
హోంగార్డులు
హైదరాబాద్ : హోంగార్డులతో వెట్టిచాకిరీ చేయించుకుంటున్న విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. తెలంగాణ రాష్ట్ర పోలీస్ శిక్షణా కేంద్రంలో ఉన్నతాధికారిగా పనిచేస్తున్న రాఘవరావు హోంగార్డులతో సొంత పనులు చేయించుకుంటున్నట్లు ఆరోపణలు వచ్చాయి. రాజేంద్రనగర్ కిస్మత్‌పురాలో సొంత విల్లా నిర్మాణంలో హోంగార్డులతో పనులు చేయిస్తున్నారని పలువురు హోంగార్డులు మీడియాకు విషయం లీక్ చేశారు. పని చేయకపోతే హోంగార్డులను బెదిరింపులకు గురి చేస్తున్నారని గోప్యంగా విషయం వెల్లడించారు.
పోలీసుశాఖలో ఇంకా ఆర్డర్లీ వ్యవస్థ కొనసాగటం పట్ల ఆశ్చర్యం వ్యక్తమవుతోంది. గతంలో ఆర్‌బీవీఆర్‌లో ఆ ఉన్నతాధికారి అసిస్టెంట్ డైరెక్టర్ అడ్మిన్‌గా పని చేశారు. 2009లో రిటైర్డ్ అయినా తిరిగి ఆర్‌బీవీఆర్‌లోనే ఓఎస్డీగా అధికారుల అండతో జాయిన్ అయ్యాడు. ఇన్నేళ్లుగా అదే పదవిలో కొనసాగుతుండడంతో అతనికి ఎదురు చెప్పేవాళ్లు కరువయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment