‘నన్ను మోసం చేశారు. నేను ఇక్కడ నరకం అనుభవిస్తున్నాను.. దయ చేసినన్ను ఎవరైనా కాపాడండి’ అంటూ 46 ఏళ్ల ఒక మహిళ కన్నీటి ఆక్రందన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. లూధియానాకు చెందిన 46 ఏళ్ల కుల్దీప్ కౌర్‌ను ట్రావెల్ ఏజెంట్ మోసం చేశాడు. ప్రస్తుతం కుల్దీప్ కౌర్.. సౌదీలోని మహమ్మద్ అహ్మద్, సారా దంపతుల ఇంట్లో కట్టుబానిసగా పనిచేస్తోంది.