హైదరాబాద్: శంషాబాద్ ఎయిర్పోర్టులో శనివారం ఉదయం ఓ మహిళను భద్రత సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఆమెను ఎయిర్పోర్టు పోలీసులకు అప్పగించారు. ఈ రోజు ఉదయం ఆమె జాంబియా నుంచి విమానంలో శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకుంది. అంతలో ఆమెను భద్రత సిబ్బంది చుట్టుముట్టి.. అదుపులోకి తీసుకున్నారు.
అయితే అదుపులోకి తీసుకున్న మహిళ గుజరాత్ రాష్ట్రానికి చెందినదని సమాచారం. ఆమెపై లుక్ - అవుట్ నోటీసులు జారీ చేసినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఆమెను అదుపులోకి తీసుకున్నట్లు భద్రత సిబ్బంది చెప్పారు. మరిన్ని వివరాలు తెలియవలసి ఉంది.