'గోడ దూకి వెళ్లైనా పాదయాత్ర చేస్తా'
Published Fri, Aug 18 2017 11:50 AM | Last Updated on Tue, Sep 12 2017 12:25 AM
కిర్లంపూడి: తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడిలో శుక్రవారం ఉద్రిక్తత చోటుచేసుకుంది. పోలీసుల ఒత్తిడిని తట్టుకోలేక ఏదో ఒక రోజు గోడ దూకి వెళ్లైనా పాదయాత్ర చేస్తానని కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం తెలిపారు. ముద్రగడ మరోసారి పాదయాత్ర చేసేందుకు ప్రయత్నించగా పోలసులుల అడ్డుకున్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం చంద్రబాబు తీరుకు నిరసనగా తన నివాసం వద్ద ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఆందోళన చేస్తామని పేర్కొన్నారు. ముద్రగడ గేటు బయట చేపట్టిన ఆందోళనకు కాపులు తరలివచ్చి మద్దతు తెలిపారు. చంద్రబాబుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కార్యక్రమంలో కాపు జేఏసీ నాయకులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement