bonded labour
-
ఐదేళ్లుగా చాకిరీ, ప్రాణం పోతున్నా వినలేదు!
భోపాల్: వెట్టి చాకిరీకి కాలం చెల్లినా దేశంలోని చాలా చోట్ల ఇంకా ఈ దోపిడీ వ్యవస్థ కొనసాగుతోంది. పూటగడవక ఇబ్బందుల్లో ఉన్నవారికి కొంత మొత్తం ముట్టజెప్పి.. ఆ మొత్తం తిరిగి చెల్లించేవరకు ఎలాంటి వేతనం ఇవ్వకుండా చాకిరీ చేయించుకునే విధానం (బాండెడ్ లేబర్) మధ్యప్రదేశ్‌లో తాజాగా వెలుగు చూసింది. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న తమ బిడ్డను ఆస్పత్రికి తీసుకెళ్లాలని ఆ తల్లిదండ్రులు ఎంత వేడుకున్నా యజమాని కనికరించలేదు. దీంతో వైద్యం అందక ఎనిమిదేళ్ల బాలుడు ప్రాణాలు విడిచాడు. గుణాలో గత ఆదివారం ఈ అమానుష ఘటన చోటుచేసుకుంది. వివరాలు.. పహల్వాన్ సింగ్ అనే వ్యక్తి ఎగువ తరగతికి చెందిన ఓ వ్యక్తి వద్ద ఐదేళ్ల కిత్రం రూ.25 వేలు అప్పుగా తీసుకున్నాడు. వాటిని తిరిగి చెల్లించేవరకు తన పంట పొలంలో పనిచేయాలని అప్పు ఇచ్చిన వ్యక్తి కాగితాలపై సంతకాలు తీసుకున్నాడు. బాకీ చెల్లించేవరకు వారికి రూపాయి కూడా ఇవ్వనని ఒప్పందం చేసుకున్నాడు. ఇక అప్పటినుంచి పవహల్వాన్ సింగ్ కుటుంబం పనిచేస్తూనే ఉంది. ఈక్రమంలో వారం కిత్రం అతని కుమారుల్లో ఒకరు (8) అనారోగ్యం బారినడపడ్డాడు. చిన్నారిని ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు యజమానిని డబ్బులు అడగ్గా.. పవహల్వాన్ సింగ్‌పై దాడి చేశాడు. (చదవండి: ముగ్గుర్ని చంపి, శవాలతో శృంగారం) అదేసమయంలో పరిస్థితి విషమించడంతో చిన్నారి ప్రాణాలు విడిచాడు. కాగా, బాధితుడి ఫిర్యాదు మేరకు ఎస్సీఎస్టీ అట్రాసిటీ కింద కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు. వెట్టిచాకిరీ చేయించుకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఈ వ్యవస్థను రూపుమాపేందుకు కేంద్ర ప్రభుత్వం పటిష్ట చర్యలు చేపట్టాలని అభిప్రాయపడ్డారు. గుణ ప్రాంతంలో వెట్టి బతుకులపై ఆరా తీసుతీసున్నామని వెల్లడించారు. పహల్వాన్ సింగ్ మరో ఇద్దరు పిల్లలు కూడా మలేరియాతో బాధపడుతున్నారని, వారిని ఆస్పత్రిలో చేర్పించామని తెలిపారు. (చదవండి: తప్పు ఒప్పుకుంటున్నా, మాస్క్ పెట్టుకుంటా) -
హోంగార్డులతో ఉన్నతాధికారి వెట్టి చాకిరి
హైదరాబాద్ : హోంగార్డులతో వెట్టిచాకిరీ చేయించుకుంటున్న విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. తెలంగాణ రాష్ట్ర పోలీస్ శిక్షణా కేంద్రంలో ఉన్నతాధికారిగా పనిచేస్తున్న రాఘవరావు హోంగార్డులతో సొంత పనులు చేయించుకుంటున్నట్లు ఆరోపణలు వచ్చాయి. రాజేంద్రనగర్ కిస్మత్‌పురాలో సొంత విల్లా నిర్మాణంలో హోంగార్డులతో పనులు చేయిస్తున్నారని పలువురు హోంగార్డులు మీడియాకు విషయం లీక్ చేశారు. పని చేయకపోతే హోంగార్డులను బెదిరింపులకు గురి చేస్తున్నారని గోప్యంగా విషయం వెల్లడించారు. పోలీసుశాఖలో ఇంకా ఆర్డర్లీ వ్యవస్థ కొనసాగటం పట్ల ఆశ్చర్యం వ్యక్తమవుతోంది. గతంలో ఆర్బీవీఆర్లో ఆ ఉన్నతాధికారి అసిస్టెంట్ డైరెక్టర్ అడ్మిన్‌గా పని చేశారు. 2009లో రిటైర్డ్ అయినా తిరిగి ఆర్బీవీఆర్లోనే ఓఎస్డీగా అధికారుల అండతో జాయిన్ అయ్యాడు. ఇన్నేళ్లుగా అదే పదవిలో కొనసాగుతుండడంతో అతనికి ఎదురు చెప్పేవాళ్లు కరువయ్యారు. -
‘నరకంలో ఉన్నాను.. కాపాడండి’
సాక్షి, న్యూఢిల్లీ : ‘నన్ను మోసం చేశారు. నేను ఇక్కడ నరకం అనుభవిస్తున్నాను.. దయ చేసినన్ను ఎవరైనా కాపాడండి’ అంటూ 46 ఏళ్ల ఒక మహిళ కన్నీటి ఆక్రందన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. లూధియానాకు చెందిన 46 ఏళ్ల కుల్దీప్ కౌర్‌ను ట్రావెల్ ఏజెంట్ మోసం చేశాడు. ప్రస్తుతం కుల్దీప్ కౌర్.. సౌదీలోని మహమ్మద్ అహ్మద్, సారా దంపతుల ఇంట్లో కట్టుబానిసగా పనిచేస్తోంది. ఆ ఇంట్లో ఆమె పడుతున్న కష్టాలు, ఇబ్బందులు శత్రువు కూడా పడకూడదని.. ఆమె కన్నీటితో చెబుతోంది. ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకూ.. ఇంటి యజమానులు ఆమె మీద.. శారీరక, లైంగిక దాడి చేస్తారని కన్నీళ్లు పెట్టుకుంటూ కుల్దీప్ చెబుతోంది. అత్యంత కఠిన, దారుణ పరిస్థితుల మధ్య పనిచేస్తున్నట్లు కుల్దీప్ వీడియోలో చెప్పింది. ఎవరైనా నన్ను ప్రాణాలతో కాపాడండి.. అని కుల్దీప్ వీడియోలో వేడుకుంటోంది. జీవితంలో మళ్లీ ఇంటిని, సొంత మనుషులను చూడాలని ఉందంటూ.. ఆమె పడుతున్న ఆవేదన చూస్తే.. ఏ వ్యక్తి అయినా బాధపడాల్సిందే. ఆమె ఫోన్ నెంబర్, ఇతర వివరాలు వీడియోలో ఉన్నాయి. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. -
‘నరకంలో ఉన్నాను.. కాపాడండి’
-
ఊరుకాని ఊరిలో వెట్టిచాకిరీ
బుట్టాయగూడెం : పొట్టకూటి కోసం ఊరుకాని ఊరు వెళ్లిన ఆ గిరిజనులను అక్కడి యజమానులు నిర్బంధించి వెట్టిచాకిరీ చేయిస్తున్నారు. దీనిని భరించలేని ఇద్దరు పారిపోయి సొంతూరు చేరారు. అక్కడ తాము పడిన అవస్థలను స్థానికులకు వివరించారు. దీంతో అక్కడే ఉండిపోయిన 8 మందికి చెందిన కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. బాధితుల కథనం ప్రకారం.. బుట్టాయగూడెం మండలం రెడ్డిగణపవరానికి చెందిన పదిమంది గిరిజనులు గుండి సత్యనారాయణ, కుర్సా కన్నయ్య, పూనెం లక్ష్మణరావు, కె.వెంకటేశ్వరరావు, జి.వెంకటేశ్వరరావు, కె.సంకురుడు, కె.బోడయ్య, శివుడు భీమయ్య, కేతా శ్రీను, పరిమిరాజు చేపలు పట్టే పని కోసం కర్నూలు జిల్లా తిప్పయ్యపాలెం గ్రామానికి వెళ్లారు. వీరిని జిల్లాలోని కొవ్వూరుకు చెందిన శ్రీనివాసరావు అనే వ్యక్తి నెలకు రూ.6,500 చొప్పున జీతం ఇస్తామని చెప్పి తీసుకెళ్లాడు. పనికి వెళ్లే ముందు కొవ్వూరులో బిర్యానీతో పాటు మద్యం పోయించాడు. అక్కడికివెళ్లిన తర్వాత స్నానానికి సబ్బులు ఇచ్చారు. ఆ తర్వాత టీవీలు ఉన్న గదుల్లో వసతి చూపించారు. దీంతో తమ దశ తిరిగిపోయిందని గిరిజనులు సంబరపడ్డారు. తీరా పనికి తీసుకెళ్లి వెట్టిచాకిరీ చేయించడం మొదలెట్టారు. రాత్రీపగలూ తేడా లేకుండా పనులు చేయించారు. కనీసం తిండి కూడా పెట్టడం లేదు. ఎవరూ పారిపోకుండా గస్తీ కోసం సిబ్బందిని నియమించారు. తిండిపెట్టడం లేదని ప్రశ్నిస్తే దారుణంగా కొడుతున్నారు. ఈ చిత్రహింసలు భరించలేని కేతా శ్రీను, పరిమి రాజు గస్తీకాసే వ్యక్తి కళ్లుగప్పి బయటపడ్డారు. చుట్టుపక్కల గ్రామాల్లో డబ్బులు అడిగి సొంతూరు చేరారు. పనిప్రదేశంలో ఈ గ్రామానికి చెందిన వారితోపాటు పడమర రేగులకుంట, జీలుగుమిల్లి, కుక్కునూరు, కూనవరం, చత్తీస్‌గఢ్ ప్రాంతాలకు చెందిన అమాయక గిరిజనులు కూడా ఉన్నట్టు బాధితులు చెబుతున్నారు. ఇదిలా ఉంటే తమతోపాటు పనికోసం వచ్చిన జి.వెంకటేశ్వరరావు కొవ్వూరు నుంచే కనబడలేదని, వేరే కంపార్ట్మెంట్లో ఎక్కాడని భావించామని తెలిపారు. దీనిపై అధికారులు విచారణ జరిపి నిర్బంధంలో ఉన్న తమ వారిని విడిపించాలని కోరుతున్నారు. ఈ వ్యవహారంపై పోలీసులకు కూడా ఫిర్యాదు చేస్తామని వారు చెప్పారు. పనికి వెళ్లి చిక్కుకుపోయిన కుటుంబాల వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.