిక్కర్ కింగ్ విజయ్‌మాల్యా దేశం నుంచి పారిపోయాడనడం నమ్మశక్యంగా లేదని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. భారత్ వదిలి బ్రిటన్‌కు వెళ్లేముందు కేంద్ర ఆర్థిక మంత్రి జైట్లీతో తాను సమావేశమయ్యానన్న మాల్యా వ్యాఖ్యపై రాహుల్ స్పందించారు. ‘ప్రధానికే సీబీఐ జవాబుదారీగా ఉంటుంది. అలాంటప్పుడు మాల్యాపై జారీ చేసిన లుకౌట్ నోటీసుల్లో ‘నిర్బంధించు’ బదులు ‘తెలియపరుచు’ అని మార్చడం ద్వారా లిక్కర్ కింగ్ దేశం నుంచి పలాయనం అయ్యేందుకు సీబీఐ సహకరించిందనడం నమ్మశక్యంగా లేదు’ అని అన్నారు. -
సీబీఐ ఎదుట హాజరైన కార్తీ
సాక్షి, న్యూఢిల్లీ : అవినీతి, ఫెరా ఉల్లంఘనల కేసుకు సంబంధించి కేంద్ర ఆర్థిక శాఖ మాజీ మంత్రి పీ చిదంబరం కుమారుడు కార్తీ చిదంబరం బుధవారం సీబీఐ ఎదుట హాజరు అయ్యారు. ఐఎన్ఎక్స్ మీడియా విదేశీ పెట్టుబడుల క్లియరెన్స్ కేసులో ఈనెల 23న సీబీఐ ఎదుట హాజరుకావాలని కార్తీని సుప్రీం కోర్టు ఆదేశించింది. గతంలో కార్తీకి సీబీఐ జారీ చేసిన లుక్అవుట్ నోటీసులపై మద్రాస్ హైకోర్టు స్టే ఇచ్చింది. ఈ ఉత్తర్వులను సవాల్ చేస్తూ సుప్రీం కోర్టును సీబీఐ ఆశ్రయించగా కార్తీకి వ్యతిరేకంగా సర్వోన్నత న్యాయస్థానం దిగువ కోర్టు జారీ చేసిన స్టే ఉత్తర్వులను తోసిపుచ్చింది. సీబీఐ ఎదుట హాజరయ్యేందుకు ఎందుకు వెనుకాడుతున్నారని కార్తీని సూటిగా ప్రశ్నించింది. విచారణకు హాజరయ్యేందుకు తనకు భయం లేదని, తన భద్రతపైనే ఆందోళన చెందుతున్నానని కార్తీ చిదంబరం కోర్టుకు నివేదించారు. దీంతో న్యాయవాదితో కలిసి సీబీఐ ఎదుట విచారణకు హాజరయ్యేందుకు కార్తీని సుప్రీం కోర్టు అనుమతించింది. -
చిదంబరం తనయుడికి ఊరట
సాక్షి, చెన్నై: కేంద్ర ఆర్థికశాఖ మాజీ మంత్రి పీ చిదంబరం తనయుడు కార్తీ చిదంబరానికి మద్రాస్ హైకోర్టులో ఊరట కలిగింది. సీబీఐ గాలిస్తున్న అజ్ఞాత నేరస్తుల జాబితాలో చేరుస్తూ జారీ చేసిన లుకౌట్ నోటీసులపై హైకోర్టు స్టే విధించింది. దీంతో ఆయన విదేశాలకు వెళ్లేందుకు అడ్డంకి తొలగినట్లయింది. కాంగ్రెస్ సభ్యుడిగా కొనసాగుతున్న కార్తీ ఓ వ్యాపార వేత్త కూడా. ఆయన వివిధ కంపెనీల ఏర్పాటుకు సంబంధించి అవినీతికి పాల్పడ్డారని, విదేశీ మారకం విషయంలో అవకతవకలకు పాల్పడ్డారనే ఆరోపణల పేరిట ఐటీ, సీబీఐ, ఈడీ కేసులు నమోదు చేసింది. అయితే, ఈ సంస్థలు నిర్వహిస్తున్న విచారణకు కార్తీ హాజరుకావడం లేదని ఆయనపై లుకౌట్ నోటీసులను విడుదల చేసింది. సీబీఐ గాలిస్తున్న అజ్ఞాత నేరస్తుల జాబితాలో కార్తీని కేంద్ర హోం మంత్రిత్వశాఖ చేర్చింది. ఆయన విదేశీయానంపై నిషేధం విధించింది. అయితే, లుకౌట్ నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో..వీటిని వ్యతిరేకిస్తూ కార్తీ మద్రాస్ హైకోర్టును ఆశ్రయించగా ఆయనకు ఊరట లభించింది. షెల్ కంపెనీల నుంచి భారీ ఎత్తున విదేశీ మారకద్రవ్యం పొందినట్లుగా కార్తీపై సీబీఐ అభియోగం. -
ఎయిర్‌పోర్టులో మహిళ అరెస్టు
హైదరాబాద్: శంషాబాద్ ఎయిర్‌పోర్టులో శనివారం ఉదయం ఓ మహిళను భద్రత సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఆమెను ఎయిర్‌పోర్టు పోలీసులకు అప్పగించారు. ఈ రోజు ఉదయం ఆమె జాంబియా నుంచి విమానంలో శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకుంది. అంతలో ఆమెను భద్రత సిబ్బంది చుట్టుముట్టి.. అదుపులోకి తీసుకున్నారు. అయితే అదుపులోకి తీసుకున్న మహిళ గుజరాత్ రాష్ట్రానికి చెందినదని సమాచారం. ఆమెపై లుక్ - అవుట్ నోటీసులు జారీ చేసినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఆమెను అదుపులోకి తీసుకున్నట్లు భద్రత సిబ్బంది చెప్పారు. మరిన్ని వివరాలు తెలియవలసి ఉంది. -
గ్యాంగ్‌స్టర్ అయూబ్‌ఖాన్‌పై లుకవుట్ నోటీస్
హైదరాబాద్: కరడుగట్టిన గ్యాంగ్‌స్టర్ అయూభ్ ఖాన్‌పై హైదరాబాద్ పోలీసులు సోమవారం లుకవుట్ నోటీస్ జారీ చేశారు. అయూబ్‌ఖాన్‌పై హైదరాబాద్ పరిధిలో ఎన్నో కేసులు నమోదై ఉన్నాయి. ఖాలాపత్తర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇతడిపై రౌడీషీట్ నమోదై ఉంది. ఈ నేపథ్యంలో లుకవుట్ నోటీస్ జారీ చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. -
సౌమ్యదీప్కు లుకౌట్ నోటీసులు జారీ
-
సోమదీప్‌కు లుకౌట్ నోటీసులు జారీ
హైదరాబాద్ : నాలుగు రోజుల క్రితం కూకట్పల్లి ప్రగతి నగర్ కారు ప్రమాదం కేసులో కొత్త కోణం వెలుగు చూసింది. కారు చెట్టును ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు సాప్ట్వేర్ ఇంజినీర్లు మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే ఆ సమయంలో కారు నడిపిన సోమదీప్ బసు అమెరికాకు పరారీ అయ్యాడు. దాంతో పోలీసులు అతనికి లుకౌట్ నోటీసులు జారీ చేశారు. వివరాల్లోకి వెళితే పశ్చిమ బెంగాల్‌కు చెందిన సుదీప్ (26), ఉత్యా (23), సౌరవ్ మైథీ (30), నిలాద్రి (29)లు కొండాపూర్‌లో నివాసముంటున్నారు. సుదీప్ , ఉత్యా, సౌరవ్లు సాప్ట్వేర్ ఇంజనీర్లు కాగా... నిలాద్రి ఫార్మ కంపెనీలో పని చేస్తున్నాడు. బాచుపల్లిలో ఉండే తన స్నేహితుడు బసు శుక్రవారం రాత్రి విందు ఇస్తానంటే నలుగురూ కారులో వెళ్లారు. విందు ముగించుకొని శనివారం తెల్లవారుజామున తిరిగి వస్తుండగా ప్రగతినగర్ సమీపంలో కారు అదుపు తప్పి రోడ్డు పక్కనే ఉన్న చెట్టును ఢీకొట్టింది. సుదీప్, ఉత్యా అక్కడికక్కడే మృతి చెందగా, తీవ్రగాయాలకు గురైన సౌరవ్, నిలాద్రిలను పోలీసులు కేపీహెచ్‌బీ కాలనీలోని ఆస్పత్రికి తరలించారు. అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కాగా తన అమెరికా ప్రయాణానికి ఆటంకం ఏర్పడుతుందనే ఉద్దేశంతో ప్రమాదం జరిగిన సమయంలో సుదీప్ కారును నడిపినట్లు సోమదీప్ పోలీసులను తప్పుదారి పట్టించాడు. సుదీప్ చనిపోవటంలో ఆ నేరం తనపైకి రాదని భావించాడు. అయితే పోలీసులు లోతుగా విచారణ జరపటంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. పోలీసులు సోమదీప్ కోసం గాలిస్తున్నారు.